ANDHRA PRADESH POLITICAL NEWS TOMORROW ON WARDS CM JAGAN KADAP DISTRICT TOUR FOR THREE DAYS WILL SHARMILA MEET NGS
CM YS Jagan: రేపటి నుంచి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. ఈ సారైనా అన్నా-చెల్లి కలుస్తారా..?
వైఎస్ జగన్
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ వరుస జిల్లాల పర్యటనలు మొదలెట్టారు. నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.. ఇక రేపటి నుంచి సొంత జిల్లా పర్యటన చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. అయితే క్రిస్మస్ పండుగ అయినా వైస్ రాజకీయ వారసులు అన్నా చెల్లెలను కలుపుతుందా లేదా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
YS Jagan Mohan Reddy Kadapa TOur: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh Cm Jagan Mohan Reddy) గురువారం నుంచి 3 రోజులపాటు కడప జిల్లా (Kadap District)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృధ్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం (Gannavaram airport) నుంచి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రొద్దుటూరు వెళతారు. అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తరువాత అనంతరం బద్వేల్ నియోజక వర్గంలోని గోపవరంలో సెంచురి ప్లైఉడ్ కంపెనీకి శంకుస్ధాపన చేస్తారు. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత కడప సమీపంలోని కొప్పర్తికి చేరుకుంటారు. అక్కడ మెగా ఇండ్రస్ట్రియల్ హబ్ కు శంకుస్థాపన చేసి రాత్రికి ఇడుపుల పాయ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. అయితే ఈ పర్యటనలో మరో ఆసక్తికర అంశం ఉంది.. గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న అన్నా చెల్లి ఈ సారి తప్పక కలుస్తారని వైసీపీ అభిమానులు అంచనా వేస్తున్నారు...
24వ తేదీ ఉదయం అంటే శుక్రవారం ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ కు చేరుకుంటారు సీఎం జగన్. అక్కడ తన తండ్రికి నివాళులర్పిస్తారు. ఆ తరువాత పులివెందులకు చేరుకుని ఇండ్రస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్క్ లో ఆదిత్య బిర్లాయూనిట్ కు శంకుస్ధాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక శనివారం అంటే క్రిస్మస్ (Christmas) పండుగ సందర్భంగా 25వ తేదీ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గోంటారు. ప్రార్ధనల తరువాత గన్నవరం బయలుదేరి వెళతారు.
అయితే క్రిస్మస్ వేడుకలకు కుటుంబ సభ్యులంతా పాల్గొంటారు.. అంటే వైఎస్ షర్మిల కూడా అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు అంతా కలిసే ఈ వేడుకలు చేసుకుంటున్నారు. మరి ఈ సారి షర్మిల్ క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారా..? ఒకవేళ వెళ్లినా.. అన్న జగన్ ను కలుస్తారా లేదా అన్నది ఆసక్తి పెంచుతోంది.
ఎందుకంటే మంగళారం సీఎం జగన్ పుట్టిన రోజు ఘనంగాజరిగింది. ఏపీ వ్యాప్తంగా ఆయన పుట్టిన రోజును ఓ పండుగాలా చేసుకున్నారు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు.. దేశ ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టాలీవుడ్ స్టాలు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు లాంటి వారంతా జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. కానీ సొంత చెల్లి షర్మిల మాత్రం కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలు తెలియచేయలేదు. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఎంత పెరిగింది అన్నది అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి సమయంలో ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నా.. కలుస్తారా లేదా అన్నది అందరిలో ఆసక్తి పెంచుతోంది..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.