TDP Leaders meet Vangaveeti Radha: ఆంధ్రప్రదేశ్ (Anrha Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు వంగవీటి రాధా (Vangaveeti Radha) హాట్ టాపిక్ అవుతున్నారు. ముఖ్యంగా బెజావాడ పాలిటిక్స్ లో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన తన ఇంటిపై రెక్కీ నిర్వహించి.. హత్యకు కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యలు చేయడంతో అందరి ఫోకస్ ఆయనపైనే పడింది. ఈ విషయంపై వెంటనే కలుగుజేసుకున్న ప్రభుత్వం వెంటనే ఇద్దరు గన్ మెన్ లను భద్రతగా పంపిస్తే.. ఆయన వారిని తిరస్కరించడంతో రాజకీయం మరో మలుపు తిరిగింది. అంత వరకు ఆయన వైసీపీకి మద్దతుగా ఉన్నారనే ప్రచారం జరిగితే.. గన్ మెన్ లను తిరిగి పంపడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా రాధా ఇంటికి వెళ్లడం.. ఆయన భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. డీజీపీ లేఖ రాయడంతో మళ్లీ ఆయన టీడీపీ సభ్యుడే అన్న క్లారిటీ ఇచ్చారు..
వంగవీటి రాధా వ్యాఖ్యల వ్యవహారం వైసీపీ వైపే వేళ్లు చూపించేలా చేశాయి. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం వెంటనే దీనిపై దర్యాప్తు ఆదేశించింది. స్వయంగా డీజీపీ కలుగుజేసుకుని.. రాధా ఫిర్యాదు చేయకపోయినా సీఎం జగన్ ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే తాజగా ఆ రెక్కీ వ్యవహారంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. వంగవీటి రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు..
ఇదీ చదవండి : ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ.. ముందస్తుపై క్లారిటీ వచ్చేనా..?
తాజాగా వంగవీటి రాధాను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, మాజీ మంత్రి నెట్టెం రఘురాం కలిసారు. రాధా ఇంటికి వెళ్లి ఆయన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని రాధాకు సూచించారు. ఈ సందర్భంగాఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. డీజీపీ, సీపీ విజయవాడ నగరంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని.. పాత బెజవాడ రోజులు తీసుకురావద్దని కోరారు.
ఇదీ చదవండి : ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటు..! క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల..
పేద ప్రజలకు వంగవీటి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని.. హత్యా రాజకీయాలను ఆనాడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు ప్రోత్సహించలేదన్నారు. వంగవీటి రాధా మంచి వ్యక్తని.. తాను నష్టపోతాడు కానీ.. ఎవరిని రాధా ఇబ్బంది పెట్టడని ఎంపీ వ్యాఖ్యానించారు. రాధా రెక్కీ అంశంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని ఎంపీ నాని డిమాండ్ చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను.. ఈ అంశం కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తా అని చెప్పారు.
మరోవైపు గత కొన్ని రోజులుగా అరవ సత్యనారాయణ పై జరిగిన ప్రచారాన్ని పోలీసులు కూడా ఖండించారు. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. రాధా వ్యాఖ్యలపై విచారణ జరిపామన్న విజయవాడ సీపీ కాంతిరాణా.. ఇంతవరకూ ఒక్క ఆధారం దొరకలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సీసీ ఫుటేజి పరిశీలించామన్నారు. రాధాను కలిసి వివరాలు తీసుకున్నామన్నారు సీపీ. ఘటనపై జీరో FIR నమోదు చేయలేమని స్పష్టం చేశారు. అలాగే పోలీసులపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kesineni Nani, Tdp, Vangaveeti Radha