Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS POLITICAL HEAT AT DHARMAVARAM IN ANANTAPUR DISTRICT WHAT HAPPENED NGS

AP Politics: అనంతపురం జిల్లాలో సెగలు రేపుతున్న ఆ నియోజకవర్గం.. ఢీ అంటే ఢీ అంటున్న ముగ్గురు నేతలు.. ఇప్పుడే ఎందుకంత హీటు..?

హీటెక్కిన ధర్మవరం

హీటెక్కిన ధర్మవరం

Andhra Pradesh Politics: అనంతపురం రాజకీయాల్లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం కాదనలేనిది.. ఏం జరిగినా వారి కనుసన్నల్లోనే జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో అనంతపురం జిల్లా తీరు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాంటి జిల్లాలో ఓ నియోజకర్గ ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.. రాజకీయంగా సెగలు రేపుతోంది. అభ్యర్థులను కూడా పార్టీలు ప్రకటించేస్తున్నాయి.. ఎందుకంత హాట్ గా మారింది.

ఇంకా చదవండి ...
  Dharmvaram Political Heat: మొన్నటి వరకు రాజకీయంగా చాలా ప్రశాంతంగా ఉన్న ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం పరిస్తితి సెగలు కక్కుతోంది. రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల తూటాలు పేలుతుంటే.. మరో క్రేజీ యువనేత నేనున్నాను అంటూ ఎంట్రీ ఇవ్వడమే కాదు.. వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. దీంతో ఇప్పటికే అక్కడ ఎన్నికల వాతావరణం (Elections heat) కనిపిస్తోంది. సాధారణంగా రాజకీయాల్లో అనంతపురం జిల్లా (Anantapuram District) తీరు కాస్త ఢిఫరెంట్‌. ఎన్నికలు ఉన్నా లేకపోయినా.. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. నిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో రాజకీయం రచ్చ రచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి తాడిపత్రి.. మరోసారి బాలయ్య ఇలాకా హిందూపురం.. ఇంకోసారి రాప్తాడు ఇలా వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. తాజాగా వాటి జాబితాలోకి చేరింది ధర్మవరం (Dharmavaram).. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నియోజకర్గంగా మారుతోంది ధర్మవరం. ఎవ్వరూ ఊహించని పొలిటికల్‌ హీట్‌ కనిపిస్తోంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి  వెంకట్రామిరెడ్డి (YCP MLA Kethireddy Venkatramireddy).. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మధ్య వార్ మరో అంకానికి చేరుకుంది. ఇద్దరూ రెండేళ్లపాటు సైలెంట్‌గా ఉన్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి లక్ష్యంగా బాణాలు సంధిస్తున్నారు టీడీపీ (TDP)ని వీడి బీజేపీ (BJP)లో చేరిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. ధర్మవరంలో కేతిరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. వరసగా ఆ వివరాలు వెల్లడిస్తానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే. వీరిద్దరిని దాటి టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ కూడా నియోజకవర్గంలో్ దూకుడు పెంచారు. అతా తానై వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడి పరిస్థితి మూడు ముక్కలాటగా మారింది.

  ప్రస్తుతం ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేత సూర్యనారాయణ అనుకున్నట్టుగానే మొదటి ఏపిసోడ్ విడుదల చేశారు. ఎమ్మెల్యే అనుచరులు భూకబ్జాలు చేస్తున్నారని.. ప్రభుత్వ కార్యాలయాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలు ఇవే అంటూ కొన్ని బయటపెట్టారు మాజీ ఎమ్మెల్యే. ఈ ఆరోపణలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ విమర్శలు.. ప్రతి విమర్శల వల్ల పనికాదని అనుకున్నారో ఏమో.. మూడోసారి ఆరోపణల తీవ్రత పెంచారు మాజీ ఎమ్మెల్యే. చెరువు వెనకవైపు కొండమీద ఒక ఇంద్ర భవనాన్ని ఎమ్మెల్యే నిర్మించారని.. అదంతా కబ్జా చేసిందేనని మండిపడ్డారు సూర్యనారాయణ.

  ఇదీ చదవండి ఆ మాజీ మంత్రి ధర్మ సంకటంలో పడ్డారా.. అందుకే వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారా.?

  మరోవైపు ఎమ్మెల్యే కేతి రెడ్డి సైతం నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన నిర్వహించిన మార్నింగ్ వాక్.. సోషల్ మీడియాలో చాలా హైలెట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఆదరణ పెరిగాలే చేసింది. అధినేత దగ్గర వంద మార్కులు పడేలా చేసింది.. స్పాట్ లోనే ప్రజా సమస్యలు తీరుస్తూ.. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి రా అనేలా ముద్ర వేయించుకున్నారు. అయితే ఇదంతా ఒక కోణమైతే.. అతిగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు నేరుగా అధికారులతో ఢీ అంటే ఢీ అనడం.. ఒక సామాజిక వర్గానికి చెందిన కలెక్టర్.. అది కూడా మంచి పేరు ఉన్న కలెక్టర్ తో వివాదానికి కాలు దువ్వడం.. కేతిరెడ్డికి మైనస్ అయ్యింది.

  ఇదీ చదవండి: ఆ మాజీ మంత్రి లెక్క తప్పుతోంది.. ఏ ప్రయత్నం ఫలించడం లేదా..? అసలు ఆయన టార్గెట్ ఏంటంటే..?

  ఇద్దరి మధ్య యుద్దం తారా స్థాయికి చేరిన సమయంలో ఈ ఫైట్‌లో ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ కూడా చేరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డిని.. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఇద్దర్నీ శ్రీరామ్‌ టార్గెట్‌ చేస్తున్నారు. ఒకవైపు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విరుచుకుపడుతూనే.. ఇంకోవైపు సూర్యనారాయణపై గురిపెట్టారు. తాజాగా తన బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా అంటూ కీలక ప్రకటన చేశారు మాజీ మంత్రి పరిటాల సునీత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తన బిడ్డను ఆశీర్వదించాలని ధర్మవరం ప్రజలకు విజ్ఙప్తి చేశారు. దీంతో ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో ముగ్గురు మధ్య ఫైట్ ముదురుతోంది. ముగ్గురి నేతల వరస కామెంట్స్‌తో ధర్మవరం రాజకీయం వేడెక్కుతోంది. మరి.. ధర్మవరం  రాజకీయాల్లో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, AP Politics, Paritala sriram

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు