ANDHRA PRADESH POLITICAL NEWS MINSTER KODALI AND VALLABANENI VAMSI PLAN REVERSE WHAT NEXT NGS
AP Politics: ఆ మంత్రి ప్లాన్ రివర్స్ అయ్యిందా.. ఏం అనుకున్నారు.. ఏం జరుగుతోంది..?
ఆ మంత్రి ప్లాన్ రివర్స్ అయ్యిందా?
Andhra Pradesh politics: ఆంధ్రప్రదేశ్ లో ఎందరో సీనియర్ మంత్రులు ఉన్నా.. ఆయన క్రేజ్ వేరు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేరుగా సీఎంను కలవగలరు.. ఏ పని చేసినా అధిష్టానం దీవెనలు పుష్కలంగా ఉంటాయి. విపక్షాన్ని ఓ ఆట ఆడుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు.. తాజాగా ఆయన వేసిన ఓ ప్లేన్ బెడిసికొట్టిందని.. అది తిరిగి వైసీపీ మెడకు చుట్టుకుందని ప్రచారం జరుగుతోంది..
AP Minster Plan Failure: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినెట్ లో చాలామంది సీనియర్ మంత్రులు ఉన్నా.. ఆ మంత్రికి ప్రత్యేక క్రేజ్ ఉంది.. పార్టీ అభిమానుల్లోనే కాదు.. అదిష్టానం దగ్గరా అంతే గుర్తింపు ఉంది. అన్ని విషయాల్లో ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అధినేతను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసే అంతా చొరవ ఉంది. అందుకే అన్ని విషయాల్లో చాలా దూకుడుగా ఉంటారు. ముఖ్యంగా విపక్షాలను ఆడుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.. ఇప్పుడు ఆ మంత్రి వేసిన ఓ పెద్ద ప్లాన్ రివర్స్ అయ్యిందా.. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయ్యిందా అనేట్టు మారిందని.. ఆ వ్యవహారంపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే.. కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి రాధా (Vangaveeti Radha) ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో (AP Politics) కాపు కీలక నేతలంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత వంగవీటి రాధా అనడంలో ఎలాంటి సందేహం లేదు. వంగవీటి రంగా (Vagnaveeti Ranga) కొడుకుగా.. ఆయన ఆ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న అంటిముట్టనట్టు ఉన్నారు. అధిష్టానం తనను లెక్క చేయడం లేదనే ఫీలింగ్ లో ఉన్నారని టాక్ ఉంది. దీంతో ఆయనకు అత్యంత సన్నిహితుడైన మంత్రి.. మరో ఎమ్మెల్యేతో కలిసి వైసీపీ గూటికి రప్పించే ప్రయత్నం చేశారని.. అందులో భాగంగానే ఇటీవల తనపై హత్యకు రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యలు చేయించారనే ప్రచారం ఉంది.
వంగవీటి రాధా వ్యాఖ్యలు చేసిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన వ్యాఖ్యలకు తమకు అనుకూలంగా మార్చుకునేలా జెట్ స్పీడ్ తో సీఎం జగన్ దగ్గకు వెళ్లి.. విషయాన్ని చేరవేశారు మంత్రి కొడాలి నాని. వెంటనే సీఎం సైతం ఆయన భద్రతపై డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం.. ఇద్దరు గన్ మెన్ లను నియమించడం చకచకా జరిగిపోయాయి.. ఇక రాధా వైసీపీ వాడే అని ప్రచారం జనాల్లోకి వెళ్లేలా చేశారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. తారువాత అసలు కథ అడ్డం తిరిగింది..
ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో చాలా అనుమానాలు పెరిగాయి. రాధాని వైసీపీలోకి తీసుకెళ్ళేందుకు కొడాలి నాని, వంశీలు ట్రై చేస్తున్నారని, అందుకే ఈ రచ్చ అంతా వచ్చిందని కొందరు టీడీపీ శ్రేణులు అనుమానించాయి. అయితే ఎప్పటినుంచో వంశీ, కొడాలిలు రాధాని వైసీపీలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఏదొక ఫంక్షన్లో వారు రాధాని కలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆ ప్లాన్ ను ఆచరణలో పెట్టారు. రాధాని వంశీ తన కారులో తీసుకెళ్లారు. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. కొడాలి, వంశీ, రాధాలు కలిసి ఉండటంతో ఇంకా..కృష్ణా జిల్లా రాజకీయాల్లో మార్పులు జరగనున్నాయని అంతా అనుకున్నారు. రాధా వైసీపీలోకి వెళ్ళడం ఖాయమని అనుకున్నారు.
ఇంతలో ఏమైందో కానీ రాధా తనకు కేటాయించిన సెక్యూరిటీని వద్దని తిరిగి పంపించేశారు. అందులోనే రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించింది వైసీపీ కీలక నేత అనుచరుడు.. అధికార పార్టీలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడనే టాక్ వినిపిస్తోంది. దీంతో కథ అడ్డం తిరిగింది. సీఎం ఆదేశాలతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే వైసీపీకి తలనొప్పులు తప్పవు.. అలాగని వదిలిస్తే వైసీపీ నేతలు కాబట్టి వదిలాశారనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు అనూహ్యంగా ఎత్తు వేశారు. వంగవీటి రాధాకు ఫోన్ చేసి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారాని బ్రేకులు పడ్డాయి. ఆ వెంటనే చంద్రాబు డీజీపీకి సైతం లేఖ రాశారు. వంగవీటి రాధాకు భద్రత కల్పించాలని.. అసలు వైసీపీ అధిష్టానంపై వంగవీటి రాధా గుర్రుగా ఉన్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ఆయన మళ్లీ అన్ని మరచిపోయి వైసీపీలో చేరాలి.. కానీ టీడీపీ నుంచి ఊహించని మద్దతు పెరిగింది..
తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా వంగవీటి రాధా ఇంటికి వెళ్లి మాట్లాడారు. పార్టీలో ఆయనకు కచ్చితంగా గౌరవం ఉంటుందని.. బాధ్యతలు కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి కీలక పదవిపై కూడా హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అధినేత స్వయంగా వచ్చి హామి ఇవ్వడంతో వంగవీటి రాధా ఇక టీడీపీని వీడే అవకాశం లేనట్టే.. దీంతో కొడాలి-వంశీల ప్లాన్ బెడిసికొట్టిందని తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. రాధాని తీసుకుని కాపు వర్గాన్ని మరింత దగ్గర చేసుకోవాలని వైసీపీ ప్రయత్నించిందని, కానీ వైసీపీలో అనేక అవమానాలు భరించి వచ్చిన రాధా...మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్లడానికి సిద్ధంగా లేరని తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో ఈ ఎపిసోడ్ ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.