Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS TDP CHIEF NARA CHANDRABABU NAIDU WROTE A LETTER TO CS SAMEER VARAMA NGS

Chandrababu letter: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం.. వరదల్లో వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలని చంద్రబాబు డిమాండ్

చంద్రబాబు ఫైల్...

చంద్రబాబు ఫైల్...

Chandrababu Naidu letter to CS: ఆంధ్రప్రదేశ్ లో వరద రాజకీయాల్లో హీటు పుట్టిస్తున్నాయి. రాజకీయాలు అన్నీ వరదల చుట్టూనే తిరుగూతు ఉన్నాయి. తాజాగా టీడీపీ అధినేత చందబ్రాబు నాయుడు కొన్ని డిమాండ్లు చేస్తూ.. సీఎస్ కు లేఖ రాశారు. వరదల్లో ప్రభుత్వం వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
  Chandrababu Naidu letter to CS:  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో గతకొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రాయలసీమ (Rayalaseema), కోస్తాఆంధ్రా (Costal Andhra) ప్రాంతంలోని పలు జిల్లాలు అతలాకుతమయ్యాయి. పలు ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే మునిగిఉన్నాయి. మళ్లీ రేపట నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు అందుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలను వరదల ముంచెత్తుతున్నాయి. మరోసారి అక్కడ అల్పపీడనం ప్రభావం ఉంది అంటున్నారు. దీంతో ఆ మూడు జిల్లాల్లో ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వరదలపై (AP Floods) ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే వరద ముప్పు వచ్చిందని ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఇటీవల వరద ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు.. అక్కడ పరిస్థితులను స్వయంగా ఆయన పరిశీలించి.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరద ప్రభావం ఎక్కువైంది. ప్రజలు అవస్థలు పడుతుంటూ అధికారులు, మంత్రులు అసలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి గాల్లో వచ్చి గాల్లో వెళ్లిపోయారంటూ మండిపడ్డారు.

  తాజా పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. తుఫాను కారణంగా నష్టపోయిన కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల ప్రజలను, రైతులను ఆదుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని.. వారందరికీ వెంటనే పరిహారం ఇప్పించేలా చూడాలన్నారు. వరద పరివాహక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులకు సహాయం అందడం లేదని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాటని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

  ఇదీ చదవండి : రాసి పెట్టుకోండి.. ఇక్కడనుంచే పొటీ చేస్తా.. గెలుస్తా..? కాన్ఫిడెన్స్ కు కారణం ఏంటి..?

  వరదల కారణంగా ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారని.. కానీ 35 కోట్లు విడుదల చేయడం సరైన పద్దతి కాదంటూ లేఖలో సూచించారు చంద్రబాబు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఒక్కరికీ సాయం అందించాలని చంద్రబాబు కోరారు.

  ఇదీ చదవండి : ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు.. తుమ్మలగుంట చెరువును ఆటస్థలంగా మార్చారని. చెరువును ఆటస్థలంగా మార్చడంతో తిరుపతిని వరదలు ముంచెత్తాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేశారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. రోడ్లు, వంతెనలు, విద్యుత్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. ఇప్పటికీ బాధితులకు సైరన తిండి అందడం లేదని.. వసతి లేక రోడ్ల మీదే ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరదల కారణంగా మృతుల కుటుంబాలకు 25 లక్షలు.. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.

  ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వం పై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

  వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇళ్లు కోల్పోయిన వారికి గృహ నిర్మాణం చేపట్టాలని సూచించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సహాయ కొనసాగించాలని కోరారు. పంట నష్ట పరిహారాన్ని కూడా పెంచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP Floods, Ap government, AP News, Chandrababu naidu, Tdp

  తదుపరి వార్తలు