Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICS TAKING DIFFERENT TURN AS OPPOSITIONS TAKING WEAPON LIKE NDA IN 2014 FULL DETAILS HERE PRN GNT

AP Politics: 2014 సీన్ 2024లో రిపీట్ కాబోతోందా..? ఏపీలో ఆ పార్టీకి అదే మైనస్ అవుతుందా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

2014 ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా మార్మోగిన నినాదం. అప్పటి అధికార యూపీఏపై ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి వదిలిన సమ్మోహనాస్త్రం పేరే అసహనం. దెబ్బకి దేశప్రజలు అందరూ అసహనంతో ఊగిపోయారు. ప్రసతుతం ఆంధ్రప్రదేశ్ లోనూ అదే మాట వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  2014 ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా మార్మోగిన నినాదం. అప్పటి అధికార యూపీఏపై ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష ఎన్డీఏ (NDA) కూటమి వదిలిన సమ్మోహనాస్త్రం పేరే అసహనం. దెబ్బకి దేశప్రజలు అందరూ అసహనంతో ఊగిపోయారు. యూపీఏ (UPA) ప్రభుత్వం చేస్తున్న స్కాములు, పెరిగిపోయిన నిత్యవసర ధరలు, నిరుద్యోగ సమస్య మొదలగు అంశాలు అన్నీ కలగలిసి అసహనం రూపంలో తుఫానుగా మారి అప్పటి యుపీఏ ప్రభుత్వాన్ని కూకటి వ్రేళ్ళతో పీకిపడేసి ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారం అందించింది. అప్పట్లో ప్రజలకు, మీడియాకి ఇప్పటికంటే ఎంతోకొంత మెరుగైన భావప్రకటనా స్వేచ్ఛ ఉండబట్టే అసహనం అంతటిస్థాయిలో పెల్లుబికటానికి అవకాశం లభించింది. ఇప్పుడు అదే మాట.. అవే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషలుకులు అభిప్రాయపడుతున్నారు.

  ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో అసహనం లేదా అంటే ఉందనే చెప్పాలి కాకపోతే తమ అసహనం వ్యక్తం చేస్తే ప్రభుత్వం ఎక్కడ తమని ఇబ్బందులు పాలుచేస్తుందోనని అటు ప్రజలు, ఇటు మీడియా చాలా వరకు మౌనవ్రతం పాటిస్తున్నాయనేది సత్యం. కానీ ఓ బలమైన వర్గంలో మాత్రం భయం బెరుకు లేకుండా అసహనం పెల్లుబికుతోంది. వారు రాజ్యాంగ వ్యవస్థలు తమని ఏమీ చేయలేవనే ధైర్యంతో ఆ మాటకొస్తే తామే వ్యవస్థలను శాసించే సామంత రాజులమనే ధీమాతో తమ అసహనాన్ని ధైర్యంగా వెళ్ళగక్కుతున్నారు.

  ఇది చదవండి: ఏపీలో తక్కువ ధరకే ప్లాట్లు.. ప్రభుత్వం సరికొత్త పథకం.. సీఎం జగన్ శ్రీకారం..


  పంటలకు గిట్టుబాట ధర కల్పించమన్న రైతుల పైనా, తమ అక్రమ దందాలు బట్ట బయలు చేసిన మీడియా సంస్థల పైన, తమ మాటవినని సినిమా పరిశ్రమపైన, చేసిన పనులకు బిల్లులు చెల్లించండి మహాప్రభో అని అడిగిన కాంట్రాక్టర్లపైన, తాము ఇచ్చింది తీసుకుని చెప్పింది చేయని ప్రభుత్వ ఉద్యోగులపైన ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే అయ్యవార్ల అసహనానికి కారణాలు కోకొల్లలు.

  ఇది చదవండి: ఆ పదాన్ని సరిగ్గా పలికితే తప్పుకుంటా.. సీఎంకు రఘురామ సవాల్..! సంక్రాంతి వస్తానన్న రాజుగారు


  ఐదేళ్ళ తమకి అధికారం ఇచ్చింది ప్రజలకి సేవచేయటానికి అని కాకుండా ప్రజలపైన, ప్రజాస్వామ్య వ్యవస్థలపైనా పెత్తనం చేయడానికి అని, ఎన్నికలలో తాము ఖర్ఛు పెట్టిన సొమ్ముకి కొన్ని వందలు వేల రెట్లు తిరిగి సంపాదించుకోవడానికే అనే విధంగా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులలో అసహనం తారాస్థాయికి చేరిందా అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి.

  ఇది చదవండి: ఏపీలో సంక్రాంతి తర్వాతే నైట్ కర్ఫ్యూ.. ప్రభుత్వం ఉత్తర్వులు.. కొత్త తేదీలు ఇవే..


  గతంలో నాయకులు తమ అసహనాన్ని తమలోనే కప్పిపుచ్చి అదును చూసి దెబ్బకొట్టే వారు. ఇప్పటి తరం నాయకులలో ఆపాటి హుందాతనం కూడా పాటించేంత ఓర్పు నేర్పు నశిస్తున్నాయని అందుకే తమని అధికారంలోకి తెచ్చిన వారు మళ్ళీ ఐదేళ్ళు తిరిగేలోపు తమని కూలద్రోసి కూర్చో బెడుతున్నారనే సత్యం తెలుసుకోలేక పోతున్నారని రాజకీయ విశ్లేషకుల వాదన.సంక్షేమ పధకాల పేరుతో పాతికో పరకొ పడేస్తే ప్రజలు పడి ఉంటారు అన్న భావన నేతల్లో పేరుకు పోయిందనేది రాజకీయ మేధావుల మాట.

  ఇది చదవండి: ఆమెకు భర్త లేడు.. అతడికి భార్యలేదు.. ఇద్దరికీ మిస్డ్ కాల్ పరిచయం.. ఓ అర్ధరాత్రి షాకింగ్ ఘటన


  ఐతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమీటంటే.. నేతల్లో ఉన్న అసహనం చిరుజల్లులాంటిదైతే.. అదే అసహనం ప్రజలలో చెలరేగితే అది భయంకరమైన తుఫానుగా మారి తాము కూర్చున్న కుర్చీలను సైతం ఎగరేసుకుపోతుందనే నగ్నసత్యం నేతలు తెలుసుకుంటే మంచిదంటున్నారు రాజకీయ పండితులు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics

  తదుపరి వార్తలు