Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS YCP MINSTER BOTSA SATYANNARAYANA COUNTER TO SOMUVEERRAJU COMMENTS NGS

Bots on Somu Veeraju: ముందు పెట్రోల్.. డీజిల్ రేట్లు తగ్గించండి.. సోము వీర్రాజు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

Bots on Somu Veeraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్క కామెంట్ తో ఫుల్ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యే లా చేసింది. ఆయన జాతీయ పార్టీకి ఏపీ అధ్య్షక్షుడే అయినా ఆయనపై ఎవరూ పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు తక్కువే.. కానీ ఇప్పుడు అన్ని పార్టీల నేతలకు ఆయనే టార్గెట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    Bots on Somu Veeraju: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్క నేతే అవుతున్నారు. గత రెండు రోజులుగా అధికార పార్టీ నేతలైనా.. విపక్ష నేతలైనా.. ఆయన వ్యాఖ్యలకే కౌంటర్లు ఇస్తున్నారు. అసలు చాలాకాలంగా ఆయన బీజేపీ (BJp) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా.. అసలు ఆయన గురించి ఎవరూ పట్టించుకోలేదు విమర్శలు చేయలేదు.. కానీ ఇప్పుడు ఆయన చేసిన ఒకే ఒక్క కామెంట్ కాంట్రవర్శి స్టార్ ను చేసింది. ఎంతలా అంటే.. అటు అధికార వైసీపీ (YCP), ఇటు టీడీపీ (TDP), కాంగ్రెస్ (Congress), కమ్యూనిస్టు (Communist) అన్ని పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలే కాదు.. తెలంగాణ (Telangana ) మంత్రి కేటీఆర్ (Minster KTR) కూడా ఆయన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు.. వాట్ ఏ స్కీమ్.. వాటే షేమ్ అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ కూడా అయ్యింది. ఇలా రెండు రోజులైనా ఆ వేడి ఇంకా చల్లారలేదు. అంతాలా ఆయన్ను హైలెట్ చేసిన కామెంట్ ఏంటంటే? విజయవాడ (Vijayawada)లో జరిగిన జనాగ్రహ సభలో మాట్లాడిన సోమువీర్రాజు.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. చీప్ లిక్కర్ ను 70 రూపాయలకే ఇస్తామని.. ఒకవేళ రెవెన్యూ ఇంకా బాగుంటే.. 50 రూపాయలకు కూడా చీక్ లిక్కర్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపపుతున్నాయి.

    తాజాగా సోము వీర్రాజు కామెంట్లపై ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను 50కే పంపిణీ చేస్తామంటూ బీజేపీ విధానమా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స, బీజేపీ ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తుందో అందరికి అర్థమైందని అన్నారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని హామీ ఇవ్వడం చాలా హాస్యాస్పదం అన్నారు. అసలు ఈ విషయంపై మాట్లాడటానికి చాలా అసభ్యకరంగా చాలా ఇబ్బంది కరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది.. కేవలం పెట్రోల్ డీజల్ రేట్లే కాదు.. నిత్యావసర సరుకుల ధరలన్నీ పెంచింది కేంద్ర ప్రభుత్వమే అని.. ఇంతలా రేట్లు మండిపోతుంటే సామాన్యుడు ఎలా జీవించగలడని ప్రశ్నించారు. సామాన్యులకు అవసరమైన నిత్యవసర వస్తువుల ధరలు పెంచి బిజేపి పార్టీ ప్రజలను పీడిస్తోందని మండిపడ్డారు. ఇవన్నీ బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు...

    ఏపీలో మాత్రం తమ ప్రభుత్వం మద్యం ధరలు పెంచినట్టు కనిపించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీజేపీ నేతలు మద్యాన్ని ఒక నిత్యావసర వస్తువుగా భావించడం అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అన్నారు. అసలు రాజకీయాలను బీజేపీ ఏ విధంగా తూకం వేస్తుందో ఆ పార్టీ నేతల మాటల్లో తెలిసిపోతుందంటూ మండిపడ్డారు. కేవలం మంత్రి బొత్సనే కాదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోము వీర్రాజు వ్యాఖ్యలపై విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. నెటిజన్లలో ఎక్కు వమంది.. ముందు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించండి.. తరుతాత మద్యం సంగతి చూద్దాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Botsa satyanarayana, Somu veerraju

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు