హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది ఇక్కడ నుంచే.. స్కెచ్ భారీగానే ఉందిగా..?

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది ఇక్కడ నుంచే.. స్కెచ్ భారీగానే ఉందిగా..?

పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేస్తాడని తెలుసు.. కానీ ఇప్పుడు రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అదే అందరిలోనూ బాధ. సొంత కథలను పూర్తిగా నమ్మడమే మానేసాడు ఈయన. టైమ్ సేవ్ అవుతుందని.. రిస్క్ ఉండదని.. తక్కువ కాల్షీట్స్ అవుతున్నాయని.. ఇలా ఏవేవో కారణాలతో పవన్ ఎక్కువగా రీమేక్ సినిమాల వైపు అడుగులేస్తున్నాడు. అజ్ఞాతవాసికి ముందు పవన్ కొన్నైనా సొంత కథలు చేసేవాడు. కానీ ఇప్పుడు అది కూడా లేదు.

పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేస్తాడని తెలుసు.. కానీ ఇప్పుడు రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అదే అందరిలోనూ బాధ. సొంత కథలను పూర్తిగా నమ్మడమే మానేసాడు ఈయన. టైమ్ సేవ్ అవుతుందని.. రిస్క్ ఉండదని.. తక్కువ కాల్షీట్స్ అవుతున్నాయని.. ఇలా ఏవేవో కారణాలతో పవన్ ఎక్కువగా రీమేక్ సినిమాల వైపు అడుగులేస్తున్నాడు. అజ్ఞాతవాసికి ముందు పవన్ కొన్నైనా సొంత కథలు చేసేవాడు. కానీ ఇప్పుడు అది కూడా లేదు.

Pawan Kalyan: జనసేన అధినేత వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా.. రెండు చోట్లా ఓడిపోయారు. అయితే మళ్లీ ఆయన అదే స్థానాల నుంచి బరిలో దిగుతారా..? లేక కొత్త నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తారా..? అయితే జనసేన వర్గాల టాక్ ప్రకారం.. ఆయన ఓ కీలక నియోజకవర్గం నుంచో పోటీ చేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే..?

ఇంకా చదవండి ...

Pawan Kalyan:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇంకా రెండేళ్లు పైగా సమయం ఉన్నా.. పొత్తులపై ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేయాలి అనేదానిపై నేతలంతా ఫోకస్ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్  (Pawan kalyan) సైతం ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్నదానిపై ఇప్పటికే క్లారిటీకి వచ్చారనే పొలిటికల్ టాక్.. గత ఎన్నికల్లో అయితే విశాఖ (Visakha), పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)ల నుంచి పోటీ చేశారు కానీ.. రెండు చోట్ల ఓటమిపాలయ్యారు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలనే లాజిక్ తో మళ్లీ అక్కడ నుంచి ఆయన పోటీ చేస్తారని.. ఒకవేళ వేరే చోట నుంచి బరిలో దిగినా.. ఓటమి భయంతోనే నియోజకవర్గం మార్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మళ్లీ అదే నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తారు అంటూ జనసేన అభిమానులు కొందరు చెబుతున్నారు.. కానీ అధినేత మదిలో వేరే ఉద్దేశం ఉన్నట్టు జనసేన వర్గాల టాక్.. ముఖ్యంగా కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా (East Godavari) నుంచి పోటీ చేయకపోవడం తప్పిదమే అన్న భావన పార్టీలో ఉందంట.. ఆ ఓటమి తర్వాత ఇప్పుడు వ్యూహం మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి నుంచే కచ్చితంగా బరిలోకి దిగుతారని జనసేనలోని కీలక నేతలు చెబుతున్నారు.

ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న కాకినాడ సిటీ (Kakinada City), లేదా కాకినాడ రూరల్ (Kakinada Ruler) నియోజకవర్గాల్లో అయితే బాగుంటుందని పార్టీ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడైనా గెలుపు తథ్యమనే ధీమా కూడా పార్టీలో ఉందని తెలుస్తోంది. ఎందుకంటే కాపు సామజికవర్గం ఓటర్లు ఎక్కువమంది ఉన్నారు.. అలాగే పవన్ అంటే పిచ్చిగా ప్రేమించే అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ రెండింటికి తోడు.. స్థానిక వైసీపీ నేతలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆ అంశాలకు తమకు కలిసి వస్తాయని జనసేన నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.

ఇదీ చదవండి : విందులు, వినోదాలకు దూరంగా ఉండడండి.. సంక్రాంతిని ఇంట్లోనే జరుపుకోండి.. పవన్ సూచన

అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ స్థానిక వైసీపీ నేతలపై తమ అధినేత పవన్ కు చాలా కోపం ఉంది అంటున్నారు. ఎందుకంటే స్థానిక వైసీపీ నేతలు కన్నబాబు, ద్వారంపూడి లు పవన్‌ను అదేపనిగా రెచ్చగొడుతున్నారనే వాదన ఉంది. అందుకే వారిద్దరకీ చెక్ పెట్టవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మంత్రి కన్నబాబు అదే పనిగా పవన్‌ను తిట్ల దండకంతో విమర్శిస్తూ వస్తున్నారు. గతంలో పీఆర్పీలో పనిచేసి వైసీపీలో చేరిన కన్నబాబు.. చీటికి మాటికి పవన్‌ను తిట్టడంతోపాటు వ్యక్తిగతంగాను దూషిస్తుండటంపై పవన్‌తో సహా జనసేన నేతలు రగిలిపోతున్నారు.

ఇదీ చదవండి : సినిమాల్లేకే టైం పాస్ చేస్తున్నారు.. ఇదంతా ఐదుగురి గేమ్ ప్లాన్

అనేకసార్లు పవన్‌ను ఉద్దేశించి కన్నబాబు డ్రామాలు ఆపు.. అన్నింటికీ పవన్ యాక్షనే చేస్తున్నారు అని విమర్శించినట్టు పవన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. మట్టి పిడతలో మజ్జిగన్నం తిన్న పవన్‌ను హాస్య నటుడు అని, ప్రతిదానికీ ఫోటోలా అని ఓసారి దుయ్యబట్టారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రతిదానికీ ఊగిపోతారనీ, అందుకే ఆయనకు అన్ని సీట్లు వచ్చాయనీ వ్యంగ్య బాణాలు విసిరారు. జగన్ అంటే పవన్‌కు జలసీ అని.. జగన్‌తో పవన్‌కు పోలికేమిటని? జగన్‌ను చూసి సంస్కారం నేర్చుకో అని కన్నబాబు విమర్శించారు.

ఇదీ చదవండి : ఆర్ఆర్ఆర్.. రాధేశ్యామ్ వాయిదాకు అదే కారణం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా అనేకసార్లు పవన్ కల్యాణ్‌ను బండ బూతులు తిట్టారు. ప్యాకేజీ స్టార్ అని, జైల్లో పెట్టాలని దుర్భాషలాడారు. దీనికి నిరసనగా జనసైనికులు.. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిని ముట్టడిస్తే.. వారిపై రాళ్ల దాడి జరిగింది. దీనిపై ఢిల్లీ నుంచి కాకినాడకు నేరుగా వచ్చి తేల్చుకుంటానని అప్పట్లో పవన్ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీలోనూ కాపు సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉండటం, ఇక్కడ పోటీ చేస్తే ద్వారంపూడిపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు లెక్కలు సరిపోతాయనే విశ్లేషణలు జనసేన పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఇదీ చదవండి : సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు.. అంతా చంద్రబాబు మనుషులే.. వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్

దీనికి తోడు భవిష్యత్తులో టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే... ఇక కాకినాడ రూరల్‌లో పోటీకి పవన్‌ నిర్ణయం తీసుకుంటే సహకరించడానికి టీడీపీ సిద్ధమనే సంకేతాలు రావడం కూడా జరుగుతోన్న పరిణామాలకు అద్దం పడుతోంది. కాకినాడ రూరల్‌లో టీడీపీకి నియోజకవర్గ ఇన్‌చార్జి లేరు. భర్తీ చేసే ఆలోచనను కూడా పార్టీ పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. భవిష్యత్తులో టీడీపీ- జనసేన పొత్తు కుదిరితే... ఈ స్థానం జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది కాకపోతే కాకినాడ సిటీ స్థానం కూడా వదులుకోవడానికి టీడీపీ అంతర్గతంగా సన్నాహాలు చేసుకుంటోందని వినికిడి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, Powe star pawan kalyan

ఉత్తమ కథలు