హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Botsa on Nani: మేమింతే.. మా ఇష్టం అంటే కుదరదని నానికి బొత్స కౌంటర్.. థ్యాంక్స్ చెప్పిన అనిత

Botsa on Nani: మేమింతే.. మా ఇష్టం అంటే కుదరదని నానికి బొత్స కౌంటర్.. థ్యాంక్స్ చెప్పిన అనిత

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

Botsa on Nani: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు సినిమా చుట్టూ తిరుగుతున్నాయి. ఓ వైపు సినిమా థియేటర్లపై దాడులు.. మూసివేతలు.. దీనికి తోడు తగ్గిన రేట్లు.. ఇదేం సమయంలో పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ లతో సందడి నెలకొంది. తాజ విదాంపై స్పందించిన మంత్రి బొత్స నానికి్ కౌంటర్ ఇచ్చారు.. మేమింతే.. మా ఇష్టం అంటే కదురదు అన్నారు.

ఇంకా చదవండి ...

Botsa on Nani:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తీరుపై  హీరో నాని (Hero Nani)  సంచలన వ్యాఖ్యలు చేశారు..  శ్యామ్ సింగ రాయ్ (Shyam Singh Roy) రిలీజ్ కు ముందు ప్రోమోషన్ లో పాల్గొన్న ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల  (Cinema Tickets) ధరలు తగ్గించడపై ఆవేదన వ్యక్తం చేశారు.  తాను ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుందని.. కానీ తప్పని సరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోంది అన్నారు.  ఎవరూ కోరకపోయిన టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించింది అన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్ కంటే.. కిరాణా షాపులు నడుపుకోవడం మంచిందనే అర్థంలో వ్యాఖ్యలు చేశారు. అయితే అదే స్థాయిలో నానికి ప్రభుత్వం తరపు నుంచి కౌటర్లు వస్తున్నాయి.

న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన శ్యామ్‌సింగరాయ్‌ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాని శ్యామ్‌సింగరాయ్‌ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏపీ ప్రభుత్వంపై ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో నాని వ్యాఖ్యలకు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్‌ ధరలు తగ్గించామని బొత్స అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని, తమకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.

ఇదీ చదవండి: తంతిడి తీరంలో అనుకోని అతిథి.. ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు

ఒకవేళ మార్కెట్‌లో ఏదైనా కొంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా అని ఆయన అన్నారు. ప్రేక్షకులను తామెందుకు అవమానిస్తామని మండిపడ్డారు. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా..? అని బొత్స సత్యాన్నారయణ ప్రశ్నించారు. మేమింతే.. ఎంతంటే అంత వసూలు చేస్తామంటే కుదరదని ఆయన వెల్లడించారు. సినిమా చూసేవారికి మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారి అతడే.. తేల్చి చెప్పిన సీబీఐ అధికారులు

మరోవైపు సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్‌ హీరో నాని తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.. ఏపీ మంత్రులు.. హీరో నానిపై కౌంటర్‌ ఎటాక్ చేస్తుంటే.. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాత్రం ఆయనకు మద్దతు తెలిపారు. టిక్కెట్‌ ధరలపై హీరో నాని కామెంట్లపై స్పందించిన అనిత… హీరో నానికి థాంక్స్‌ చెబుతున్నాను అన్నారు.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు.. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదన్నఅనిత.. ఈ ప్రభుత్వ విధానాలతో తమకు సంబంధం లేదనుకున్నారో.. భయపడ్డారో.. కానీ, సినిమా వాళ్లు స్పందించలేదని.. సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు సెగ తాకింది కాబట్టి.. ఇప్పటికైనా హీరో నాని వంటి వారు స్పందించినందుకు థాంక్స్‌ అన్నారు అనిత.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Botsa satyanarayana, Natural star nani

ఉత్తమ కథలు