Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS PRODUCER COM DIRECTOR NATTI KUMAR SENSATIONAL COMMENTS ON AP POLITICS NGS

AP Politics: సీఎం జగన్ కు వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతోందా..? నిర్మాత సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయా..? కొందరు అధికారులు.. మాజీ సీఎం.. పినిమా వాళ్లు.. మరికొందరు రాజకీయ నేతలు కలిసి కుట్రలు చేస్తున్నారా.. ఈ వ్యాఖ్యలు చేస్తోంది వైసీపీ నేతలు కాదు.. సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతే ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారాయి..

ఇంకా చదవండి ...
  Film Director Nattikumar on AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడు ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా.. ఎన్నికలు జరుగుతున్నాయా అనే స్థాయిలో పొలిటికల్ మాటల మంటలు వినిపిస్తున్నాయి. అధికార వైసీపీ (YCP)-ప్రతిపిక్ష టీడీపీ (TDP)లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాయి. ఎవరూ వెనక్కు తగ్గేదే లే అంటున్నారు. విమర్శలు ప్రతి విమర్శలు.. పరస్పర కేసులతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు గుడివాడ క్యాసినో అంశం.. మరోవైపు పీర్సీసీ ఆందోళనలు.. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ఇలా మొత్తం ఏపీలో పొలిటికల్ హంగామా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో సంచలన ఆరోపణలు చేశారు.. సినీ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ (Natti Kumar).. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఆదేశిస్తే నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తానని.. లేదంటే ఆయనకు మద్దతుగా పని చేస్తాను అంటూ.. రాజకీయ ఎంట్రీ పక్కా అంటూ తేల్చి చెప్పేశారు. ఆయన మాటలు చూస్తే.. అతి త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనుందుకు సిద్ధమయ్యారని.. ముహూర్తం ఫిక్స్ అయ్యాకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాను రాజకీయాల్లోకి రావాలి అనుకోడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..

  ఏపీలో ప్రస్తుతం సీఎం జగన్ భారీగా జన ఆధరణ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.. అందకే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్ర వెనుక కొంతమంది అధికారులు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తులుగా ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడకు తోడుగా సినీ ఫీల్డ్, అధికారులు, రాజకీయ నాయకులు కలిసి కుతంత్రాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. అందుకే ప్రతిపక్షాల కుట్రలను ఎదుర్కోడానికి మాత్రమే తాను రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నాను అన్నారు. అలాగే కొడాలి నానిని అడ్డుకోవాలని చూస్తే…ఎవరూ భయపడే ప్రసక్తే లేదని నట్టి కుమార్. తానుమూడు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధంగాఉన్నాను అన్నారు. అయితే సీఎం జగన్ ఆదేశిస్తే..ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇక ఈ ఫిబ్రవరి 01వ తేదీ నుంచి ప్రజల మధ్యలో ఉంటానని తెలిపారు.

  ఇదీ చదవండి: చంద్రబాబు వెన్ను పొటు పొడిస్తే.. సీఎం జగన్ గౌరవించారు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

  ప్రస్తుతం నట్టి కుమార్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.. సినిమా ఇండస్ట్రీలో చాలామంది రాజకీయాలపై ఆసక్తి చూపించడం చాలా కామన్.. ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరుతారు. కొంతమంది నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే.. మరికొందరు బయట నుంచి మద్దతు ఇస్తారు.. కానీ నట్టి కుమార్ మాత్రం.. సంచలన ఆరోపణలు చేసిన తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

  ఇదీ చదవండి: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ వెబ్ సైట్లలో టికెట్లు బుక్ చేసుకుంటే అంతే..

  సినీ నిర్మాతగా తెలుగు ప్రజలకు నట్టి కుమార్ బాగానే పరిచయం. నిర్మాత మాత్రమే కాకుండా దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గుర్తింపు ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య సినిమా టికెట్ల వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. జీవో 35 విషయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. థియేటర్లకు సంబంధించి..టికెట్ ధరలను నిర్ణయిస్తూ..ఏపీ గవర్న మెంట్ గతంలో జీవో 35ని తీసుకొచ్చిందని, ఈ జీవోని కొందరు థియేటర్ల యజమానులు ఉల్లంఘించారంటూ…ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జీవోని 35ని అమలు చేయాలంటూ హోమ్ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ..ఇతరులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నట్టి కుమార్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Cm jagan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు