హోమ్ /వార్తలు /andhra-pradesh /

Vangaveeti Radha: వంగవీటి రాధా కోసం వైసీపీ-టీడీపీ ఫైట్.. చంద్రబాబుతో భేటీ.. మారుతున్న బెజవాడ రాజకీయం

Vangaveeti Radha: వంగవీటి రాధా కోసం వైసీపీ-టీడీపీ ఫైట్.. చంద్రబాబుతో భేటీ.. మారుతున్న బెజవాడ రాజకీయం

Vangaveeti Radha: బెజవాడ రాజకీయం ప్రస్తుతం వంగవీటి రాధా చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన్ను ఓన్ చేసుకోవడానికి వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో త్వరలో చంద్రబాబుతో భేటీ కానుండడం విశేషం..

Vangaveeti Radha: బెజవాడ రాజకీయం ప్రస్తుతం వంగవీటి రాధా చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన్ను ఓన్ చేసుకోవడానికి వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో త్వరలో చంద్రబాబుతో భేటీ కానుండడం విశేషం..

Vangaveeti Radha: బెజవాడ రాజకీయం ప్రస్తుతం వంగవీటి రాధా చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన్ను ఓన్ చేసుకోవడానికి వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో త్వరలో చంద్రబాబుతో భేటీ కానుండడం విశేషం..

    Vangaveeti Radha: వంగవీటి రాధా (Vangaveeti Radha) ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు.. అంటే కాసేపు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆయన అఫిషియల్ గా టీడీపీ (TDP)లో ఉన్నా.. నిత్యం వైసీపీ (YCP) నేతలతో కనిపిస్తన్నారు. ఆయన అసవరం ఉందంటే మంత్రి కొడాలి నాని (Minster Kodali Nani) నేరుగా సీఎంను కలుస్తారు..? మరోవైపు ఓ వైసీపీ నేత అనుచురలే ఆయన ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారనే ప్రచారం ఉంది. ఈ విషయాన్ని పోలీసులు కూడా నిర్దారిస్తున్నారు. అదే టైంలో వైసీపీ నేతలు, మంత్రులు అంతా.. వంగవీటి రాధకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సైతం వంగవీటి రాధాకు రక్షణ కల్పించాలని డీజీపికి లేఖ రాశారు. ఫోన్ లో రాధాను పరామర్శించారు. ఇటు వైసీపీ మంత్రులు, నేతలు ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంటే.. ఇటు టీడీపీ నేతలు ఆయన దగ్గరకు వెళ్లి పరామర్శిస్తున్నారు. దీంతో అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన ఏ పార్టీకి చెందినవాడు అన్నది బెజవాడ ప్రజలకు.. కాపు నేతలకే అంతు చిక్కడం లేదు.

    తనను చంపేందుకు ఎవరో రెక్కీ చేశారన్న వంగవీటి రాధ వ్యాఖ్యలతో బెజివాడ మళ్లీ ఉలిక్కి పడింది. నిజంగానే ఆయన హత్యకు కుట్ర జరిగిందా.. లేకపోతే ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఎత్తుగడా అన్నది అంతుచిక్కడం లేదు. దీనిపై నేరుగా ఆయన ఫిర్యాదు చేయకపోయినా.. మంత్రి కొడాలి నాని చొరవతో సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan Mohan Reddy).. ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. 2 ప్లస్ 2 భద్రత కల్పించాలన్నారు. ఇటు పోలీసులు సైతం రెక్కి నిర్వహించిన వారిపై ఆరా తీస్తున్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు రెక్కీ నిర్వహించాడని పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం. దీనిపై రాధా మాత్రం ఏం మాట్లాడడం లేదు. కనీసం ఆయన నేరుగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు.

    ఇదీ చదవండి : వరి వద్దు.. రొయ్యల సాగు ముద్దు.. తప్పుచేశానని ఒప్పుకున్న వైసీపీ సీనియర్ నేత

    అయితే రాష్ట్ర ప్రభుత్వ తనకు భద్రతగా పంపించిన గన్ మేన్ లను మాత్రం తిరిగి పంపించేస్తున్నారు. వరుసగా మూడు రోజులూ అదే పరిస్థితి నెలకొంది. గన్ మేన్ లను ఉన్నతాధికారులు రాధా దగ్గరకు పంపించడం.. ఆయన తిరిగి వారిని వెనక్కు పంపించడం జరుగుతోంది. తనకు ఎవరి సహాయం అవసరం లేదని.. అభిమానులే తనకు రక్షణ అంటున్నారు. ఇటే వైసీపీ మంత్రులు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆయనేమో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో క్లోజ్ గా ఉంటున్నారు. అటు ప్రభుత్వం పంపిన గన్ మెన్లను తిరస్కరిస్తున్నారు.

    ఇదీ చదవండి : 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి శుభవార్త.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు

    ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు కామెంట్లు చేస్తుంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాధాకు స్వయంగా ఫోన్ చేసి.. పరామర్శించారు.. ఏం జరిగింది అన్నదానిపై ఆరా తీశారు. ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్లను తిరస్కరించడం సరికాదన్నారు. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ డీజీపీ లేఖ కూడా రాశారు. అయితే ఇదే అంశంపై నేరుగా చంద్రబాబును రాధా కలుస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు నాయుడు థాయిలాండ్ టూర్ నుంచి వచ్చిన తరువాత ఈ భేటీ ఉండొచ్చు అంటున్నారు. ముఖ్యంగా రాధాను హత్య కు కుట్ర చేస్తున్నది ఎవరు అన్నదానిపైనే వీరిద్దరి మధ్య చర్చ జరగనుంది. దీనికి తోడు మంత్రి కొడాలి నాని.. వల్లభ నేని వంశీలతో భేటీలపైనా చంద్రబాబు రాధాతో మాట్లాడే అవకాశం ఉంది.. ఆ భేటీ తరువాత రాధ టీడీపీ లో ఉంటారా.. వైదొలుగుతారా అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    ఉత్తమ కథలు