Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS MINSTER KODALI NANI AND VANGAVEETI RADHA MEETING AND TAKE CUP OF TEA NGS

YCP-TDP Leaders Friendship: ఒకే ఆటోలో టీ తాగుతూ కనిపించిన వైసీపీ-టీడీపీ నేతలు.. ఫోటో వైరల్

కొడాలి నాని- వంగవీటి రాధ

కొడాలి నాని- వంగవీటి రాధ

YCP -TDP Leaders Friendship: ఆంధ్రప్రదేశ్ లో అధికార -విపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణం ఉంటుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. అసలు ఒకరి ఫేస్ ఒకరు చూసుకోవడానికే ఇష్టపడరు.. కానీ ఈ నేతలు మాత్రం డిఫరెంట్.. అధికార - ప్రతిపక్ష నేతలు సరదాగా కలిసి ఒకే ఆటోలో టీ తాగారు.

ఇంకా చదవండి ...
  చ YCP -TDP Leaders Friendship: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార -విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. మాటల తూటాలు పేలుతుంటాయి. నువ్వు ఒకంటంటే.. నేను రెండు అంటాను అనే లెవెల్లో.. తిట్టుకుంటారు.. అసలు బద్ధ శత్రువుల్లా కొట్లాటకు కూడా రెడీ అనే స్థాయి రెండు పార్టీల నేతల మధ్య వైరం ఉంటుంది.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.. కానీ వీళ్లిద్దరూ మాత్రం కాస్త డిఫరెంట్.. ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఒకరంటే ఒకరికి ఇష్టం.. పార్టీలు వేరైనా స్నేహాన్ని మాత్రం కొనసాగిస్తుంటారు. వారిద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నేతలే. అందులో ఒకరు మంత్రి కొడాలి నాని అయితే.. రెండో నేత కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా భావించిన వంగవీటి రాధా.. ఇదరు వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా తమ స్నేహాన్ని మాత్రంకొనసాగిస్తూనే ఉన్నారు. సాధారణంగా వైసీపీ, టీడీపీ నేతలు అనేక అంశాలపై ఆరోపణలు చేసుకోవడం కామన్.. అయితే కొడాలి నాని నిత్యం చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటారు కూడా. విమర్శలు అనడం కన్నా.. తిట్ల దండకం అందుకుంటారు అనడమే బెటర్.. అందుకే కొడాలి నాని అంటే టీడీపీ సైతం అదే స్థాయిలో కొడాలని నానిపై మండిపడుతుంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య వైరం మాత్రం.. కొడాలి నాని, రాధా అనుబంధంపై కనిపించదు..

  ఈ ఇద్దరు నేతలు తాజాగా గుడివాడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా వెంకట రమణ (బాబ్జి) అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా కాసేపు ముచ్చటించుకున్నారు. బాబ్జి ఆకస్మిక మృతి పట్ల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారిద్దరూ అతి సాధారణంగా ఓ ఆటోలో కూర్చుని టీ తాగుతూ కనిపించారు. అయితే కొంతకాలంగా కొడాలి నాని తన స్నేహితుడు రాధాను వైసీపీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఉంది. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. రాధా వెళ్లాలి అనుకోవడం లేదో.. లేకా అధినేత జగన్ అది ఇష్టం లేదో.. కారణం ఏదైనా ఇద్దరూ వేర్వేరు పార్టీల్లోనే కొనసాగిగుతున్నారు.

  ఇదీ చదవండి : మరోసారి గెలిచేది ఆయనే.. కాకపోతే ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తా.. ఎవరైనా బెట్ కడతరా..? మంత్రి ఛాలెంజ్

  ఇటీవల కొడాలి నాని, వల్లభనేని వంశీల సమక్షంలోనే వంగవీటి రాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరిగిందని ఆరపోణలు చేశారు. ఆ వెంటనే మంత్రి నాని.. సీఎంను కలవడం.. ఆయన వెంటనే స్పందించి.. ఇద్దరు గన్ మెన్ లను నియమించడం చకచకా జరిగిపోయాయి. దీంతో రాధా వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం మొదలైంది. అయితే తనకు సెక్యూరిటీ వద్దని వంగవీటి రాధా తిరస్కరించడంతో.. కథ మళ్లీ మొదటికి వచ్చింది. అంతేకాదు ఆ హత్యకు కుట్ర చేసింది కూడా వైసీపీ నేత దేవినేని అవినాష్ కు చెందిన అనుచరుడు అని ప్రచారం జరగడంతో.. మంత్రి కొడాలి నాని ప్లాన్ రివర్స్ అయ్యింది. ఆయన ఒకటనుకుంటే.. మరొకటి అయ్యిందని విమర్శలు ఎదుర్కొన్నారు.

  ఇదీ చదవండి : సామాజిక వర్గాల వారిగా జాబితా ఖరారు.. ఏపీలో కొత్త మంత్రులు వీరే..

  ఆ వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగి.. నేరుగా వంగవీటి రాధ ఇంటికి వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పారు. డీజీపీ లేఖ రాశారు.. దీంతో వంగవీటి రాధ వైసీపీలోకి చేరుతారనే ప్రచారం బ్రేక్ పడింది. తాజాగా మళ్లీ మంగవీటి రాధ, కొడాలి నాని ఇలా టీ తాగుతూ ఫోటోలకు చిక్కడంతో.. మళ్లీ ఏదో జరుగుతోందనే ప్రచారం మొదలైంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kodali Nani, Vangaveeti Radha

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు