ANDHRA PRADESH POLITICAL NEWS MINSTER AVANTI SRINIVASA RAO RECMONDATIONS NOT WORK IN PARTY OR GOVERNMENT NGS VSP
AP Minster: ఆ మంత్రి మాటకు విలువ లేదా..? సొంత నియోజకవర్గంలో పెత్తనం వేరేవాళ్లదేనా..?
ప్రతీకాత్మకచిత్రం
Andhra Pradesh Minster: ఆయనో పేరున్న మంత్రి.. రాజకీయంగా ఎంతో గుర్తింపు ఉంది. కానీ ఇఫ్పుడు సొంత పార్టీలోనూ, ప్రభుత్వం లోనూ ఆయన మాటకు విలువ లేదు. ముఖ్యంగా ఆయన సొంత జిల్లాలోనూ ఆయనకు తెలియకుండానే పనులు జరిగిపోతున్నాయా..?
P. Anand Mohan, Visakhapatnam, News18. YSRCP Politics : ఆయన ప్రముఖ రాజకీయ నేత. అలాంటి ఇలాంటి నేత కాదు. రెండు మూడు పార్టీల్లో చక్రం తిప్పి.. వరుసగా గెలిచి మంత్రి అయ్యారు. తన గురుసమానుడైన వ్యక్తిని కూడా ఓ తొక్కు తొక్కేసి.. తనకు తానుగా ఎదిగిన నేత. అలాంటి నేత మంత్రి పదవిలో ఉంటే చక్రం తన చేతిలోనే ఉండాలి.. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సొంత పార్టీలోనూ.. ఆఖరికి సొంత ఇలాకాలో కూడా ఆయన మాటకు విలువ లేదని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తానున్న పార్టీలో.. తాను మంత్రిగా ఉన్న ప్రాంతంలో.. తన నియోజకవర్గం తనకి ప్రమేయం లేకుండా పనులైపోతున్నాయని ఆయనే బాధ పడుతున్నారా..? ఇప్పుడు విశాఖలో ఇదే టాక్. ఆ మంత్రికి సరిగ్గా ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదని ఆయన అనుచరులే గుసగుసలాడుతున్నారు.
విశాఖపట్నం (Visakhapatanam)లో భీమిలీ నియోజకవర్గం చాలా పెద్దది. విస్తీర్ణం, తీర ప్రాంతం ఇలా అన్ని విషయాల్లోనూ పెద్ద నియోజకవర్గం భీమిలీ. అలాగే ఇక్కడి రాజకీయాలు కూడా రసవత్తరంగానే ఉంటాయి. గతంలో గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ప్రాతినిధ్యం వహించిన ఇదే నియోజకవర్గానికి ఇప్పుడు ముత్తం శెట్టి శ్రీనివాసరావు(Muttamsetti Srinivasarao) ఎమ్మెల్యే, మంత్రిగా కూడా ఉన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఆయనకు మంచి పదవే దక్కింది. టీడీపీ (TDP)లో మాజీ మంత్రి గురుసమానుడు అయిన గంటాను ఢీకొట్టి మరీ బయటకు వచ్చిన వాళ్లలో అవంతి శ్రీనివాస్(Avanati Srinivas) మొదటి పేరు. వైసీపీకి రాగానే ఎన్నికలు.. ఆ పై గెలుపు.. మంత్రి పదవి దక్కడంతో ఆయనకు మంత్రివర్గంలోనూ మంచి ప్రాధాన్యం దక్కింది. మంత్రివర్గంలోనే కాస్తంత ఎక్కువ అనుభవం ఉన్న నేతగా కూడా గుర్తింపు పొందారు.
ఇంత వరకు బాగానే ఉన్నాజిల్లాలోనే ఆయన పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా మారుతోంది. పాపం మంత్రి అని సానుభూతి వ్యక్తమవుతోంది. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఖరికి పోలీసు ఉన్నతాధికారుల దగ్గర కూడా మంత్రి మాటలు.. ఆటలు సాగడం లేదనే టాక్ ఉంది. సుధీర్ఘకాలంగా ప్రత్యక్ష రాజకీయాలు చేసిన అనుభవం ఇక్కడ పనికిరావడం లేదు ఆయనకు.
మంత్రి ఆజ్ఞలు.. ఆదేశాలు ఎక్కడా అమలు కాకుండా విశాఖలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని వినికిడి. తమ నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఏ మాత్రం పడకుండా చూడటం ఒకెత్తయితే.. ఏకంగా ఆయన నియోజకవర్గంలో కూడా ఏ పని జరగకూడదని చెప్పేయడం ఇక్కడ కొసమెరుపు.
విశాఖకి చెందిన భీమిలీ నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రికి ఇది అవమానం కదా అని ప్రశ్నిస్తున్నాయి ఇక్కడి వర్గాలు. అధికార వైసీపీలో ఆయనకు ప్రాధాన్యత కరువైందని మంత్రి బాధపడుతున్నారని సమాచారం. ఇప్పటికే ఓ అంశం విషయంలో ఆయన కలత చెందారట. తన నియోజవర్గం పరిధిలో జరిగిన ఓ పోలీసు అధికారి బదిలీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆయన ప్రమేయం లేకుండా ఇక్కడి పోలీసు స్టేషన్ కి సీఐ బదిలీ కావడం.. ఆ విషయం మంత్రికి అస్సలు తెలియకపోవడం షాక్ కి గురిచేసిందట.
ఫార్మాలిటికీ మంత్రిని కలిసిన కొత్త సీఐ ఈ విషయాన్ని చెప్పడంతో మంత్రి షాక్ అయ్యారట. సీఐ బదిలీ విషయం తనకి తెలియకపోవడమేంటని ఏకంగా విశాఖ నగర పోలీసు బాస్ కి ఫోన్ కొట్టారట మంత్రి. అయితే ఇదంతా సిస్టం ప్రకారం జరుగుతోందని నగర పోలీసు కమిషనర్ మంత్రికి వివరించారని సమాచారం. ఇక బదిలీ నిర్ణయం కూడా వెనక్కి తీసుకోవడం జరగదని సున్నితంగా కుండబద్దలు కొట్టేశారట. దీంతో మంత్రి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి విజయసాయిరెడ్డికి ఫోన్ చేశారు. అక్కడ నుంచీ కూడా ఎలాంటి పాజిటివ్ రియాక్షన్ రాలేదని సమాచారం.
బదిలీల విషయంలో వేలు పెట్టొద్దని కూడా చెప్పేసినట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈ బదిలీ ఆపాలని అడిగితే.. బదిలీ ఆపడం కుదరదని.. మీ ఇష్టం అని చెప్పేశారట మంత్రిగారికి. ఇటీవల కొన్ని అభివృద్ధి పనులు.. విశాఖలో తనకు మర్యాద పూర్వకంగా ఆహ్వానించడాలు మినహా మంత్రికి ఎలాంటి ప్రాధాన్యం లేదని తెలుస్తోంది. తనకు జరుగుతున్న అవమానంపై సీఎం జగన్ కి చెప్పాలని ప్రయత్నించినా.. వివరించే ఛాన్స్ రాలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.