TDP Gudivada Tour Tension: కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada)లో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ఓవైపు టీడీపీ (TDP) నిజనిర్ధారణ కమిటీ కె కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటోంది. వారిని అడ్డుకునేందుకు ఇప్పటికే భారీగా వైసీపీ (YCP) శ్రేణులు అక్కడ మోహరాంచాయి. రెండు పార్టీలు వెనక్కు తగ్గేదే లే అంటుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఈ వివాదానికి కారణం సంక్రాంతి (Sankranti) సంబరాల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన క్యాసినో (Casino).. గుడివాడ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ బృందం అక్కడికి చేరుకుంది. ఈ క్యాసినో వ్యవహారంపై టీడీపీ ఆరుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశాల మేరకు ఈ కమిటీ బృందం గుడివాడలోని క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించనుంది. అక్కడి పూర్తి స్థాయి వివరాలను సేకరించి టీడీపీ అధిష్టానికి కమిటీ బృందం అందించనుంది. టీడీపీ నేతల గుడివాడ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
క్యాసినో పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండడం.. నేరుగా వివిధ పార్టీ నేతలే ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. కృష్ణా పోలీసులు రంగంలోకి దిగారు. సంక్రాంతి 4 రోజులు ఏం జరిగింది అనేదానిపై విచారణ కొనసాగుతోంది. గోవా నుంచి క్యాసీనో టీమ్‌ను రప్పించింది ఎవరనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందాలను మించి గుడివాడ క్యాసినో పేరు ఏపీలో మారుమోగింది. గోవా, శ్రీలంకల్ని మించిన స్థాయిలో క్యాసినో ఏర్పాటు చేసినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Gudivada Casino || గోవాను మించిన వినోదం || మంత్రి ఇలాకాలో క్యాసినో చూస్త... https://t.co/ZNMMrB9clN via @YouTube #casino #casinoonline #TDP @MahithaGudivada @kodalinnani
— nagesh paina (@PainaNagesh) January 21, 2022
గోవా కల్చర్ ను గుడివాడకు షిఫ్ట్ చేశారని గత కొన్ని రోజుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో కే కన్వెన్షన్ సెంటర్ లో కోడిపందాలు, పేకాట శిబిరాలు, గుండాటతో పాటుగా ప్రత్యేకంగా క్యాసినో వీడియో పోస్ట్ అవుతున్నాయి. 10 వేల రూపాయలు చెల్లిస్తేనే క్యాసినో లోకి నిర్వాహకులు అనుమతించారనే ఆరోపణలు ఉన్నాయి. బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకుని సంక్రాంతి సందర్భంగా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు నిరుపించేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అక్కడి చేరుకుంది.
ఇదీ చదవండి : ఏపీలో సమ్మె సైరన్.. ఎప్పటి నుంచి అంటే.. ఉద్యోగ సంఘాల నిర్ణయం ఇదే..
టీడీపీ నిజర్ధారణ కమిటీకి వ్యతిరేకంగా కొడాలి కన్వెన్షన్ సెంటర్‌కు భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు.. ఇరు పార్టీలు భారీగా మోహరిస్తుండడంతో ఉద్రిక్రత పరిస్థితులు తప్పేలా లేవు. దీంతో శాంతిభద్రతల సమస్యలు వస్తాయోనని పోలీసుల్లో టెన్షన్లో మొదలైంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Gudivada, Kodali Nani, TDP