Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS EX MP MEKAPATI RAJAMOHAN REDDY SENSATIONAL COMMENTS ON CM JGAN NGS

Comments on CM Jagan: సీఎం జగన్ పై మేకపాటి షాకింగ్ కామెంట్స్.. ప్రజలను చీట్ చేయొద్దని సలహా

మేకపాటి సంచలన వ్యాఖ్యలు

మేకపాటి సంచలన వ్యాఖ్యలు

Comments on CM Jagan: కొందరు వైసీపీ నేతల వ్యాఖ్యలు సీఎం జగన్ కు షాక్ ఇస్తున్నాయి. పదవులు రావడం లేదని.. అధినేత పట్టించుకోవడం లేదని.. సీనియర్లు కాస్త అసహనంతో వ్యతిరేకత వ్యాఖ్యలు చేయడం కామన్.. అయితే తాజాగా మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ వుతున్నాయి.

ఇంకా చదవండి ...
    Comments on CM Jagan:మాజీ ఎంపీ.. వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపింది. సీఎం జగన్మోహన్ రెడ్డి కి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆయన వివరించారు. అందుకే గత ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరమన్నారు. కానీ ప్రజలను చీట్ చేయడం.. మభ్య పెట్టడమో చేయకూడదని సూచనలు చేశారు. ప్రజల సొమ్ము కు పాలకులు ధర్మకర్త లే కానీ.. సొంత దారులం కాదని గుర్తు పెట్టుకోవాలని రాజమోహన్ రెడ్డి సలహా ఇచ్చారు. ప్రజల సొమ్ము ప్రజలకి అప్పగించాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయిందని.. ఇప్పట్లో ఏపీ కోలుకోవడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. పాలన చేసిది ఎవరైనా..? హైదరాబాద్‌ లాంటి మహా నగరాన్ని ఏపీలోనూ నిర్మించాలని ఆయన సూచనలు చేశారు. తాను మొదట్లో హైదరాబాద్‌ కు వెళ్లినప్పుడు అక్కడే.. ఒక్క ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ మాత్రమే ఉండేదని..  ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి లో ఎంత ముందుకు దూసుకుపోతోందో చూడాలిన  చెప్పారు. అలాగే ఏపీని అభివృద్ధి చేయాలని కోరారు సీఎం జగన్ ను కోరారు.

    తాను మంత్రి గౌతమ్ రెడ్డికి అదే సూచించే వాడిని అన్నారు. 974 కీలో మీటర్ల సీకోస్ట్ ఉంది. పోర్టులు, హార్బర్లు ఏర్పాటు చేయండి. పెట్టుబడులు తెమ్మని చేపే వాడిని అన్నారు. రాజధాని కూడా సూటబుల్ ప్లేస్‌లో ఉండాలని.. హైదరాబాద్‌ని డెవలప్ చేసింది మనవాళ్లే కదా అని గుర్తు చేశాను అన్నారు.

    ఇదీ చేయండి : ఓడించినందుకు గ్రామస్తులపై కక్ష తీర్చుకున్న సర్పంచ్ అభ్యర్థి.. ఏం చేశాడంటే..?

    ప్రస్తుతం మేకపాటి వ్యాఖ్యలు ఏపీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇటీవల మేకపటి గౌతమ్ రెడ్డి మరణం వరకు సీఎం జగన్ కు ఆ కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి.. ముఖ్యంగా మేకపాటి గౌతమ్ రెడ్డి సీఎం జగన్ కు చాలా నమ్మకస్తుడిగా ఉండేవారు. అందుకే జగన్ కూడా ఎక్కువగా మేకపాటికి గౌరవం పదవులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఇటీవల గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆ రోజు స్వయంగా సీఎం జగన్ మేకపాటి ఇంటికి వెళ్లి.. నివాళులు ఆర్పించి.. అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇచ్చారు.. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు సడెన్ రాజామోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతల్లోనే చర్చ జరుగుతోంది..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Mekapati Goutam Reddy

    తదుపరి వార్తలు