ANDHRA PRADESH POLITICAL NEWS YCP SENIOR LEADER DHARMANA PRASAD RAO SENSATIONAL COMMENTS ON PADDY NGS VZM
YCP MLA: వరి వద్దు.. రొయ్యల సాగు ముద్దు.. తప్పుచేశానని ఒప్పుకున్న వైసీపీ సీనియర్ నేత
మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు
Dharmana on Paddy: వరి సాగు చేసే రైతులకు ఇక ప్రభుత్వం ఏం చేయలేదని పరోక్షంగా చెప్పారు మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు. రాష్ట్రంలో వ్యవసాయంలో వరిసాగుతో లాభం లేదని.. ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టం తీరడం లేదన్నారు. రొయ్యలసాగు చేయడమే మంచిదన్నారు.. ఆ విషయంలో తాను తప్పు చేశాను అని ఒప్పుకున్నారు.
Dharmana on Paddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. నిన్న నెల్లూరు (Nellore) సీనియర్ నేత.. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Anam Rama Narayana Reddy)వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కొంతకాలంగా ప్రభుత్వంపై, పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతూ కీలక వ్యాఖ్యలు చేస్తున్న ఆయన... ఇప్పుడు ఏకంగా పోలీస్ వ్యవస్థనే టార్గెడ్చేశారు. రాష్ట్రంలో నక్సలిజం తగ్గింది కానీ.. స్థానిక మాఫియా పెరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగలేదు. తాజాగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasad Rao) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. వ్యవసాయంలో వరిసాగు వలన లాభం లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్ని చేసినా వరి రైతుల కష్టం తీరడం లేదని అన్నారు. అంటూ ఇంక చేయడానికి ఏం లేదంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.. అందుకే వరి వద్దు అని చెబుతూ.. ఎవరికైనా అనుకూలంగా ఉంటే రొయ్యలు సాగు చేయడం మంచిదని సూచించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతోనే శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
ఈ పరిస్థితి తలెత్తడానికి ప్రభుత్వం నిర్ణయాలే కారణం అని అభిప్రాయపడ్డారు. గతంలో మత్స్యకార ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడం తోనే ఈ పరిస్థితి తలెత్తి అన్నారు. ఈ విషయంలో తప్పు చేశానని తాను ఒప్పుకున్నారు. ఇప్పటికైనా మారాల్సిన అసవరం ఉందని గుర్తు చేశారు. తలసరి ఆదాయం పెరగడానికి, మన తలరాతలు మారడానికి ఆక్వారంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేశామని ధర్మాన వివరించారు.
ఇక సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ.. మాట ఇచ్చాం కనుక సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతోంది అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా కష్టాలు చాలానే ఉన్నా.. సంక్షేమం కొనసాగిస్తున్నామని గుర్తు చేస్తున్నారు. సంక్షేమం వలన కరోనా ప్రజల ఆకలి కేకలు వినపడలేదని గుర్తు చేశారు. పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. కాలువలు, రోడ్లు అభివృద్దికి వచ్చే రెండేళ్లలో ముందుకు వెళతాం అన్నారు ధర్మాన.
అధికార పార్టీలో ఉంటూనే.. మాజీ మంత్రులు. సీనియర్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపుతోంది. ప్రస్తుత ప్రభుత్వంలో తమ మాట చెల్లడం లేదనే.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు లైట్ తీసుకుంటున్నారు. తాజాగా ధర్మాన వ్యాక్యలు ఎలాంటి వివాదానికి దారి తీస్తాయో చూడాలి.. వ్యవసాయం వద్దని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. మరి విపక్షాలు ధర్మాన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాయో చూడాలి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.