Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS MINSTER KTR SETAIRS ON AP BJP PRESIDENT SOMU VEERAJJU COMMENTS NGS

KTR on BJP: వాట్ ఏ స్కీమ్.. వాట్ ఏ షేమ్.. బీజేపీ నేత సోముపై మంత్రి కేటీఆర్ సెటైర్లు..

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)

KTR On Bjp: తాము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే.. చీఫ్ లిక్కర్ ఇస్తామంటూ సోమువీర్రాజలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓ వైపు ఏపీ నేతలు ఆయన కౌంటర్ ఇస్తుంటే.. తాజాగా మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు..

ఇంకా చదవండి ...
    KTR On Bjp: తెలుగు రాష్ట్రాల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (AP BJP President Somuveerraju) చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం అవుతున్నాయి. ప్రజాగ్రహ సభ పేరుతో కమళనాథులు విజయవాడ (Vijayawada)లో నిర్వహించిన సభలో ఇప్పుడు రాజకీయ రచ్చకు వేదిక అవుతోంది. ఓ వైపు బీజేపీ (BJp) నేతలు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు నాన్ స్టాప్ గా కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యల దుమారం రేపుతున్నాయి. వైసీపీ (YCP) హయాంలో ప్రభుత్వమే పచ్చిసారా కాస్తూ.. 3రూపాయల మద్యాన్ని 25 రూపాయలకు కొని 250కి విక్రయిస్తోంది అన్నారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మేస్తున్నారన్నారని ఆరోపించారు. అదే జేపీకి ఓటు వేస్తే 70 రూపాయలకు చీప్ లిక్కర్ ఇస్తామని.. ఒకవేళ ఆదాయం బాగుంటే 50 రూపాయలకే ఇస్తామని హామీ ఇచ్చారు. మద్యం రూపంలో ప్రజలను దోచి మళ్లీ వారికే ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోరికను తీర్చే సత్తా బీజేపీకే ఉందని సోము వీర్రాజు ధీమావ్యక్తం చేశారు.

    ఇప్పుడు ఆ వ్యాఖ్యలే సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.. సోము వీర్రాజు వ్యాఖ్యలను కోట్ చేస్తూ సెటైర్లు వేశారు.. వాట్ ఏ స్కీమ్.. వాటే షేమ్ అంటూ ట్వీట్ చేశారు.. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ పీక్ కు చేరింది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో సోమువీర్రాజు వ్యాఖ్యలను ఆయన హైలైట్ చేశారు. ఇది జాతీయ పార్టీ బీజేపీ విధానం అంటూ ట్వీట్ చేశారు.. బీజేపీ ఓట్లు వేస్తే ఇలాంటి పథకాలే పెడతారు అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..



    ఇటు సోమువీర్రాజు ట్వీట్ పై ఏపీలో విపక్షాలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సీపీఐ నేత రామకృష్ణ అయితే ఓ అడుగు ముందు కేసి.. ఆయన సోమువీర్రాజు కాదు.. సారాయి వీర్రాజు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు మతిభ్రమించినట్లుంద‌ని రామకృష్ణ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ కారుచౌకగా అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించడం దుర్మార్గమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మద్యనిషేధం కోరుతుంటే, బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానంటోందని ఫైర్ అయ్యారు. కోటి మంది మందుబాబులు ఉన్నారని.. వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పటం వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అని విమ‌ర్శించారు.

    ఇదీ చదవండి : ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. కొత్తగా పది కేసులు..

    ఇటు ఏపీలో ప్రస్తుతం బీజేపీ-వైసీపీ మధ్య డైలాగ్ వార్ పీక్ కు చేరింది. ప్రజాగ్రహ సభ ఏపీ పాలిటిక్స్‌లో కొత్త హీట్ రాజేసింది. కాయాన నేతల వ్యాఖ్యలకు వైసీపీ నేతలు విరామం లేకుండా కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఎజెండానే బీజేపీ ఎజెండా అంటూ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మూడేళ్ల తర్వాత ఏపీలో జగన్ పాలన బాగాలేదని గుర్తొచ్చిందా? అంటూ సజ్జల కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉనికిని కాపాడుకోడానికే బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు చేశారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Minister ktr, Somu veerraju

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు