హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Casino Controversy: మంత్రి పదవికి కొడాలి రాజీనామా చేయాల్సిందే.. న్యాయ పోరాటం దిశగా టీడీపీ

Casino Controversy: మంత్రి పదవికి కొడాలి రాజీనామా చేయాల్సిందే.. న్యాయ పోరాటం దిశగా టీడీపీ

Casino Controversy: గుడివాడలో క్యాసినో వివాదం ఇప్పట్లో చల్లారాలే లేదు.. ఇప్పటికే దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న టీడీపీ.. మంత్రి కొడాలి నానిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే.. కోర్టుల ద్వారా మంత్రికి శిక్ష పడేలా చేయాలని టీడీపీ యోచిస్తోంది.

ఇంకా చదవండి ...

  Casino Controversy:  ఆంధ్ర్రప్రదేశ్ (Andhra Pradesh) లో మొన్న సంక్రాంతి  సంబరాలు (Sankranthi Celebrations) అంతా సందడిగా సాగితే.. అదే సమయంలో గుడివాడ (Gudivada)లో క్యాసిన్ వ్యవహారం (Casino Issue) పండగు రోజుల్లో హైలైట్ అయ్యింది. స్వయాన మంత్రి ఇలాకాలో ఆయన అనుచరులే ఈ క్యాసినో ఆడించారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో అధికార-విపక్షాల మధ్య క్యాసినో వివాదం మరింత ముదిరింది. టీటీడీ (TDP) నిజనిర్ధారణ కమిటీ పేరుతో గుడివాడలోని కే.కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లే ప్రయత్నం చేస్తే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నేతల పై దాడికి యత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఇటు బీజేపీ (BJP) కూడా గుడివాడ వెళ్లే ప్రయత్నం చేస్తే.. గొడవ జరిగే అవకాశం ఉండడంతో వారిని సైతం పోలీసులు అడ్డకున్నారు. దీంతో గుడివాడ క్యాసినో అంశం ప్రస్తుతం పొలిటికల్ గా సెగలు పుట్టిస్తోంది. అన్ని పార్టీలు క్యాసినో వ్యవహారంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా గుడివాడ క్యాసినో వివాదంలో మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) ఫైర్ అయ్యారు. మంత్రి కొడాలి నాని (Minster Kodali nani).. గుడివాడకు.. గోవా సంస్కృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు. క్యాసినో వివాదంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దాదాపు 500 కోట్ల జూదం జరిగితే సీఎంకి బాధ్యత లేదా? అని అడిగారు. మొదటి సంవత్సరం ఎడ్ల పందాలకు సీఎం జగన్ గుడివాడకు వచ్చారని దేవినేని ఉమా అన్నారు.

  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి ఎందరో మహానుభావులు గుడివాడ నుంచి వస్తే.. ఈరోజు గుడివాడను ఒక గోవా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడలో గంజాయి, డ్రగ్స్, మహిళలు, గుట్కా, మట్కా విచ్చలవిడితనం అయిపోయాయని ఆరోపించారు. ప్రతి ఇంట్లో కూడా గుడివాడ క్యాసినో గురించి మాట్లాడుతున్నారని దేవినేని ఉమ అన్నారు. 27 ఎకరాల లేఔట్ల ప్రాంగణంలో పెద్ద ఎత్తున జూదం జరిగితే శాసనసభ్యుడిగా, మంత్రిగా నానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. సన్న బియ్యం ఇస్తానని చెప్పి క్యాసినో ఆడించారని ధ్వజమెత్తారు. కొడాలి నానికి ఏ మాత్రం సిగ్గున్నా వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కేంద్ర సంస్థలు అన్నీ కూడా ఈ క్యాసినో బాగోతంపై స్పందించాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు.. వైసీపీ ప్రభుత్వం అనడం లేదని.. క్యాసినో ప్రభుత్వం అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాళ్లు పట్టుకుని రెండుసార్లు ఎమ్మెల్యేగా అయ్యి పార్టీ మారి మంత్రి అయిన 32 నెలలకే ఇంతా అహంకారమా? అంటూ కొడాలి నానిపై విరుచుకుపడ్డారు.

  ఇదీ చదవండి : నేడు ఫిబ్రవరి కోటా టికెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలి అంటే.. నిబంధనలు ఇవే

  మరోవైపు ఈ వ్యవహారాన్ని టీడీపీ ఇప్పట్లో విడిచిపెట్టేలా లేదు. క్యాసినో బాగోతాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది టీడీపీ. అయితే గవర్నర్ అస్వస్థతకు గురైనందున ఆయన కార్యదర్శి సిసోడియాకు తాము ఫిర్యాదు, సాక్ష్యాలు అందచేయడం జరిగిందన్నారు. పేద, మధ్య తరగతి వాళ్లు జూదం ఆడడం కోసం ఓ టెంటు ఏర్పాటు చేశారని, 10 వేల రూపాయలు కట్టే వారికి కాసినో ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. కొడాలి నాని కాసినో నానిగా మారి రాష్ట్రంలో విష సంస్కృతికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. గుడివాడ కాసినోను ప్రపంచమంతా చూసినా సీఎం జగన్ చూడలేకపోతున్నారని విమర్శించారు. డీజీపీ చూసి కూడా చూడనట్లు నటిస్తున్నారని, ఆధారాలు బయటపెడితే కొడాలి నాని సూటిగా సమాధానం చెప్పలేక తమల్ని అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని వెల్లడించారు. అయితే ఈ విషయంలో గవర్నర్ దగ్గర అయినా న్యాయం జరగపోతే.. కోర్టుల ద్వారా అయినా మంత్రికి శిక్షపడేలా చేస్తామంటోంది టీడీపీ..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Devineni uma, Gudivada, Kodali Nani

  ఉత్తమ కథలు