హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu: అధికార పార్టీ గూండాలను ప్రోత్సహిస్తోంది.. డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ

Chandrababu: అధికార పార్టీ గూండాలను ప్రోత్సహిస్తోంది.. డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ

చంద్రబాబు ఫైల్...

చంద్రబాబు ఫైల్...

Chandrabbau Letter to DGP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి డీజీపీకి లేఖ రాశారు.. మరింత ఘాటుగా లేఖ రాశారు.. ప్రభుత్వం తీరు వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరు ఇలాగే ఉంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు చంద్రబాబు.

ఇంకా చదవండి ...

Chandrababu  Naidu Letter to DGP:  ఆంధ్రప్రదేశ్ (Adnrha Pradesh) పోలీసుల తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. తాజాగా గుంటూరు (Gunturu) దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం (NTR Statue) ధ్వంసంపై డీజీపీ (DGP)కి ఘాటుగా లేఖ రాశారు. రాష్ట్రంలో ఈ దాడులు ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే పోలీసులు అలసత్వం ప్రదర్శించడం తగదని అందులో పేర్కొన్నారు. వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే వైసీపీ జడ్పీటీసీ సెట్టిపల్లి యలమంద ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని చంద్రబాబు ఆరోపించారు.

ఈ తరహా ఘటనలు పునరావృతమైతే ప్రజల్లో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.  2019 జూన్ నుంచి రాష్ట్రంలో క్రమం తప్పక జరుగుతున్నాయి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో అధికార పార్టీ గూండాలను ప్రోత్సహిస్తూ ఎన్టీఆర్, అంబేద్కర్ వంటి జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది అన్నారు.

అన్నిటికన్నా దారుణంగా ఇలాంటి విధ్వంసాలను ప్రోత్సహించడంలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోందని లేఖలో రాసుకొచ్చారు. ఫిర్యాదులపై విచారణ జరిపి దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలని కోరారు. పోలీసులు తీసుకునే కఠినమైన చర్యలు మాత్రమే నేరస్తులను నిరోధిస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : ప్రధానితో సీఎం జగన్ ఏం చెప్పారంటే..? గంటకు పైగా చర్చ

ఇక నారా లోకేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అచ్చోసిన అంబోతుల్లో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.  వైసీపీ నేతల దోపీడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తిరగబడడమే కాదు.. మహనీయుల విగ్రహాలను పగలగొట్టడం దారుణమన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.


తెలుగుజాతీ ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు.  నిన్న దుర్గి నేడు తాడి కొండలో వైసీపీ దుశ్చర్యలను ప్రజలంతా ఖండిస్తారు అన్నారు. ప్ర‌భుత్వంపై వెల్లువెత్తుతోన్న‌ ప్ర‌జాగ్ర‌హాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కులు దివంగ‌త‌ నంద‌మూరి తార‌క‌రామారావు విగ్ర‌హాల ధ్వంసానికి వైసీపీ తెగ‌బ‌డ‌టం చాలా దుర్మార్గం అంటూ లోకేష్ మండిపడ్డారు.


మాజీ మంత్రి పరిటాల సునీత కూడా ప్రభత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాలను విద్వంసం చేయడం దారుణమన్నారు. ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉంది అని చెప్పుకు తిరిగే లక్ష్మి పార్వతి ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. నిజంగా ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఈ ఘటనలో బాధ్యులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అన్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP DGP, AP News, AP Politics, Chandrababu naidu

ఉత్తమ కథలు