Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS JOINT COLLECTOR CONTROVERSY AT BOTSA HOUSE NEW YEAR CELBRATIONS NGS VZM

Botsa Controversy: ఏపీలో అధికారుల స్వామి భక్తిపై విమర్శలు.. మంత్రి కాళ్లు మొక్కిన జేసీ

బొత్స కాళ్లు మొక్కిన జేసీ

బొత్స కాళ్లు మొక్కిన జేసీ

Botsa Contrvercy: ఓ సామి అంటూ స్వామి భక్తి చాటుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో కొందరు అధికారులు.. మంత్రులు, నేతల సేవలో తరిస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఓ జాయింట్ కలెక్టర్ చేసిన పని ఇప్పుడు విమర్శలకు వేదిక అయ్యింది. జాయింట్ కలెక్టర్ అయిన ఆయన మంత్రి కాళ్లు మొక్కడమేంటని విపక్షాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Minster Botsa Contrvercy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారుల వ్యవహారంపై రచ్చ రచ్చ అవుతోంది. చాలా చోట్ల అధికారులు.. వైసీపీ (YCP) కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విపక్షలు పదే పదే విమర్శిస్త వస్తున్నాయి. మొన్నటి వరకు పోలీసుల పైనే ఈ విమర్శలు ఎక్కువగా వచ్చేవి.. ఇప్పుడు ఐఏఎస్ లు కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అధికారులు, ఉన్నత స్థానంలో ఉన్నవారు మంత్రులకు శుభాకాంక్షలు చెప్పడం సాధారణంగా జరిగేవే అక్కడి వరకు తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. కానీ ఓ జాయింట్ కలెక్టర్ (Joing Collector) చేసిన పనిపై తీవ్ర విమర్శుల వెల్లువెత్తున్నాయి. జాయింట్ కలెక్టర్ హోదా లో ఉన్న వ్యక్తి అలా చేస్తే.. ఇక ప్రజలకు ఆయన ఏం న్యాయం చేస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంత స్వామి భక్తి ఉంటే అధికారం వదిలి రాజకీయాల్లో చేరాలని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్ కిషోర్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేయటానికి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్శారు.

    పుష్పగుచ్ఛం పట్టుకుని మంత్రి దంపతులకు ఇచ్చిన ఆయన.. చుట్టూ అందరూ ఉన్నారు అనే ఆలోచన కూడా లేకుండా.. తాను ఒక ఉన్నత అధికారిని అన్న విషయం మరిచిపోయి.. మంత్రి బొత్స సత్యనారాయణ మోకాళ్లకు మొక్కారు. ఒక ఐఏఎస్ అధికారి మంత్రికి ఇలా పాదాభివందనం చేయడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.. సాధారణ సిబ్బంది.. ఇతర ఉద్యోగులు సైతం నమస్తే అన్ని పక్కకు వస్తుంటే జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్న ఆయన కాళ్లు మొక్కడం ఏంటని చూసిన వారు సైతం ఆశ్చర్యపోయారు. మంత్రిపై అంత అభిమానం ప్రేమ ఉంటే.. ఇక ప్రజలకు ఆయన ఎలా సాయపడగలరు అనే చర్చ మొదలైంది.



    అయితే అధికారులు ఇలా స్వామి భక్తి చాటుకోవడం ఇదేం తొలిసారి కాదు. ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గరే కాదు ఎమ్మెల్యేలు, ఎలాంటి పదవులు లేని వైసీపీ నేతల దగ్గర కూడా స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. ఇక నాయకుల పుట్టిన రోజుల సంరద్భంగా అయితే పోలీసులే కార్యకర్తల్లా అన్ని దగ్గర ఉండి చూసుకోవడం తీవ్ర దుమారం రేపింది. కడపజిల్లా పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పోలీసుల తీరు వివాదాస్పదమైంది. ఆ సమయంలో పోలీసులు కార్యకర్తల్లా మారిపోయారు. ఎమ్మెల్యేకి బొకేలు ఇచ్చి అభిమానాన్ని, దండలు వేసి స్వామి భక్తిని చాటుకున్నారు. అక్కడ నిజంగా పోలీసులు కార్యకర్తల్లానే కనిపించారు.



    తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పోలీసుల అత్యుత్సాహం పీక్‌కి వెళ్లిపోయింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తండ్రి రామస్వామిని ఘనంగా సన్మానించారు. ఏ ప్రొటోకాల్‌ లేని రామస్వామికి సీఐ, ఎస్సైలు సెల్యూట్‌ చేశారు. దండలు వేసి, ఫ్లవర్‌ బొకేలు ఇచ్చి ఎమ్మెల్యే ఫాదర్‌ని ఫిదా చేశారు. కేక్ కటింగ్‌ చేసి వీర విధేయత ప్రదర్శించారు. తాజాగా బొత్సాకు కాలు మొక్కి జేసీ మరో వివాదానికి తెరలేపారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Botsa satyanarayana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు