హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP-TDP Friendship: మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అన్నారు.. తిట్టుకున్నారు.. తొడలుకొట్టుకున్నారు.. ఇప్పుడు చేయి చేయి కలిపారు

YCP-TDP Friendship: మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అన్నారు.. తిట్టుకున్నారు.. తొడలుకొట్టుకున్నారు.. ఇప్పుడు చేయి చేయి కలిపారు

చేయి చేయి కలిపిన టీడీపీ- వైసీపీ నేతలు

చేయి చేయి కలిపిన టీడీపీ- వైసీపీ నేతలు

Andhra Pradesh Cast Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి.. పార్టీలకన్నా కులలాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు నేతలు.. వేరే వేరు పార్టీల్లో ఉండ ఢీ అంటే ఢీ అనే బద్ధ శత్రవులు.. కులం అనేసారిక ఒక్కటై పోతారు.. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఇంకా చదవండి ...

YSRCP–TDP AP Politics: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు.. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది.. అవుతూనే ఉంటుంది. ఇవాళ వేరు వేరు పార్టీల్లో ఉంటారు. ఒకరిని ఒకరు బండ బూతులు తిట్టుకుంటారు. మీసాలు మెలేస్తారు. తొడలు కొడతారు.. సవాళ్లు విసురుకుంటారు. కానీ మరుచటి రోజే.. పార్టీలు కండువాలు మార్చేసుకుంటారు. భాయ్ భాయ్ అనుకుంటారు. ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు.. అయితే ఇలా గతంలో ఒక పార్టీలో ఉండి.. ఇవాళ ఒకే పార్టీలో ఉండి చేతులు చేతులు కలవడం కామన్.. అయితే అధికార-ప్రతిపక్ష పార్టీల్లో (Opposition  parties) ఉండి.. అది కూడా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అయితే ఉప్పు నిప్పులా ఉండే నేతలు.. కొట్టుకునేందుకు కూడా సై అంటే సై అనే నేతలు.. ఒకరి మొహం ఒకరు చూసుకోడానికి కూడా ఇష్టపడరు.. అలా ఉండే నేతలు చేయి చేయి కలిపి నవ్వుకుంటే అది షాకింగే అవుతుంది. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. అనంతపురం  జిల్లా (Anantapuram District)లో నిన్నటికి నిన్న కయ్యానికి కాలు దువ్వారు ఆ ఇద్దరూ.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే మళ్లీ చేతులు కలిపారు. అది కూడా ఎప్పుడూ ఘాటైన వ్యాఖ్యలు చేసుకునే వైసీపీ-టీడీపీ (YCP TDP) నేతలు. ఇంతకీ ఎవరా నేతలు.. ఎందుకు పోట్లాడారు.. మళ్లీ ఎందుకు కలిశారు.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. రాజకీయాల్లోకి రాకముందే రెబల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు.. అధికార పార్టీ నేత అయినా జేసీపై తొడకొట్టారు. మీసం మెలేశారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చినా ఆయన దూకుడు తగ్గలేదు. మొన్నటికి మొన్న హైటెన్ష గా మారిన పెనుకొండ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడి మాజీ ఎమ్మెల్యే పార్థసారధికి –మాధవ్ కి మధ్య గొడవ జరిగింది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాధవ్ అటుగా వెళ్తూ పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. అక్కడే ఉన్న పార్థసారధి దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతే కాదు.. మాధవ్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏయ్, బుద్ధిండాలంటూ ఘాటు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నారు. ఆ గొడవ జరిగి రెండు వారాలు తిరగకుండానే ఈ ఇద్దరు నేతలు చేతులు కలిపారు.


కనకదాసు జయంతి ఉత్సవాల సందర్భంగా అనంతపురంలో కురుబలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న కురుబ నేతలంతా పార్టీలకు అతీతంగా హాజరయ్యారు. వైసీపీ నుంచి మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ మాధవ్ ఇతర ముఖ్య నేతలు, టీడీపీ నుంచి పార్థసారధి ఇతర ముఖ్య నేతలు వచ్చారు. ఐతే ఐక్యంగా ఉండాలంటూ చేతులు కలిపి పైకి ఎత్తారు. అదే సమయంలో మాధవ్ మంత్రితో ఏదో చెప్పి.. వెంటనే అటు వైపు వెళ్లారు..

ఇదీ చదవండి: ఏపీ సీఎం జగన్ కంటే ఉత్తర కొరియా కిమ్ నయం..? ఎందుకంటే..? లోకేష్ కామెంట్

ఏం జరుగుతోందని అంతా ఆసక్తిగా చూస్తున్న సమయంలో.. మాధవ్ చివరిలో ఉన్నటీడీపీ నేత పార్థసారధి దగ్గరకు వెళ్లి ఆయన చేయి పట్టుకుని మనమంతా ఒకటేనని చేతులు కలిపారు. సభలో కురుబ యూత్ ఈలలు కేకలు వేస్తూ హోరెత్తించారు. ఇంత తక్కువ సమయంలోనే నేతల్లో ఇంత మార్పు ఏంటో అంటూ అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, TDP, Ysrcp

ఉత్తమ కథలు