హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLA Roja on Bhuvaneswari: నారా భువనేశ్వరి వ్యాఖ్యల నిజమే.. ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

MLA Roja on Bhuvaneswari: నారా భువనేశ్వరి వ్యాఖ్యల నిజమే.. ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

MLA Roja on Bhuvaneswari: ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నారా భువనేశ్వరి వ్యాఖ్యల వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ ఘటనపై మాట్లాడిన నారా భువనేశ్వరి.. ఎవరి పాపాన వాళ్లు పోతారు అన్నారు.. దానిపై స్పందించిన ఎమ్మెల్యే రోజా.. అవును ఆమె వ్యాఖ్యలు నిజమే అంటూ సంచలన కామెంట్లు చేశారు.. ఇంతకీ ఆమె ఏమన్నారు అంటే..?

ఇంకా చదవండి ...

    MLA Roja on Bhuvaneswari: ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కురిసిన భారీ వర్షాలు, వరదల (ap Floods) కారణంగా దెబ్బ తిన్న బాధితులను ఆదుకునేందుకు సోమవారం  తిరుపతి (Tirupati)లో పర్యటించారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari). ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ (AP Assembly) లో జరిగిన పరిణామాలపై ఆమె రియాక్ట్ అయ్యారు. తనను అవమానించిన వాళ్లు, వాళ్ల పాపాన వాళ్లే పోతారన్నారు భువనేశ్వరి. వాళ్లు వచ్చి సారీ చెబుతారని ఎదురుచూడటం లేదని, దానికోసం టైమ్‌ వేస్ట్‌ చేసుకోనని ఆమె స్పష్టం చేశారు.  హెరిటేజ్‌ కంపెనీని కూలగొట్టాలని చాలా మంది చూశారని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు భువనేశ్వరి. హెరిటేజ్‌ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని, హెరిటేజ్‌ను ఎవరూ టచ్‌ చేయలేరని ఆమె మరోసారి స్పష్టం చేశారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై నగరి ఎమ్మెల్యే.. ఫైర్ బ్రాండ్ రోజా (MLA Roja) తనదైన స్టైల్లో స్సందించారు. అవేపే నారా భువనేశ్వరి చెప్పింది నిజమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఆడవాళ్లను అనవసరంగా ఏడిపించిన వాళ్లు వారి పాపాన వాళ్ళే పోతారన్న మాట నిజమే అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఆడవాళ్లను ఏడిపంచారని.. అందులో తాను కూడా ఉన్నాను అన్నారు. అంతాలా ఆడవాళ్లను ఏడిపించారు కాబట్టి చంద్రబాబుకి పాపం తగిలింది అన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు (Ex CM Chandrababu Naidu) ఉన్నప్పు ఆడవాళ్లను ఏడిపిస్తుంటే.. అప్పుడు మాట్లాడని భువనేశ్వరి, ఇప్పుడు చంద్రబాబు దొంగ ఏడుపులకు స్పందించడం ఏంటని రోజా ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారని మీరు గుర్తించాలన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వంగా పని చేస్తోందన్నారు. ఆడవాళ్లకు సముచిత స్థానం కల్పిస్తోందని.. మీ భర్త చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆడవాళ్లకు జరిగిన అన్యాయం గురించి మీరు ఎప్పుడూ మాట్లాడారా అని రోజా నిలదీశారు.

    ఇదీ చదవండి: ఎమ్మెల్యే రోజా యాక్టర్ కాకపోతే డాక్టర్ అయ్యేవారా..? ఆమె మనసులో మాట ఇదే..

    ఎమ్మార్వో వనజాక్షి పై దాడి, మహిళా పార్లమెంటుకు పిలిచి అవమానపరిచి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన.. ఇన్ని సందర్బాల్లో మహిళ బాఢిన విషయం నారా భువనేశ్వరికి తెలియదా అని ప్రశ్నించారు. ఆ రోజు కనిపించని భువనేశ్వరి.. ఇప్పుడు జరగని దాన్ని జరిగినట్లు మాట్లాడితే నమ్మేవారు లేరన్నారు. మీ భర్త దొంగ ఏడ్పులు ఏడిస్తే ఇప్పుడు మీరు మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యను కూడా రోడ్డున పెడుతున్నారని రాష్ట్ర ప్రజలు గమనించారని రోజా ఆరోపించారు.

    ఇదీ చదవండి: రేపే రామతీర్థం శంకుస్థాపన.. కోదండ రామస్వామి ఆలయ పునఃనిర్మాణానికి తొలి అడుగు.. నిర్మాణ వ్యయం ఎంతంటే..?

    ఒక మహిళగా.. ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరిపై తనకు అభిమానం ఉందన్నారు. అయితే నిజంగా ఏడు పాపం తగిలేది ఉంటే ముందుగా చంద్రబాబుకే తగిలేది అన్నారు. ఎందుకంటే మామ ఎన్టీఆర్ ఆత్మ ఎంత క్షోభించిందో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలుసు అన్నారు. తండ్రి ఆత్మ ఘోషించిన సంగతి నారా భువనేశ్వరికి తెలియదా అని రోజా ప్రశ్నించారు. ఇప్పటికైనా భువనేశ్వరి చాలా కేర్ ఫుల్ గాఉండాలన్నారు నగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, MLA Roja, Nara Bhuvaneshwari

    ఉత్తమ కథలు