ANDHRA PRADESH POLITICAL NEWS YCP MLA GUDIVADA AMARNATH SUPER DANCE WIHT HIS WIFE JUST WATCH NGS VSP
MLA super Dance: మెగాస్టార్ పాటకు ఎమ్మెల్యే అదిరిపోయే స్టెప్పులు.. స్వామి అంటూ భార్యతో కలిసి సందడి
ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్
MLA Super Dance: ఆయన ఒక అధికార పార్టీ నేత.. కానీ డ్యాన్సులో మాత్రం సూపర్బ్ అనిపిస్తున్నారు. సింగిల్ గా కాదు.. తన భార్యతో కలిసి ఇటు మెగాస్టార్ పాటలకు డ్యాన్స్ వేశారు. భార్యతో కలిసి సామి పాటకు సందడి చేశారు.. ఇంకెందుకు ఆలస్యం ఆ డ్యాన్స్ మీరూ చూడండి..
P. Anand Mohan, Visakhapatnam, News18. YCP MLA Super Dance: వైసీపీ నేతలు ప్రత్యర్థిపై పంచ్ లు వేయడంలోనే కాదు.. ఆట పాటల్లోనూ అదుర్స్ అనిపిస్తున్నారు. సాధరణంగా అధికార పార్టీలో మంచి డ్యాన్సర్ ఎవరంటే ఎమ్మెల్యే రోజా అని ఠక్కున చొప్పొచ్చు.. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా చేశారు. టీవీల్లో పలు షోల్లో చేస్తున్నారు. సో రోజా బాగా డ్యాన్స్ చేస్తారని అందరికి తెలిసిందే.. అయితే మరికొందరు నేతలు కూడా డ్యాన్స్ లో తమ టాలెంట్ చూపిస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన సింగిల్ గా డ్యాన్స్ వేయడం కాదు.. తన భార్యతో కలిసి స్టెప్పులు వేసి అదుర్స్ అనిపించారు..
నిత్యం మీటింగ్లు, సభలు, పార్టీ కార్యక్రమాలు.. ప్రతిపక్ష పార్టీ నేతలపై సెటైర్లు వేయడం.. సీఎం జగన్ ను ఎవరైనా మాట అంటే .. అదే స్థాయిలో కౌంటర్లు ఇవ్వడం.. ఇన్నాళ్లూ ఇలా బిజి బిజీగా కనిపించిన ఆ ఎమ్మల్యే ఇప్పుడు తనలో ఇంకో కోణం బయట పెట్టారు.. ఒకవైపే కాదు.. రెండో వైపు చూడండి అంటూ తన టాలెంట్ తో అభిమానులను ఫిదా చేశారు.
ఆయన ఎవరో కాదు.. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. నిత్యం పొలిటికల్ మీటింగ్స్, రివ్యూలు.. ప్రజలతో సమస్యలు, అధికారులతో భేటీలు ఇలా తీరిక లేకుండా గడిపే ఆయన తాజాగా జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో అదిరిపోయే స్టెప్పులు ఏశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కొండవీటి దొంగ’ సినిమాలోని ‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో’ అనే పాటకు ఆయన వేసిన డ్యాన్స్ విజిల్స్ వేయించేలా చేసింది.
అక్కడితోనే ఆగలేదు.. తాజాగా వచ్చిన పుష్ప సినిమాలో సామి ఓ సామి పాటకు అయితే సూపర్ స్టెప్పులు వేశారు. ఇలా ఆయన ఉన్నంత సేపు అక్కడ వేడుక ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యేలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ అంతా షాక్ కు గురయ్యారు. మీరు సూపర్ అంటూ పొగడ్తలు కురిపించారు.
సాధారణంగా ఆయన నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటూ.. వ్యక్తిగత జీవితంలో కుటుంబంతో కలిసి గడపడానికి తక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఇలా క్షణం తీరిక లేకుండా రాజకీయాలతో బిజీగా ఉండే ఆయన.. సతీమణితో కలిసి స్టెప్పులేశారు. అలా ఇలా కాదు.. ఓ రేంజ్ లో, అదిరిపోయే గ్రేస్ తో చిరంజీవి పాటకు డాన్స్ ఇరగదీశారు.
గుడివాడ అమర్ నాథ్ అభిమానులు, అనుచరులు అన్న ఏం చేసినా అద్భుతమే అంటూ తెగ పొగడ్తల వర్షం కురిపించారు. రాజకీయాల్లో అయినా, రియల్ లైఫ్ లో అయినా స్టైలే వేరు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఆ మధ్య ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా తన కుమార్తె వివాహ వేడుక లో కుమార్తో కలిసి మంత్రి ఎంతో సంతోషంగా స్టెప్పులేశారు. అంతకు ముందు సోదరుడి పెళ్ళిలో మంత్రి పుష్ప శ్రీవాణి ధింసా నృత్యంతో అదరగొట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా అంటూ స్టెప్పులేశారు. ఇలా వైసీపీ నేతలంతా తమలో మరో టాలెంట్ ను బయటపెడుతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.