హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసిపోతాయి.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

AP Politics: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసిపోతాయి.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అప్పుడే ఎన్నికల వేడి రచ్చ చేస్తోంది. ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పొత్తు ఉంటుందా.. ఉండదా అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హడావిడి పెరిగింది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలను వేగవంతం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugu Desam).. మరింత దూకుడుగా ఉంది. ఓ వైపు నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర కొనసాగుతుంటే.. ఇదే సమయంలో రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటూ చంద్రబాబు జిల్లాలను చుట్టేస్తున్నారు. అయితే వారి పర్యటనలు పోలీసులు అడ్డుకోవడంతో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలానేతల పర్యటనలు అడ్డుకోవడంతో.. విపక్షాలు ఏకతాటిపైకి వస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కి.. అండగా నిలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. దీంతో పొత్తుల గురించి హాట్ హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంది అనేదిపై విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే, పలువురు సీనియర్ రాజకీయ నాయకులు ఎన్నికల పొత్తుల గురించి తమదైన విశ్లేషణ ఇస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నారు. తాజాగా సీనియర్ నేత, మాపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు హాట్ కామెంట్స్ చేశారు.

టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందా ఉండదా అనే చర్చ జరుగుతుంటే..? ఆయన మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఏకం అవుతాయని ఆయన అన్నారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపైనా ఆయన స్పందించారు. కన్నా రాజీనామా విషయం తనకు తెలిసిందన్నారు. కన్నాతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. కన్నాను రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి సపోర్ట్ చేశారని చెప్పారు. పెదకూరపాడులో కన్నా నేను కలిసి పోటీ చేశామన్నారు. చేబ్రోలు హనుమయ్య.. కన్నాను ప్రోత్సాహించారని వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎవరికి సిటు ఇస్తే వారికి సపోర్ట్ చేస్తానన్నారు రాయపాటి సాంబశివరావు. కన్నా టీడీపీలో చేరితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే కన్నాతో కలిసి పని చేస్తామన్నారు. ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుంది, తనకు ఉండేది తనకు ఉంటుందన్నారు.

ఇదీ చదవండి : : కన్నా వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. తాజా ఆరోపణలపై ఏమన్నారంటే..?

గత ఎన్నికల్లో పత్తిపాటి, జి.వి.ఆంజనేయులు, యరపతినేని లాంటి వారికి తాను ఆర్దిక సాయం చేశానన్నారు. ఇప్పుడు వాళ్లు ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేట సీటు చదలవాడ అరవింద్ బాబు దే అని చెప్పారు. ఈసారి అరవింద్ బాబు తప్పకుండా నరసరావుపేట ఎమ్మెల్యే అవుతాడని రాయపాటి సాంబశివరావు జోస్యం చెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, TDP

ఉత్తమ కథలు