Home /News /andhra-pradesh /

Jr NTR: టీడీపీ నేతలకు వార్నింగా..? వైసీపీ మైండ్ గేమా..? కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల స్ట్రాటజీ అదే..?

Jr NTR: టీడీపీ నేతలకు వార్నింగా..? వైసీపీ మైండ్ గేమా..? కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల స్ట్రాటజీ అదే..?

జూనియర్ ఎన్టీఆర్ వెనుక ఉన్నది ఎవరు..?

జూనియర్ ఎన్టీఆర్ వెనుక ఉన్నది ఎవరు..?

Jr NTR Fans in kuppam: చంద్రబాబు సొంతం నియోజకర్గం.. అది కూడా ఆయనకు కంచుకోటలాంటింది. కానీ అక్కడి తాజా పరిణామాలు మాత్రం టీడీపీ అధినేతకు అంతుచిక్కడం లేదు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఒక ఎత్తైతే.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హంగామా..? టీడీపీ కార్యకర్తలే ఎన్టీఆర్ అభిమానులైనా..? ఎందుకు ఈ హడావుడి.. వారి టార్టెట్ ఏంటి? దీని వెనుక ఎవరైనా ఉన్నారా..?

ఇంకా చదవండి ...
  Jr NTR Fans in kuppam: టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు  కంచుకోటగా చెప్పుకునే కుప్పం (Kuppam)లో పరిస్థితులు మారిపోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఓటమి అంటే.. అధికార పార్టీ పోల్ మేనేజ్ మెంట్.. పోలీసుల సహకారం.. దొంగ ఓట్లు ఇలా రకరకాల కారణాలు చెప్పొచ్చు.. కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్యే టీడీపీ (TDP) కలవరపాటుకు గురి చేస్తోంది. తాజాగా కుప్పంలో జూ.ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ధర్నా చేయడం చర్చకు దారి తీస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం హాట్‌టాపిక్‌ అవుతోంది. ఇటీవల ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneswari)పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నందమూరి ఫ్యామిలీతో పాటు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు అంతా తీవ్రంగా స్పందించారు. జూ.ఎన్టీఆర్ సైతం వీడియో ద్వారా అసెంబ్లీలో జరిగిన ఘటనను సున్నితంగా ఖండించారు.

  అయితే  ఎన్టీఆర్ స్పందనను తప్పు పట్టారు.  ఎన్టీఆర్ ఆది, సింహాద్రిలా రెచ్చిపోతారని ఆశిస్తే.. చాగంటి ప్రవచనాలు చెప్పారంటూ వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న లాంటి నేతలు ఎద్దేవా చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలకు గట్టి హెచ్చరికలు పంపకుండా ఎన్టీఆర్ తప్పు చేశాడని.. అసలు స్పందించకపోయినా బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. నిమ్మల రామునాయుడు కూడా ఎన్టీఆర్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని.. ఆయన నుంచి అలాంటి స్పందన ఊహించలేదన్నారు. ఎన్టీఆర్ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయంటూ టీడీపీ శ్రేణులే కారణమన్నారు.

  ఇదీ చదవండి : వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వారి పేర్లు చెప్పాలని బలవంతం చేస్తున్నారంటూ ఫిర్యాదు

  వరస పెట్టి టీడీపీ నేతలు జూనియర్ ను టార్గెట్ చేస్తూ వివమర్శలు చేశారు. దానికి కౌంటర్ గా జూనియర్ అభిమానులు సైతం ట్విట్టర్ వేదికగా ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.. జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అంటూ.. ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చేశారు..

  ఇదీ చదవండి : అహోబిలంలో రోడ్డు ప్రమాదం.. లోయలోపడ్డ ఆర్టీసీ బస్సు.. 10మంది తీవ్రగాయాలు

  ఆ వివాదం అక్కడితో ఆగిపోలేదు.. తాజాగా టీడీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ ఏకంగా చంద్రబాబు కంచుకోట కుప్పంలోనే ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. మరోసారి తమ హీరోను విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ టీడీపీ నేతలను గట్టిగానే హెచ్చరించారు. ఎన్టీఆర్‌పై నోరుపారేసుకుని అవమానిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ చంద్రబాబు పర్యటనలోనూ ఎన్టీఆర్ అభిమానులు హల్‌చల్ చేశారు. కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు.

  ఇదీ చదవండి : ఒమిక్రాన్ తరుముకొస్తోంది.. నిర్లక్ష్యం వద్దు మిత్రమా.. మాస్క్ మస్ట్ అని గుర్తించండి..

  ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా.. స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ అభిమానులు తరచూ నిరసనలకు దిగుతుండటం అనుమానాలు కలిగిస్తున్నాయి అంటున్నారు టీడీపీ నేతలు. దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందేమో అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో టీడీపీ కార్యక్రమాలు జరిగే చోట జూనియర్‌ ఎన్టీఆర్‌ నినాదాలు వినిపించడం వైసీపీ మైండ్‌గేమ్‌లో భాగమేనని అంటున్నారు. చంద్రబాబు సభల్లోకాని, లోకేశ్‌ సభల్లోకాని, లేక టీడీపీకి చెందిన ఇతర కార్యక్రమాల్లో ఇటీవలి కాలంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ఇదంతా కావాలని చేయిస్తున్నదేనని, వైసీపీనే ఇదంతా చేయిస్తోందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Jr ntr, Tdp

  తదుపరి వార్తలు