Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయా (Andhra Pradesh Politics)ల్లో కులాలకు ఉన్న ప్రాధాన్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.. సామాజిక వర్గాల వారీ ఓట్ల కోసం ప్రతి పార్టీ లెక్కలు వేసుకుని.. ఆ సామాజిక వర్గ నేతలపై ఫోకస్ చేస్తారు. ప్రస్తుతం కాపు సామాజిక నేతల్లో (Kapu Community Leaders) చైతన్యం పెరగడం.. ఓట్లు ఎక్కువగా ఉండడంతో అంతా వారి ఓట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఆ పార్టీలో కీలక నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు కాపు నేతలు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. తాజాగా విజయవాడ రాజకీయాలు మొత్తం కాపు కీలక నేత వంగవీటి రాధా (Vangaveeti Radha) చుట్టూనే తిరుగుతున్నాయి. ఎవరికి వారు రాధాను తమ వాడు అని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తనపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందని ఆయన వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కాపుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఇదే సమయంలో అన్ని పార్టీల్లో ఉన్న కీలక కాపు నేతలు రహస్యంగా హైదరాబాద్ (Hyderabad)లో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం మాట్లాడుకున్నారు అన్నదానిపై క్లారిటీ రాకపోయినా.. వచ్చే ఎన్నికలపై ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి అన్నదానిపైనే చర్చ జరిపినట్టు సమాచారం..
ఇక తాజాగా విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లిలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కీలక కాపు నేతలంతా హాజరయ్యారు. అయితే ఇలాంటి కార్యక్రమాలకు పార్టీతో సంబంధం లేకుండా నేతలు హాజరువుతూనే ఉన్నారు. తమ సామాజిక వర్గం ఓట్ల కోసం నేతలు ఇలా చేయడం కామన్ అయితే ఈ సమావేశం సందర్భంగా నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఇదీ చదవండి : రాధాపై హత్యాయత్నం నిజమేనా..? ఆ అవసరం ఎవరికి ఉంది..?
ఈ విగ్రహావిష్కరణలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు , చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ , ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వంగవీటి రంగాని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ఎవరు ఏ పార్టీలోనైనా ఉండవచ్చునని.. అయితే కాపు నాయకులు ఏ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ వారికి కాపులు అండగా నిలబడాలని సూచించారు. వారిని ప్రోత్సహించమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పారు
Andhra Pradesh Politics || మనం మనం అంటున్న కాపు నేతలు || పార్టీలు వేరు మ... https://t.co/6Ovr5FHq0z via @YouTube #andhra #AndhraPradesh #TDP #YSRCP @Ganta_Srinivasa
— nagesh paina (@PainaNagesh) January 1, 2022
మహాత్మాగాంధీ, డా.బి ఆర్ అంబేద్కర్ తరువాత రాష్ట్రంలో అత్యధిక విగ్రహాలు కలిగిన ఏకైక నాయకుడు రంగా మాత్రమే నేతలు అభిప్రాయ పడ్డారు. తమ అవసరాలు.. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో వివిధ పార్టీల్లో ఉంటామని.. అవసరం అయితే తామంతా ఒకటే అన్నారు. రాబేయా కాలం అధికారం కాపుల చేతుల్లోనే ఉంటుంది అన్నారు మాజీ మంత్రి.. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.