Posani Meets CM YS Jagan: సీఎం జగన్ (CM Jagan) మీద ఈగ కూడా వాలయనీయరు పోసాని కృష్ణమురళి (Posani Krihsna Murali). ఆయన్ను ఎవరైనా ఒక్క మాట అంటే చాలు.. మీడియా ముందుకు వచ్చి.. నానా రచ్చ చేస్తారు. ఇక వపన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శలు చేస్తే.. ఆదే స్థాయిలో పవన్ కల్యాన్ కి పోసాని కౌంటర్లు ఇచ్చిన సందర్భాలు ఎన్నో.. అయితే ఇటీవల రిపబ్లిక్ డే ఫంక్షన్ సందర్భంగా పవన్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. పోసాని ఓ రెంజ్ లో చెలరేగిపోయారు. పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీంతో ఆ రోజు నుంచి పోసనిపై సోషల్ మీడియా (Social Media) పై ట్రోల్స్ పెరిగాయి. సినిమా ఆఫర్లు సైతం తగ్గాయి. అయినా పోసాని మాత్రం తన రూటే సపరేటు అంటున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ మీద నిందలు వేస్తే మాత్రం.. ఎంతటి వాడైనా వంద అడుగుల లోతులో పాతుకపోతాడంటూ శపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా టికెట్ల విషయంలో వస్తున్న విమర్శలపై ఆయన రెస్పాండ్ అయ్యారు. భీమ్లా నాయక్ సినిమాకు టికెట్ల గురించి తనకు తెలియదని, తాను సినిమా వాడినే గానీ దాని గురించి తనకు తెలియదన్నారు. భీమ్లా నాయక్ సినిమాను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించడం సరి కాదన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్లు సాక్ష్యం ఉంటే చూపించండని సవాల్ విసిరారు.
భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ రోజునే.. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు పోసాని కృష్ణమురళి రావడం చర్చనీయాంశమైంది. సీఎం జగన్ తో సమావేశమైన ఆయన మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పినా.. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం.. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కు సంబంధించి టాలీవుడ్ టాక్ ఏంటి అన్న విషయాలపై చర్చించేందుకే వెళ్లారనే టాక్ ఉంది. అయితే ఆయన మాత్రం అలాంటి ఏదీ లేదన్నారు. తమ కుటుంబం కరోనాతో భాదపడుతున్న సమయంలో సీఎం, ఆయన సతీమణి మాట సాయం చేశారని తెలిపారు. ఏఐజి ఆసుపత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. అందుకే సీఎం వైఎస్ జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి తాను ఇక్కడకు రావడం జరిగిందని వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి : సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకోండి.. ఏపీ మంత్రి బొత్స సలహా
ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం మాత్రం సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చిన్న సినిమాల నుండి ప్రతిపాదనలు అందాకే టికెట్ల ధరలపై నిర్ణయం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చశారు. సీఎం జగన్ తో జరిగిన సమావేశంలో సినిమా టికెట్ల ధరలపై చర్చించలేదన్నారు. ఆలీకి ఇచ్చినట్టే తనకు పదవి ఇస్తున్నారనడంలో వాస్తవం లేదని పోసాని ఖండించారు. తామంతా సినిమాలో హీరోలు అయితే.. సీఎం జగన్ మాత్రం రియల్ హీరో అన్నారు.. అలాంటి జగన్ ను ఎవరైనా అనవసరంగా నిందిస్తే.. వారు 100 అడుగుల లోతుకు వెళ్లిపోతారని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Bheemla Nayak, Posani Krishna Murali