Proddatur MLA Siva Prasad Reddy Birthday celebrations: సాధారణంగా అధికార పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు.. లేక మంత్రులు అయినా.. పోలీసులు, ఇతర అధికారుల్లో కొందరు వీరాభిమానం చాటుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఒక మంత్రి కాదు.. అలాగని కీలక పదవుల్లో కూడా లేరు. అధికారా పార్టీలో ఉన్న 150 మందికి పైగా ఎమ్మెల్యేల్లో ఆయన ఒక్కరు మాత్రమే.. కానీ ఆ ఎమ్మెల్యే (YCP) పై స్వామి భక్తిని చాటుకుంటున్నారు కొందరు పోలీసులు. తాజాగా ఆయన బర్త్‌డే వేడుకల్లో ఫుల్ హంగామా చేశారు. గజమాలతో ఘనంగా సత్కరించారు. అక్కడితో అభిమానాన్ని ఆపుకోలేకపోయారు. ఆగకుండా ఓ భారీ కేక్‌ను ఎమ్మెల్యేతో కట్ చేయించి తమ స్వామిభక్తి చాటుకున్నారు. ఇంతకీ, ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు. ప్రొద్దుటూరు వైసీపీ MLA శివప్రసాద్‌రెడ్డి (Peoddtppr mla shiva prasad Rdd). ఆయన పుట్టిన రోజు వేడుకల్లో్ ఆ నియోజవకర్గ పోలీసుల హాడావుడే ఎక్కువగా కనిపించింది. ఆయన బర్త్ డే వేడుకలకు హాజరైన వారంతా నియోజవర్గంలోని సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు..
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తీరు వివాదాస్పదమవుతోంది. పోలీసులంతా కలిసి యూనిఫామ్‌లో వెళ్లిమరీ ప్రొద్దుటూరు MLA శివప్రసాద్‌రెడ్డి వేడుకల్లో పోలీసులు హడావిడి చేయడం విశేషం. ప్రొద్దుటూరు రూరల్ సీఐ మధుసూదన్ గౌడ్, ఎస్సైలు శివశంకర్, సంజీవరెడ్డి, రాజుపాలెం ఎస్సై కృష్ణంరాజు కలిసి MLA బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించడం కలకలం రేపుతోంది. స్వయాన MLA ఇంట్లో కానిస్టేబుళ్లను సైతం తీసుకెళ్లి రాచమల్లును గజమాలతో సత్కరించి.. ఆయనతో భారీ కేక్ కట్ చేయించారు. ఇదే పోలీస్ పెద్దలు నానా హంగామా చేయడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
Birthday Special || ఆయన సీఎం కాదు.. కనీసం మంత్రి కూడా కాదు || కానీ పోలీ... https://t.co/Oma4Cl6fXe via @YouTube #ysrcp #ycp #AndhraPradesh
— nagesh paina (@PainaNagesh) December 20, 2021
కేవలం ఈ వ్యవహారమనే కాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పోలీసుల తీరు వివాదాస్పదమవుతూనే ఉంది. ముఖ్యంగా విపక్షాలైతే పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని గత కొన్ని రోజుల నుంచి ఆరోపిస్తున్నారు. తాజాగా విపక్షాలకు మరో అస్త్రం దొరికినట్టు అయ్యింది.
ఇదీ చదవండి : సంక్రాంతి పందాలకు సర్వం సిద్ధం.. కోళ్లకు మిలటరీ ట్రైనింగ్.. ఒక రోజు ఖర్చు ఎంతో తెలుసా?
పోలీలసులు బాసులంతా ఇలా ఎమ్మెల్యే బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడం వివాదాస్పదమవుతోంది. పోలీస్ అధికారులు యూనిఫామ్‌లో ఓ MLA ఇంటికెళ్లి బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించడాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకించారు. తాము ప్రభుత్వ అధికారులమనే సంగతి మర్చిపోయారా అంటూ మండుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిందనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని విమర్శిస్తున్నారు. బర్త్ డే పార్టీలో పాల్గొన్న పోలీస్ అధికారులపై డీజీపీ వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నాయకులు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ycp, Ysrcp