Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS YCP SENIOR LEADER DHARMANA HOT CONTRAVENTION COMMENTS ON MUNICIPAL TAX NGS VZM

Andhra Pradesh: ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్.. పన్ను కట్టకపోతే ఇంటి ముందే చెత్త..

మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు

మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు

Andhra Pradesh Politics: ఏపీలో చెత్త పన్నుపై వివాదం ముదురుతోంది. విపక్షాలన్నీ ఏపీ ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నాయి. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ విషయాన్ని మరింత హైలెట్ చేస్తున్నారు.. తాజాగా సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇంకా చదవండి ...
    YCP MLA  Controversy Comments:  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చెత్తపై పన్ను పెను దుమారాన్ని లేపుతోంది.  రాష్ట్రంలోని విపక్షాలన్నీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి. ప్రజా సంఘాలు, సామాన్య ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అయినా సరే ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గేదేలే అంటోంది. తాజాగా ఇదే అంశంపై  మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు  చేసారు. చెత్త పన్నుగా 100 రూపాయలు వసూలు చేస్తే తప్పేంటీ? అంటూ ప్రశ్నించారు. ఆయన అక్కడితోనే ఆగలేదు. చెత్త పన్ను వసూలు చేస్తే ఇంత రాద్దాంతం దేనికి? అంటూ మండిపడ్డారు.  ప్రభుత్వం మంచి చేస్తుంటే ప్రతిపక్షాలకు కడుపు మంట ఎందుకు అని ఆవేదన వ్యక్తం చేశారు.  12 నెలలకు 1200 రూపాయలు ప్రజలు కట్టలేరా అని ప్రశ్నించారు.  నియోజకవర్గం జరిగిన కార్యక్రమంలో ఆయన ఇవాళ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడితోనే ఆగని మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    నాయకుడు అనేవాడు చెప్పేవాడు కాదని.. చేయించేవాడని.. దీనికి ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం లేదని.. సమస్యలపై ప్రజలను చైతన్యపరిచే ప్రతి ఒక్కడూ నాయకుడేనని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. చెత్త పన్ను కట్టి అధికారులకు, ప్రభుత్వానికి సహకరించాలన్నారు.  ప్రభుత్వం చేపట్టిన పథకాలకు డబ్బులు పంచాలంటే పన్నులు వసూలు చేయకపోతే  డబ్బులెలా వస్తాయన్నారు?  ప్రభుత్వానికి మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వం అని అంటే ఎలా? అంటూ ప్రశ్నించారు. ప్రజలు చెత్త పన్ను కట్టకపోతే వారి చెత్త తీసుకెళ్ల వద్దని.. ఆ చెత్తను వారి ఇంటిముందే పోయాలని.. ప్రజలనుంచి చెత్త పన్ను వసూలు చేయాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బంది, అధికారులదేనన్నారు. ప్రజల నుంచి చెత్త పన్ను కట్టించే దిశగా అధికారులు పనిచేయాలని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు.
    ఇదీ చదవండి : ఏపీలో మళ్లీ ఆంక్షలు..! భారీగా పెరుగుతున్న కేసులు.. ఆ జిల్లాల్లో భయం భయం

    మున్సిపాలిటీలు, నగరపాలక సంస్ధల వంటివి ఆర్ధికంగా వెనుకబడడంతో.. ప్రభుత్వం చెత్త పన్నుల వసూళ్ల ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించింది. ఏపీలో గ్ళహాలు, వాణిజ్య సంస్థల నుంచి.. వ్యర్థాల సేకరణ సేవా రుసుం (చెత్త పన్ను) వసూళ్లు చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి యజమానితో పాటు అద్దెకు ఉండే కుటుంబాలు కూడా నెలకు 60 రూపాయల నుంచి 120 రూపాయల మధ్య సచివాలయ సిబ్బందికి చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలైతే కేటగిరీని బట్టి నెలకు 100 రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకూ వసూలు చేయాలంటూ ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి.

    ఇదీ చదవండి : కొడుకు కళ్ల ముందే ఇష్టం లేని వ్యవహారం.. చివరికి ఏం జరిగిదంటే..?

    ప్రతి ఇల్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి నెలనెలా ‘చెత్త పన్ను’ వసూలు చేయాల్సిందేనన్న ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిపక్షాలతో పాటూ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చెత్తపన్నుపై అన్ని ప్రధాన ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఈ చెత్త పన్ను వసూళ్లపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు విపక్ష నేతలు నిరసనలకు పూనుకుంటుంటే .. ప్రభుత్వం లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నేతలు మాత్రం ఇది పెద్ద భారం కాబోదని అంటున్నారు.

    ఇదీ చదవండి : సినిమా టికెట్ల వివాదంలో ట్విస్ట్.. వర్మకు మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్

    నిజానికి చెత్తపన్ను వసూలు నిర్ణయాన్ని మంత్రి బొత్స ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్ళష్ణదాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక ఈ చెత్తపన్ను వసూలు నిర్ణయంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత మాట్లాడుతూ.. చెత్తపై పన్నువేసిన ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రమే నని  అన్నారు. చెత్త పన్ను కట్టకపోతే.. వారి ఇంటి ముందు చెత్త వేయమని ఓ వైసీపీ సీనియర్ నాయకుడు అంటున్నాడంటూ మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు పేదవాడిని ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం.. మరుగుదొడ్లమీద, చెత్త మీద పన్నులు వేయడం ఏంటంటూ చంద్రబాబు ప్రశ్నించారు..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Srikakulam, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు