Kodali Nani: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే మంత్రి కొడాలి నాని మరోసారి తనదైన స్టైల్లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ అంశంపై స్పందించిన ఆయన.. దారుణమైన కామెంట్స్ చేశారు. వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగిందని తన సమక్షంలో అతడు చెబితే.. సీఎం దృష్టికి తీసుకెళ్లాను అన్నారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రాధాకు సెక్యూరిటీ ఇప్పించారని, విచారణకు కూడా ఆదేశించారని మంత్రి గుర్తు చేశారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ అంశాన్ని కూడా రాజకీయక లబ్ది కోసం తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూశారని నాని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారని ఆరోపించారు. మా ఇద్దరి పార్టీలు వేర్వేరు అయినా.. అతనికి హాని ఉంటే.. కాపాడాలని అనుకుంటామన్నారు. అసలు రంగాని పొట్టన పెట్టుకున్న చంద్రబాబే.. ఇప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రంగా హత్య జరిగిందని నాని ఆరోపించారు. తనపై విమర్శలు వచ్చాయని తాను అనుకోవడం లేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమన్నారు. చంద్రబాబు ఎయిడ్స్ లాంటి వాడని. రాజకీయ వ్యభిచారం చెయ్యడం అలవాటు అని మంత్రి కొడాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని సినిమా టికెట్ల ధరలపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి కొడాలి నాని స్పందించారు. ఆర్జీవీపై ఆయన ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో ఉండి వర్మ ఏమైనా మాట్లాడతాడని.. పక్క రాష్ట్రంలో, ఇతర దేశాల్లో ఉండే వాళ్ల వ్యాఖ్యలు, విమర్శలను తాము పట్టించుకోమన్నారు. సినిమా టికెట్లపై తమ వైఖరి ఒక్కటే అని మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి : ఏపీలో కుల వివక్ష.. అగ్నికుల క్షత్రియ, అగ్రకుల విద్యార్థులకు వేర్వేరుగా పాఠశాలలు
అంతకుముందు వర్మా సైతం ఏపీ ప్రభుత్వంపై దారుణమైన కామెంట్లు చేశారు. సాధారణంగా ఆర్జీవీ అంటేనే ఓ సంచలనం...అతను ఏం మాట్లాడినా వివాదమే అవుతుంది. ఇటీవల ఆయన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. ఏపీ సర్కార్ ను ఏకంగా కరోనా వైరస్ తో పోల్చుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా లాంటిది అన్నారు. ఆ కోవిడ్ ను మనం ఏమి చెయ్యలేం.. అలాగే ఏపీ ప్రభుతాన్ని కూడా ఏమీ చెయ్యలేం అన్నారు. కరోనాను భరిస్తున్నట్టే.. ప్రభుత్వాన్ని భరించాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
RGV Hot Comments on Andhra Pradesh Government || ఆ ఇద్దరి కోసమే ఇదంతా చే... https://t.co/GqM3lBDB0U via @YouTube #RGVJ #ramgopalvarma #AndhraPolitics #Tollywood @CMJagan5 @RGVVipers
— nagesh paina (@PainaNagesh) January 2, 2022
అక్కడితో ఆగని ఆయన సినిమాటోగ్రఫర్ మంత్రి పేర్ని నానిపై వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్స్ చేస్తూ పేర్ని నానికి సవాలు విసిరారు. అలాగే సినిమా హీరోలు అంతా నోరు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడుతారంటూ డిమాండ్ చేశారు..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Kodali Nani, Ram Gopal Varma, Vangaveeti Radha