ANDHRA PRADESH POLITICAL NEWS NTR FAMILY MEMBERS AND TDP MAIN LEADERS NOT RESPOND ON NTR DISTRICT NGS
AP New District: ఎన్టీఆర్ జిల్లాకు జై కొట్టిన పురందేశ్వరి.. నందమూరి కుటుంబం మాటేంటి..?
ఎన్టీఆర్ జిల్లాలపై పెదవి దాటని నందమూరిమాట
AP New District: నందమూరి కుటుంబం సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి..? ఇటు టీడీపీ నేతలుకూడా నోరు ఎందుకు మెదపడం లేదు. ఆరాధ్యంగా కొలిచే ఎన్టీఆర్ పేరును ఓ జిల్లాలకు పెట్టినప్పుడు అభినందించాలి.. లేదా అభ్యంతరాలు ఉంటే చెప్పాలి.. కాని కామ్ గా ఉండడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
AP New District: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జిల్లాల నోటిఫికేషన్ (AP New Districts) పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు కూడా దీనిపై స్పందిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంటీడీపీ (TDP), ఇతర విపక్షాలు జనసేన (Janasena), కాంగ్రెస్ (Congress ) లాంటి పార్టీల నుంచి ఎక్కడా వ్యతిరేకత పెద్దగా వినిపించలేదు. ధీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నెలరోజుల సమయం ఇచ్చింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చెందిన వారు జిల్లాపేర్లు, జిల్లా కేంద్రాలు, ఇతర అంశాలపై స్పందిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ కీలక నేతలు కాని ఇప్పటి వరకు స్పందించలేదు.. మిగిలిన జిల్లాల విషయం ఎలా ఉన్నా.. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు.. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎలాంటి కామెంట్ చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడీపీ (TDP) వ్యవస్థాప అధ్యక్షుడు ఎన్టీ రామారావు (NT Ramarao) పేరును కొత్తగా ఏర్పాటు చేయబోతున్న విజయవాడ (Vijayawada) జిల్లాకు పెట్టింది ప్రభుత్వం. కానీ టీడీపీ మాత్రం దీనిపై మౌనంగానే ఉంది. టీడీపీ సంగతి అటు ఉంచితే.. నందమూరి కుటుంబ సైలెన్స్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన రాజకీయ, సినీ వారసులు చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అభిమానులతో టచ్ లో ఉంటున్నారు.. కానీ ఒక్కరు కూడా ఎన్టీఆర్ జిల్లాపై స్పందించడం లేదు..
ఎన్టీఆర్ కూతరుగా.. బీజేపీ నేత పురందేశ్వరి ఒక్కరే ఇప్పటి వరకు స్పందించారు. మహనీయుడు నందమూరి తారక రామారావు పుట్టిన జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడాన్ని ఆయన బిడ్డగా తాను స్వాగతిస్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రజాభీష్టం ఈ నాటికి నెరవేరిందని ఆమె ట్వీట్ చేశారు.
ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం, ఆయన బిడ్డగా నేను స్వాగతిస్తున్నాను.
ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది.
ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై.. ఇటు టీడీపీ, అటు నందమూరి కుటుంబాలు నేరుగా స్పందించడం లేదు.. ఒకవేళ స్పందిస్తే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని డిఫెన్స్ లో పడినట్టు కనిపిస్తోంది. అయితే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక.. బలమైన కారణం ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయవాడలో కమ్మ ఓట్లు అధికంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని స్వాగతించినా.. వ్యతిరేకించినా ఎటు నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అని ఇటు టీడీపీ కీలక నేతలు, అటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.