హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: మారుతున్న ఏపీ రాజకీయాలు.. పవన్ ను వైసీపీ వదిలేస్తోందా..?

AP Politics: మారుతున్న ఏపీ రాజకీయాలు.. పవన్ ను వైసీపీ వదిలేస్తోందా..?

జగన్, పవన్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

జగన్, పవన్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయా పరిణమాలు మారుతున్నాయి. టీడీపీ-జనసేన విడి విడిగా పోటీ చేయాలనుకున్న వైసీపీ వ్యూహాం సక్సెస్ అయ్యింది. అందుకే పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడి తగ్గించి.. కేవలం చంద్రబాబు పైనే ఫోకస్ చేస్తోందా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

M BalaKrishna, Hyderabad, News18

AP Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నాయా? టీడీపీ (TDP), జనసేన (Janasena) విడివిడిగా పోటీ చేయాలి అనుకున్న వైసీపీ వ్యూహం ఫలించిందా..?  మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై.. విమర్శలతో విరుచుకుపడే వైసీపీ..  ఇప్పుడు టార్గెట్ మార్చిందా..?  ప్రధాని మోదీ (Prime Minister Modi) విశాఖ పర్యటన తరవాత ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీతో ప్రధాని భేటీ అయ్యాక, యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి ఓట్ల చీలనివ్వం అంటూ చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ నినదించడం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని కూడా పవన్ ప్రకటించారు. ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేనట్టే భావించాల్సి ఉంటుంది.

ఏ మాత్రం అవకాశం దొరికినా జనసేన అధినేతపై విరుచుకుపడే వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు లేకుంటే, ఇక జనసేన అధినేతను తిట్టాల్సిన అవసరం లేదు. దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శించడం వల్ల కాపుల్లో వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే చంద్రబాబునాయుడిని, వారి కుటుంబ సభ్యలపై తీవ్ర విమర్శలు చేయడం ద్వారా కమ్మ సామాజికవర్గం వైసీపీకి దూరమైంది.

ఇక జనసేనానికి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే కాపు కులం కూడా దూరం జరిగే ప్రమాద ముందని వైసీపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరి పోరాటం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉండటంతో, ఇక ఆ పార్టీ నేతపై ఎలాంటి విమర్శలు చేయవద్దని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైసీపీ నేతలందరికీ సంకేతాలు అందాయని తెలుస్తోంది. అందుకే అందరూ ఒకేసారి కట్టకట్టుకుని నోటికి తాళం వేసుకున్నారు. జనసేనాని మళ్లీ టీడీపీతో పొత్తు మంతనాలు సాగిస్తే మరలా వైసీనీ నేతలు భూతులతో విరుచుకు పడే అవకాశం లేకపోలేదు.

ఇదీ చదవండి : అమెరికాలో అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం.. ఖరీదు ఎంతో తెలుసా?

ప్రతిపక్షాలు ఏకమైతే ప్రమాదమే ప్రతిపక్షాలన్నీ ఏకమైతే వైసీపీకి తీవ్ర గండమే. అందుకే ప్రతిపక్షాలు కలవకుండా చూసుకోవాల్సిన పని కూడా వైసీపీ నేతలపైనే ఉంది. ప్రధాని మోదీ పర్యటనతో ఇది కొంత వరకు ఫలించినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: నారా లోకేష్ ను టీడీపీ సీనియర్లు లైట్ తీసుకుంటున్నారా? యువ నేతలూ పట్టించుకోవడం లేదా?

ప్రజారాజ్యం పార్టీ సాధించిన ఓట్లలో సగం కూడా తెచ్చుకోలేక చతికిలపడ్డ జనసేన అధినేత ఒంటరిగా ఎన్నికలకు వెళితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తే రాబోయే 30 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉంటుందని జగన్  భావిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు టీడీపీకి జనసేనను.. బీజేపీతో దూరం చేయించారనే ప్రచారం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Pawan kalyan

ఉత్తమ కథలు