Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS SANKRANTI CELEBRATIONS IN EAST GODAVARI DISTRICT NGS

Sankranti: కోనసీమలో ముందే వచ్చిన సంక్రాంతి సందడి.. లంగావోణీల్లో మెరిసిన అమ్మాయిలు..

కోనసీమలో సంక్రాంతి సంబరాలు

కోనసీమలో సంక్రాంతి సంబరాలు

Sankranti in Konaseem: ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది. పట్టణాల్లో ఉన్న జనం పల్లె బాట పడుతున్నారు. రంగు రంగుల ముగ్గులతో పల్లె ఇళ్లు కళకళలాడుతున్నాయి. తాజాగా కోనసీమలో అయితే పండగ చాలాముందే వచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా హై స్కూల్ విద్యార్ధిణులు సంప్రదాయ దుస్తుల్లో చేసిన హంగామా హైలైట్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  Sankranti in Konaseem: తెలుగువారి అతి పెద్ద పండగ సంక్రాంతి (Sankranti).. అందుకే ఈ పండుగకు ముందు నుంచే సందడి కనిపిస్తోంది. పది రోజుల ముందు నుంచే మహానగరాల్లో ఉన్న ప్రజలు సైతం పండగ సందడి కోసం పల్లెబాట పడుతుంటారు. ఉద్యోగాలు, చదువు, పనుల కోసం నగరాల్లో ఉన్నవారంతా సంక్రాంతి పండగను సొంత ఊరిలో.. బంధువులు, స్నేహితుల మధ్య జరుపుకోవాలని ఆరాట పడతారు. మరోవైపు ప్రస్తుతం కరోనా వైరస్ (Corona Virus)  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ పలు సంస్థలు వర్క్ ఎట్ హోమ్ ఇచ్చాయి. దీనికి తోడు స్కూళ్లకు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులు ఇచ్చాయి.  అంతా పల్లెబాట పట్టారు. ఎక్కడ చూసినా ఆ సందడి కనిపిస్తూనే ఉంది. ఇక పల్లెల్లో అయితే ముగ్గులు, గొబెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో ఇప్పటి నుంచే పండుగ శోభ కనిపిస్తోంది. తెలుగువారి లోగిళ్ళలో సందడి మొదలైంది. ఇక స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థుల ఆట పాపటలతో అన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు వెల్లివిరుస్తున్నాయి.

  ముఖ్యంగా పంటలు ఇంటికి వచ్చేవేళ కోనసీమలో సంక్రాంతి సంబరాలు నాలుగు రోజుల పాటు భోగి, సంక్రాంతి (పెద్దల పండగ), కనుమ, ముక్కనుమ గా అంగరంగ వైభంగా జరుపుకుంటారు. నెల రోజుల ముందు నుంచి ఇంటింటా ముగ్గులు, గొబ్బెమ్మలతో సంక్రాంతి సందడి మొదలవుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) కోనసీమలో సంక్రాంతి పండగ వారం రోజుల ముందే వచ్చింది. ఈ సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు సందడి చేశారు. పి.గన్నవరం మండలం జడ్పీ హైస్కూల్ లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్తులంతా హంగామా చేశారు..

  స్కూల్ పిల్లలకు మన సంప్రదాయం, తెలిసే విధంగా సంక్రాంతి సంబరాలను ఇలా ఏర్పాటు చేశారు. గొబ్బెమ్మలతో అమ్మాయిల ఆటపాటలు, ప్రభల ఊరేగింపుతో సందడితో విద్యార్థులు సందడి చేశారు. స్టూడెంట్స్ తో పాటు ఈ సంబరాలకు ఊరు ఊరు తరలి వచ్చింది. తెలుగు సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియలనే ఇలా పిల్లలచేత సంక్రాంతి సంబరాలు నిర్వహించామని ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో కోనసీమలో ముందుగానే సంక్రాంతి సందడి కనివిందు చేస్తోంది.

  ఇదీ చదవండి : లైంగిక సామర్థ్యం పెంచే మన స్వీట్ కు ప్రత్యేక గుర్తింపు

  మరోవైపు సంక్రాంతి పేరుతొ గ్రామాల్లో కళకళలాడుతుంది.. ఇప్పటికే పట్టణాలు వెలవెల బోతున్నాయి.  పట్టణాల్లో ఉన్న చాలమంది ఇప్పటికే పల్లెబాట పట్టారు..స్కూళ్లకు సెలవులు ఇవ్వడం.. మళ్లీ కరోనా భయంతో వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వడంతో.. అంతా ముందుగానే సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు.. అయితే ఇలా అంతా ఒక్కదగ్గరే చేరడం కూడా ప్రమాదమే.. ఇప్పటికే కరోనా విస్తరిస్తోంది. కాబట్టి అందరూ తప్పక మాస్కు ధరించాలి అంటూ అధికారులు పదే పదే అవగాహన కల్పిస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Sankranti 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు