ANDHRA PRADESH POLITICAL NEWS YCP MINSTER VELLAMPALLI COMMENTS ON TDP CHIEF CHANDRABAU LOVE STORY NGS
AP Politics: అది వన్ సైడ్ లవ్ కాదు.. టూ సైడ్ లవ్.. ఆ లవ్ స్టోరీకి ఆయనే డైరెక్టర్.. మంత్రి కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు (ఫైల్ ఫోటో)
Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం లవ్ స్టోరీ చుట్టే తిరుగుతూనే ఉన్నాయి. అదేదో నాగచైతన్య-సాయి పల్లవిల సినిమా మాత్రం కాదు.. అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లవ్ స్టోరీ.. ఇటీవల ఆయన కుప్పంలో పర్యటనకు వెళ్లిన రోజు నుంచి ఈ లవ్ స్టోరీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే లవ్ స్టోరీ వన్ సైడ్ ఉండకూడదని చంద్రబాబు అంటే.. వైసీపీ మంత్రులు మాత్రం ఆయనది వన్ సైడ్ లవ్ కాదు.. టూ సైడ్ లవ్ అంటున్నారు.. మరి ఏది నిజం..?
Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లవ్ స్టోరీ (Love Story) సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇటీవల కుప్పం (Kuppam) పర్యటనలో చంద్రబాబే ఈ మాట అనడంతో ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఓ కార్యకర్త నుంచి చంద్రబాబుకు అనూహ్యంగా ఓ ప్రశ్న ఎదురైంది.. వచ్చే ఎన్నికల నాటికి జనసేనతో పొత్తు ఉంటుందా అని ప్రశ్నించారు.. దీంతో ఆయన నేరుగా దీనికి సమాధానం చెప్పకపోయినా.. తన మనసులో మాట బయటపెట్టారు.. ప్రేమ అన్నది వన్ సైడ్ ఉండకూడదని.. అది సక్సెస్ కాదు తమ్ముడు అంటూ చమత్కరించారు. అంటే దాని అర్థం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పొట్టు పెట్టుకోడానికి సిద్ధంగా ఉన్నామని.. జనసేన (Jansena) కూడా అదే ఫీల్ తో ఉంటే.. అప్పుడు పొత్తుకు సిద్ధమంటూ.. ఫీల్ మై లవ్ అనే కాన్పెప్ట్ లో సమాధానం చెప్పారు. ఆ మరుచటి రోజే దీనిపై మరింత క్లారిటీ కూడా ఇచ్చారు.. ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితులను బట్టి.. ఆరాచక పాలనను అంతం చేయడానికి విపక్షాలన్నీ ఏకతాటిపై రావాలి అని పిలుపు ఇచ్చారు. అయితే దీనిపై ఇప్పటి వరకు జనసేన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.. బీజేపీ మాత్రం చంద్రబాబు స్వార్దం కోసం ఎవరినైనా లవ్ చేస్తారు అంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu Veerraju) ఎద్దేవ చేశారని.. ఆఖరిని సోనియా గాంధీ (Sonia Gandhi)ని కూడా లవ్ చేశారంటూ సెటైర్లు వేశారు.. ఇలా ప్రస్తుతం చంద్రబాబు చెప్పిన లవ్ స్టోరీ హాట్ టాపిక్ అవుతూ వస్తోంది.
తాజాగా ఈ లవ్ స్టోరీపై వైసీపీ మంత్రులు కూడా స్పందిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్టు.. జనసేన-టీడీపీలది వన్ సైడ్ లవ్ స్టోరీర కాదు అన్నారు. గత కొంతకాలంగా చంద్రబాబు డైరెక్షన్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అయినా 2024 ఎన్నికల్లో జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నట్టు డ్రామాలు ఆడుతున్నారని.. ఆయన మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని వెల్లంపల్లి ఆరోపించారు. అయితే జనసేన, టీడీపీలే కాదు.. రాష్ట్రంలో ఉన్న పార్టీలు.. జాతీయ పార్టీలు అన్నీ గుంపులు గుంపులుగా వచ్చినా.. సింహం సింగిల్‌గా వచ్చినట్టు.. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. గెలిచి తీరుతుందని భాషా లెవల్లో పంచ్ డైలాగ్ లు పేల్చారు..
భారత దేశంలో అబద్దాల ఫ్యాక్టరీని చంద్రబాబు నడుపుతున్నారని విమర్శించారు మంత్రి కన్నబాబు. రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేకే చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులకు సంబంధించి సమస్యలు ఉంటే వెంటనే పరిస్కారం చేస్తామన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను తమ ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. చంద్రబాబు రైతు కేంద్రంగా రాజకీయాలు నడపడం సరైంది కాదన్నారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. జగన్ ను ఢీ కొనే పరిస్థితి లేదని ధీమా వ్యక్తం చేశారు..
టీడీపీ-టీడీపీ పొత్తులపై అందరూ మాట్లాడుతున్నారు.. కానీ పవన్ కళ్యాణ్ కానీ.. ఆ పార్టీ నేతలు కానీ దీనిపై స్పందించడం లేదు. అయితే ఇటీవల స్థానిక ఎన్నికల్లో మాత్రం పలు చోట్ల రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు మాత్రం పొత్తుకు సిద్ధం అంటూనే చెబుతున్నారు.. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.