Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS EX MINSTER DHARMANA PRASAD RAO DOUBT ON HIS FUTURE PLANS WHAT HAPPENED NGS VZM

YCP MLA: ఆ మాజీ మంత్రి ధర్మ సంకటంలో పడ్డారా.. అందుకే వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారా.?

మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు

మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు

YCP MLA: సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది.. మారుమూల జిల్లాకు చెందిన నేతే అయినా.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.. పార్టీ అధినేతలకు అంత్యంత సన్నిహితుడిగా మెలిగారు.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కూడా.. అలాంటి సీనియర్ నేత ఇప్పుడు తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. మరోసారి కేబినెట్‌లో చోటుదక్కలేదన్న ఆవేదనో ఏమో సైలెంట్ అయ్యారు. కానీ ఇటీవల గేర్‌మార్చి మాటల తూటాలు పేలుస్తున్నారు వివాదాలకు కేరాఫ్ అవుతున్నారు.. ఎందుకలా?

ఇంకా చదవండి ...
  YCP MLA Futer Plan: ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యే (ycp mla)లో ఆయన చాలా సీనియర్ నేత.. మంత్రిగా సుదీర్ఘ అనుభవం అయనది.. రాష్ట్ర రాజకీయాలను శాశించిన చరిత్ర ఉంది.. జిల్లాల్లో ఆయన ఏది అంటే అదే జరిగేది..అలాంటి ఎమ్మెల్యే చాలా కాలం సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి.. ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao). ఆయన మాట్లాడితే ఒక పదం ఎక్కువ తక్కువ ఉండదు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. సిక్కోలు జిల్లాలో కీలకనేతగా గుర్తింపు పొందారు. చాలా ఏళ్లు.. మంత్రిగా ఉన్నారు. వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాక మరోసారి కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించినా.. అవకాశం రాలేదు.. పైగా సొంత అన్నయ్యకే కేబినెట్ బెర్త్ దక్కింది. దీంతో అసహనం వ్యక్తం చేయలేక.. అలాగని తన అనుభవాన్ని గుర్తించలేదని ఆవేదనను ఆదుపు చేసుకోలేక ఇబ్బందుల్లో పడ్డారు. సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. సొంత అన్నయ్య ధర్మాన కృష్ణదాస్‌ డిప్యూటీ సీఎం (Deputy CM Dharmana Krishnadas)గా ఉండడంతో.. సైలెంట్ అవ్వక తప్పలేదు. అధిష్టానం దగ్గర తన ఆవేదన చెప్పుకోలేకపోయారు. దీంతో ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచీ మౌనంగా ఉండిపోయిన ఆయన.. సడెన్‌గా అధికారపార్టీలో ఇప్పుడు అలజడి రేపుతున్నారు. ఏపీ ప్రభుత్వం (AP Government) ఏం చేస్తుంది.. ఏం చేయగలదు అనేది తన మార్కు ప్రసంగాలలో చెప్పేస్తూ... కొత్త వివాదాలకు తెర లేపుతున్నారు. ప్రజలకు, ప్రభుత్వాలకు ఏది ప్లస్సో.. ఏదీ మైనస్సో వివరించేస్తున్నారు. ఆ మాటల్లో ఎవరికి కావాల్సిన యాంగిల్‌ను వారు వెతుక్కుంటున్నారు. ప్రతిపక్ష టీడీపీ (Tdp) తనకు అనుకూలంగా కొన్ని.. ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కకూడదని భావిస్తున్న వైసీపీ(YCP) వర్గాలు మరికొన్ని తీసుకుని చేయాల్సిన రచ్చ చేసేస్తున్నాయి. దీంతో ఆయన ధర్మ సంకటంలో పడుతున్నారు.

  ఆ మధ్య ధాన్యం సేకరణ, ఉపాధి హామీ, రోడ్లు, మౌలిక వసతులపై ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్‌తో అధికారపార్టీ నాయకులే షాక్ తినాల్సి వచ్చింది. అక్కడి తోనే ఆయన దూకుడు ఆగలేదు. తాజాగా చెత్త పన్ను విషయంలో కాస్త ఘాటుగానే స్పందించారు. వంద రూపాయలు ఇవ్వకపోతే చెత్తను వాళ్ల ఇంటి దగ్గరే ఉంచేయాలని ఆయన చెప్పారు. ఉపాధి హామీ వంటి పథకాలు దేశ ప్రయోజనాలకు విఘాతమని తెలిపారు. పండిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని అధికారులు, మంత్రులు హామీ ఇస్తుంటే.. వరి సాగు దండగని.. ధాన్యం కొనే నాధులే లేరని విమర్శలు చేశారు ప్రసాదరావు. సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టడంతో రోడ్లు, మౌలిక వసతుల కల్పన ఆలస్యం అవుతోందని.. ఇకపై అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్‌ పెడతానని జగన్ సర్కార్ ను ఇరకాటంలో పడేశారు. దీంతో సమస్యలు ఉన్నాయని మాజీ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు అధికారపార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

  ఇదీ చదవండి : ఆ మాజీ మంత్రి లెక్క తప్పుతోంది.. ఏ ప్రయత్నం ఫలించడం లేదా..? అసలు ఆయన టార్గెట్ ఏంటంటే..?

  ముఖ్యంగా కేబినెట్‌ ప్రక్షాళనపై అధికార పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది మంత్రి అయ్యేందుకు చూస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు సైతం మరోసారి మంత్రి అనిపించేందుకు ఎదురు చూస్తున్నట్టు టాక్‌. ఆ విషయంలో ఎలాంటి సంకేతాలు వచ్చాయో ఏమో.. కర్ర విరగకుండా.. పాము చావకుండా ఆయన చేస్తున్న విమర్శలు చర్చగా మారుతున్నాయి. తనకు వీర విధేయుడు అయిన అన్నను పక్కన పెట్టి తమ్ముడు ధర్మానకు అధినేత జగన్ అవకాశం ఇస్తారా..? అసలు ప్రాసాదరావుకు అందిన సంకేతాలు ఏంటి అంటూ శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో పెద్దే చర్చే జరుగుతోంది. మరి తాజాగా ఆయన చేస్తున్నా కామెంట్స్.. ఈ మాజీ మంత్రికి అనుకూలంగా మారతాయో.. ప్రతికూలంగా ఉంటాయో చూడాలి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Srikakulam, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు