హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP MLA: వైసీపీ నేతపై కార్యకర్తల తిరుగుబాటు.. ఎమ్మెల్యే వద్దు జగనే ముద్దు అంటూ నినాదాలు

YCP MLA: వైసీపీ నేతపై కార్యకర్తల తిరుగుబాటు.. ఎమ్మెల్యే వద్దు జగనే ముద్దు అంటూ నినాదాలు

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీలో వర్గ పోరు రోజు రోజుకూ పెరుగుతోంది. ఓ ఎమ్మెల్యే తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు చేశారు. ఆయన కార్యక్రకమాలను అడ్డుకున్నారు.. ఎమ్మెల్యే వద్దు జగన్ ముద్దు అంటూ నినాదాలు చేశారు.

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీలో వర్గ పోరు రోజు రోజుకూ పెరుగుతోంది. ఓ ఎమ్మెల్యే తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు చేశారు. ఆయన కార్యక్రకమాలను అడ్డుకున్నారు.. ఎమ్మెల్యే వద్దు జగన్ ముద్దు అంటూ నినాదాలు చేశారు.

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీలో వర్గ పోరు రోజు రోజుకూ పెరుగుతోంది. ఓ ఎమ్మెల్యే తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు చేశారు. ఆయన కార్యక్రకమాలను అడ్డుకున్నారు.. ఎమ్మెల్యే వద్దు జగన్ ముద్దు అంటూ నినాదాలు చేశారు.

ఇంకా చదవండి ...

Andhra Pradesh Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార పార్టీలో వర్గ పోరు రోజు రోజుకూ పెరుగుతోంది.  స్థానిక నేతలపై.. అదే పార్టీకి చెందిన కేడర్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా విశాఖ జిల్లా (Visakha district)లోనూ పాయకరావు పేట ఎమ్మెల్యే  గొల్ల బాబురావు (Golla Baburao)కు వ్యతిరేకంగా కార్యకర్తలు అందోళనకు దిగారు.  రాజవారంలో  ఓ కార్యక్రమానికి వెళ్లిన  బాబుారావును కార్యకర్తలే అడ్డుకోవడం  తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  ఎమ్మెల్యేను..  సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చేసుకుంది. బాబురావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  మ్మెల్యే వద్దు - సీఎం జగన్ (CM Jagan)  ముద్దు అంటూ ప్లకార్డులు  ప్రదర్శించారు.

దీనిపై అదిష్టానం ఆందోళన చెందుతోంది. సీఎం జగన్ ఎన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. స్థానిక నేతల తీరు తలనొప్పిగా మారింది.  దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.  ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు అసలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన తరువాత సొంత పనులు చూసుకుంటున్నారు తప్ప.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఇదీ చదవండి : పార్టీలు వేరైనా మనం ఒక్కటే.. రాబోయే కాలంలో రాజ్యాధికారం మనదే.. కాపు నేత సంచలన వ్యాఖ్యలు

తాజాగా పాయకరావు పేటలో అది బయటపడింది.  చేతిలో అధికారం ఉండే ఎమ్మెల్యే స్థానికంగా హామీ ఇచ్చిన రోడ్డు కూడా వేయించలేదు.  మరోవైపు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాకపోవడంతో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందనే మాట వాస్తవం. ఈ క్రమంలో ఇతరత్రా సమస్యలు ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటున్నాయి. దీంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతోంది.

ఇదీ చదవండి : రాధాపై హత్యాయత్నం నిజమేనా..? ఆ అవసరం ఎవరికి ఉంది..?

స్థానిక నేతలపై వ్యతిరేకత ఉన్నా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో కార్యకర్తలు, అధినేతపై మరింత అభిమానంపై పెంచుకుంటున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే, స్థానిక నేతలపై మాత్రం వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది.  

ఇదీ చదవండి : ఆంధ్రా అబ్బాయిలకు ఫుల్ డిమాండ్.. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విదేశీ యువతులు.. వీడియో

తాజాగా  ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పై తిరుగుబాటే అందుకు నిదర్శనం.  మంచినీటి పైప్ లైన్ ప్రారంభించడానికి వెళ్లిన ఆయన్ను సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. అంతే కాదు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే వద్దు, సీఎం ముద్దు అనే నినాదాలు చేశారు. 

ఇదీ చదవండి : వంగవీటి రాధా కోసం వైసీపీ-టీడీపీ ఫైట్.. చంద్రబాబుతో భేటీ.. మారుతున్న బెజవాడ రాజకీయం

ముఖ్యంగా ఆయన  టీడీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నారనేది రాజవరం గ్రామస్తుల ఆరోపణ. తమ ఎమ్మెల్యే వైసీపీనా, టీడీపీనా అని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే వద్దు, జగన్ ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. ఎమ్మెల్యే కారుని కూడా అడ్డుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఎమ్మెల్యే మద్దతుదారులు, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే ఎమ్మెల్యే వర్గం దీన్ని మరో వర్గం కుట్రగా కొట్టిపారేసింది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Karnataka political crisis, Ycp

ఉత్తమ కథలు