Home /News /andhra-pradesh /

Minster Botsa: పీఆర్సీపై మంత్రి క్లారిటీ.. ఉద్యోగ సంఘాలకు నాది భరోసా అంటున్న బొత్స

Minster Botsa: పీఆర్సీపై మంత్రి క్లారిటీ.. ఉద్యోగ సంఘాలకు నాది భరోసా అంటున్న బొత్స

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

Botsa on Prc: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలను కూల్ చేసే పనిలో పడ్డారు మంత్రి బొత్స.. ప్రతిపక్షాల ఉచ్చులో పడి ఉద్యమ బాట పట్టొద్దని సలహా ఇస్తున్నారు. కచ్చితంగా పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాస్త ఓపిక పట్టాలంటూ సూచిస్తున్నారు. బొత్స వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు వెర్షన్ ఏంటి..?

ఇంకా చదవండి ...
    Andhra Pradesh Govt Employees:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఉద్యోగులు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తమ కార్యాచరణ కూడా ప్రకటించాయి,.  ముఖ్యంగా  పీఆర్సీ (PRC)తో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉద్యోగ సంఘాలు సమరానికి సిద్ధమని తేల్చేశాయి. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం (AP Government)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడ (vIJAYAWADA)లో సమావేశమై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. పీఆర్‌సీ నివేదిక ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. ఉద్యోగులను కార్యాచరణ దిశగా ప్రభుత్వమే నెట్టిందని ఆరోపించారు. అయితే ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స భరోసా ఇస్తున్నారు.

    గత కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదికపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమయిన అన్యాయం జరగకుండా చూస్తామని, పీఆర్సీ విషయంలో కాస్త ఓపికతో వుండాలన్నారు బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న అనంతరం బొత్స ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామన్నారు మంత్రి బొత్స. ఐ.ఆర్. మధ్యంతర భృతి ని సైతం ప్రకటించామని తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తామని బొత్స అన్నారు. ఈ విషయంలో ఉద్యోగులు కొంత ఓపిక పట్టాలన్నారు.

    పురపాలక సంఘాల్లో పనులు చేసిన గుత్తేదారుల బిల్లుల చెల్లింపు, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఇస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. బిల్లుల చెల్లింపు ఆగలేదని, అనవసర రాద్ధాంతం చేసేందుకే కొందరు ఆందోళన చేస్తున్నారని మంత్రి మండి పడ్డారు.  అలాగే గ్రామ పంచాయితీ నిర్వహణ ఖర్చులు చెల్లింపుకే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామన్నారు. ఆ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశ్యం లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

    ప్రతిపక్షాలు వాస్తవాలు పరిశీలించకుండా ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

    బొత్స హామీ పైనా ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమకారచణ ప్రకటించినా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం బాధాకరమంటున్నారు. ఇంకా ఓఫికపట్టే అవకాశం లేదని.. అన్ని రకాల ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని.. ఉద్యమం విషయంలో వెనక్కు తగ్గేదే లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పేశాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Botsa satyanarayana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు