ANDHRA PRADESH POLITICAL NEWS IF ELECTIONS WILL COME YCP WIN 175 SEATS MINSTER SAID NGS
AP Minster: ఏపీలో ముందస్తు ఎన్నికలపై మంత్రి క్లారిటీ.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్ని సీట్లు వస్తాయి అంటే..?
సీఎం జగన్ (ఫైల్)
AP Minster: ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు టార్గెట్ 2024 దిశగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే విపక్షాలన్నీ ముందస్తు అని సందడి చేస్తున్నాయి. దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీకి వచ్చిన సీట్లు ఎన్నో జోస్యం చెప్పారు.
AP Minster: ఆంధ్రప్రదేశ్ (Andhra Prades) లో రాజకీయం రచ్చ రచ్చగా మారుతోంది. రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే ఏపీలో ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయి అని భారీగా చర్చ జరుగుతోంది. టీడీపీ (TDP) కీలక నేతలు సైతం ముందస్తుకు సిద్ధంకండి అని పిలుపు ఇస్తున్నారు. వ్యూహాలను కూడా సిద్ధం చేస్తున్నారు.. ఇటు అధికార వైసీపీ (YCP) సైతం అదే మూడ్ లో కనిపిస్తోందని ప్రచారం ఉంది. ఓ వైపు కొత్త జిల్లాల ఏర్పాటు (New Distirct).. మరోవైపు పాలనా పరమైన మార్పులు.. పార్టీ ప్రక్షాళ, మంత్రి వర్గ విస్తరణ.. ప్రజా ప్రతినిదుల పనితీరుపై నివేదికలు ఇలా.. వైసీపీ (YCP) సైతం ఎన్నికల మూడ్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అధికారికంగా ముందస్తు ఎన్నికలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Minster Vellampalli) క్లారిటీ ఇచ్చారు. తమ అధినేత జగన్ మోహన్ రెడ్డికి (Jagan Mohan Reddy) ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.. ఇది అంతా కేవలం టీడీపీ కల్పిస్తున్న భ్రమ మాత్రమే ఆయన విమర్శించారు...
అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. మళ్లీ వైసీపీదే విజయం అని.. మరోసారి వార్ వన్ సైడ్ అవ్వడం పక్కా అంటూ అభిప్రాయపడ్డారు. తావచ్చే ఎన్నికల్లో 175 కి 175 తామే గెలుస్తామని ప్రకటన చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ విషయంలో తగ్గేదే లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ సైతం ఓడిపోక తప్పదన్నారు. పవన్ గత ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఆయన సంగతి పక్కన పెట్టినా.. రానున్న ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. 175 కి 175 గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ క్యాడర్ చెల్లా చెదురైపోయిందని.. క్యాడర్ ను కాపాడుకోవడానికే ముందస్తు ఎన్నికలంటూ బాబు హడావిడి చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.
ముందస్తు ఎన్నికలొస్తాయని చంద్రబాబు ఎలా చెబుతారని.. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదని తేల్చి చెప్పారు ఆయన. 2024లో చంద్రబాబుకి అభ్యర్ధులు కూడా దొరకరని ఆయన అభిప్రాయడ్డారు. ముందస్తొచ్చినా.. మద్యస్తొచ్చినా.. ఆంధ్రప్రదేశ్ లో ఎగిరేది వైసీపీ జెండానేనని తేల్చి చెప్పారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు పగటి కలలు కనడం ఆపేసి.. ప్రజ సమస్యలపై ఫోకస్ చేయడం మంచిది అన్నారు. అది మానేసి క్యాడర్ ను ఉత్సాహపరచడానికే పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని మభ్యపెడుతున్నారన్నారు. రాసి పెట్టుకోండి.. జగన్ను ఓడించడం చంద్రబాబు, లోకేష్ తరం కాదన్నారు. ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డితోనే ఉన్నారని తెలిపారు. అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడని.. రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి డిపాజిట్లు కూడా రావన్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.