హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Minster: ఆ మంత్రికి అధికారులు అవసరం లేదా..? అసలు వారితో సమస్య ఏంటి?

AP Minster: ఆ మంత్రికి అధికారులు అవసరం లేదా..? అసలు వారితో సమస్య ఏంటి?

అధికారులు అవసరం లేదంటున్న మంత్రి

అధికారులు అవసరం లేదంటున్న మంత్రి

AP Minter controversial comments: ఆ మంత్రికి ప్రభుత్వ ఉద్యోగులు అక్కరలేదా?వీఆర్వోలు సచివాలయాలకు వస్తే తరిమేయాలా..? మంత్రి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు..? అధికారులు లేకుంటే మరి పని చేసేది ఎవరు..?

  Andhra Pradesh Minster Sidiri Appalaraju sensational comments:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పశుసంవర్ధక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు (Minster appala raju) వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రాజకీయం చేయడానికి వచ్చారా? ఉద్యోగానికి వచ్చారా?’ అంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్కడితో ఆగని ఆయన..  వీఆర్వో (VRO)లు సచివాలయాలకు వస్తే..  సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు వారిని తరమాలంటూ పిలుపునిచ్చారు. వీఆర్వోలను కట్టడి చేయలేని అధికారులు ఎందుకని తహసీల్దార్లను నిలదీసారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోలు సహా రెవెన్యూ ఉద్యోగులు (Revenue Employees) అసహనం వ్యక్తం చేస్తున్నారు.  సమస్య చెప్పుకుందామని వచ్చిన తమపై మంత్రి చిందులు వేశారంటూ మండిపడుతున్నారు. మంత్రి తీరుపై వీఆర్వోలతో పాటు తహసీల్దార్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

  రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) కాశీబుగ్గలో పలాస-కాశీబుగ్గ మున్సిపల్ కమీషనర్ టి.రాజగోపాల్ ఆధ్వర్యంలో స్దానిక టీకేఆర్ కళ్యాణ మండపంలో హౌసింగ్, ఓటియస్ లపై పలాస నియోజకర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మందస, వజ్రపుకొత్తూరు, పలాస రూరల్, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి చెందిన  స్ధానిక సంస్ధల ప్రతినిధులతో మంత్రి అప్పలరాజు అవగాహనా కార్యక్రమం నిర్వహించేందుకు సమావేశం నిర్వహించారు.

  ఇదీ చదవండి : ఇంటికి 2 వేల రూపాయలు.. ఉచిత రేషన్.. వరద బాధితులు ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామన్న సీఎం జగన్

  ఈ సమావేశానికి నియోజకవర్గానికి చెందిన పలు సచివాలయాల వీఆర్వోలు కూడా హాజరయ్యారు. నియోజకర్గ స్థాయి సమీక్షా సమావేశానికి హాజరైన వీఆర్వో లను కమీషనర్ టి.రాజగోపాల్ (గెటౌట్) అంటూ బయటకు పొమ్మని హుకుం జారీచేసారు.  సమావేశానికి  మిమ్మల్ని  ఎవరు పిలిచారంటూ మండిపడ్డారు. సమావేశానికి హాజరైన తమను బయటకు పొమ్మంటూ అవమానపరిచినందుకు కమీషనర్ వీఆర్వోలు  నిలదీసారు. సమావేశానికి ఎందుకు పిలిచారంటూ ప్రశ్నించారు. కమీషనర్ వ్యాఖ్యలకు నిరసనగా రోడ్డు పై ధర్నా చేసి పలాస మండల వీఆర్వోలు నిరసన వ్యక్తం చేసారు.

  ఇదీ చదవండి : జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఏపీ రాజకీయాలు.. స్ట్రాటజీ ఏంటి.. నడిపిస్తున్నది ఎవరు? ఆయన మనసులో ఏముంది?

  అదే సమయంలో వచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజును కలిసి తమ ఆవేదన చెబుదామని భావించారు. తరువాత మున్సిపల్ కమీషనర్ కూడా వివాదంపై వివరణ ఇచ్చారు. తరువాత  క్కడే ఉన్న వీఆర్వోలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయం చేయడానికి వచ్చారా? లేదా ఉద్యోగం చేయడానికి వచ్చారా? అంటూ మండిపడ్డారు. ధర్నా చేసిన వీఆర్వోలందరికీ క్రమ శిక్షణ చర్య క్రింద మెమోలు జారీ చేయాలని పలాస మండల తహశీల్దార్ ను ఆదేశించారు.


  ఇదీ చదవండి : ఉత్తరాంధ్రవైపు దూసుకొచ్చిన జవాద్ తుఫాను.. అత్యవసర పరిస్థితుల కోసం ఈ నెంబర్లు రాసి పెట్టుకోండి

  సమావేశం జరుగుతున్న సమయంలో కూడా వీఆర్వోలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రేపటి నుండి తన నియోజకవర్డంలో వీఆర్వోలు సేవలు అవసరం లేదని, వస్తే తరిమి కొట్టాలంటూ అక్కడున్న వారిని ఆదేశించారు. దీనిని స్ధానిక సర్పంచ్ లు, ఎంపీటీసీలు కూడా గమనించాలని, ఒక వేళ విధులకు హాజరైతే.. వారిని తరిమి కొట్టాలని ఆదేశించారు. అక్కడున్న తహశీల్దార్లపై అసంత్ళప్తి వ్యక్తం చేస్తూ.. మీరు కూడా వీఆర్వోలను ఆపలేకపోతున్నారా అంటూ మండిపడ్డారు.

  ఇదీ చదవండి : సీఎం ప్రకటనపై ఉద్యోగులు అసంతృప్తి.. ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరిక..

  ఈ వ్యాఖ్యల పట్ల వీర్వోలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. సచివాలయాల్లో 90 శాతం రెవెన్యూ సేవలు వీఆర్వోలే అందిస్తున్నామని.. సమావేశానికి పిలిచి అవమానించడం తగదని, కలెక్టర్‌ వద్దే తేల్చుకుంటామన్నారు. మంత్రి వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని లేదంటే.. ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఏపీవీఆర్వోల సంఘం ప్రకటించింది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Srikakulam

  ఉత్తమ కథలు