హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ పై కుట్ర.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani: లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ పై కుట్ర.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని (file)

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని (file)

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ భవిష్యత్తు కోసం తారక్ కు తీవ్ర అన్యాయం జరిగింది అన్నారు.. ఇంకా ఏమన్నారంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP), ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ అంటేనే అంత ఎత్తున మండి పడతారు..? తాజాగా మరోసారి టీడీపీ పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ (NTR DNA) లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. లోకేశ్ (Lokesh) కు అడ్డు వస్తాడనే జూనియర్ ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. లోకేశ్ ను ప్రజలపై రుద్ది, ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన బీసీలను సమూలంగా నాశనం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అక్రమించాలని పన్నాగాలు పన్నుతున్నారన్న కొడాలి నాని .. జోగి రమేష్ మంత్రి అయితే తాను, పేర్ని నాని , వల్లభనేని వంశీ మత్రులు అయినట్లేనని వెల్లడించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే ఉండేంత దమ్ము ధైర్యం కేవలం జగన్ కు మాత్రమే ఉందని, అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఏపీ ప్రజలకు ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు.

ఎన్టీ రామారావు డీఎన్ఏ బీసీలు. ఎన్టీఆర్ పిల్లలను అనాథలను చేశారు. చెట్టుకొకరిని, పుట్టకొకరిని చేశారు. గాలికి వదిలేశారు. లోకేశ్ రాజకీయాలకు అడ్డం వస్తాడేమో అని, ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఎన్టీఆర్ డీఎన్ఏగా ఉన్న బీసీలంతా ఎన్టీఆర్ తో పాటు నడుస్తారని, ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేశారు. పప్పు సుద్ద లాంటి సన్నాసి, మాట్లాడటం కూడా చేతకాని మాలోకం లోకేశ్ ను తీసుకొచ్చి బీసీలు పై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొడాలి నాని ఫైర్ అయ్యారు.

ఇదీ చదవండి : 20 ఏళ్ల తరువాత పవన్ ఇలా.. కారు టు కట్ డ్రాయర్ అంటూ ట్వీట్ల యుద్ధం

కేవలం తన కొడుకు నారా లోకేష్ కు అడ్డువస్తాడే కారణంతోనే.. జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్ ను ప్రజలపై రుద్ది, ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టీడీపీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని ఒక కులం పన్నాగాలు చేస్తోంది. ఎన్టీ రామారావు, వైఎస్ఆర్ కలిస్తే ఉండేంత దమ్ము కేవలం సీఎం జగన్ కు మాత్రమే ఉందన్నారు. అందుకే అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఏపీ ప్రజలకు ఉందని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : విశాఖ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ.. ఏ పార్టీ అన్నదానిపై జేడీ క్లారిటీ

రాష్ట్రాన్ని అక్రమించాలని పన్నాగాలు పన్నుతున్నారన్న కొడాలి నాని ఆరోపించారు. అయితే జోగి రమేష్ మంత్రి అయితే తాను, పేర్ని నాని, వల్లభనేని వంశీ మత్రులు అయినట్లేనని చెప్పారు. ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే ఉండేంత దమ్ము ధైర్యం కేవలం జగన్ కు మాత్రమే ఉందని, అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఏపీ ప్రజలకు ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Jr ntr, Kodali Nani

ఉత్తమ కథలు