Minster Kodali Nani on chandrababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు ఆగడం లేదు. ఇటీవల ఏపీ అసెంబ్లీ (AP Assembly) వేదికగా ఎంత రచ్చ అయ్యిందో అందరికీ తెలిసిందే.. మంత్రులు వైసీపీ నేతలు చేసిన మాటల దాడికి హర్ట్ అయిన చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. తాను మళ్లీ సీఎం అయిన తరువాతే అసెంబ్లీలో అడుగుపెడతాను అంటూ శపథం చేశారు. ఆ తరువాత మీడియా సమావేశంలోనూ తన సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari)పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ దుమారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆఖరికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమనగలేదు.. తాజాగా మరోసారి మంత్రి కొడాలి (Minster Kodali nani) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబునాయుడిపై మరోమారు ఫైర్ అయ్యారు మంత్రి కొడాలి నాని. లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన గురించి వంశీ, జగన్ కుటుంబ సభ్యులపై టీడీపీ ఆఫీసు నుండి లోకేష్ చేసి పోస్టింగ్ ల పై వాళ్ళను ఏం చేయాలి? వంశీ చేసిన వ్యాఖ్యలు తన సొంతానివి కావు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలవి. రాజకీయాల కోసం పెళ్ళాన్ని కూడా వాడుకుంటారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మహా నటుడు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడితేనే అర్థం అవుతుంది అన్నారు. తాటి చెట్టుకు కూడా వయసు ఉంటుంది..విలువ ఇస్తామా? 74 ఏళ్ల వయసు వస్తే సరిపోతుందా? అన్నారు నాని.
ఇక చిన్న వయసులో ఉన్న జగన్ ను గాల్లో వస్తాడు… గాల్లో పోతాడు అని చంద్రబాబు అంటే తప్పకాదా అని మంత్రి ప్రశ్నించారు. జగన్ పోరాటయోధుడని.. చంద్రబాబు ఒక బిచ్చగాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన తనకు, వంశీకి రాజకీయ భిక్ష పెట్టడం ఏంటి? అని నిలదీశారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు తనకు రాజకీయ భిక్ష పెట్టారని విమర్శించారు కొడాలి నాని. అక్టోబర్ 22న వంశీ ఆన్ రికార్డ్ వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు 28 రోజుల తర్వాత ఏడ్వటానికి కారణం ఏంటో చెప్పాలి అన్నారు? తన ప్రణాళిక అమలు చేయటానికి అసెంబ్లీని చంద్రబాబు వేదిక చేసుకున్నారని విమర్శించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవ్. లక్ష్మీపార్వతిని బూతుగా చూపించి వెళ్లగొట్టే కుట్ర చేసింది చంద్రబాబు కాదా అని నాని ప్రశ్నించారు.
అసలు చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్, ఎన్టీ రామారావు కాదా? మరి వాళ్ళిద్దరిని వెన్నుపోటు పొడలేదా అన్నారు. లోకేష్ ను మంగళగిరి లో ఓడించింది చంద్రబాబు. ముఖ్యమంత్రి పదవి కి పోటీకి వస్తాడనే కావాలనే ఓడించారని కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. గుడివాడలో కమ్మ మీటింగ్ పెడతా… దమ్ము ఉంటే అరికెపూడి గాంధీ, మల్లాది వంశీ రావాలి అని సవాల్ విసిరారు. ప్రజలు ఎవరి గుడ్డలూడదీసి కొడతారో చూద్దాం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కొడాలి నాని.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Kodali Nani, TDP