హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM YS Jagan: విజయసాయిపై విమర్శలకు బ్రేక్.. కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ.. సీఎం జగన్ వ్యూహం అదేనా..?

CM YS Jagan: విజయసాయిపై విమర్శలకు బ్రేక్.. కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ.. సీఎం జగన్ వ్యూహం అదేనా..?

విజయసాయి రెడ్డి (ఫైల్)

విజయసాయి రెడ్డి (ఫైల్)

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డితో విజయసాయి రెడ్డిది వీడదీయలేని అనుబంధం.. అయితే ఇటీవల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని.. విజయసాయిని సీఎం పక్కన పెట్టారని విమర్శలు వచ్చాయి. వాటన్నింటికి ఎండ్ కార్డు వేస్తు.. అధినేత కీలక బాధ్యతలు అప్పగించారు..?

ఇంకా చదవండి ...

Anna Raghu, Guntur, News18.

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీ (YCP) అధికారంలోకి రావడంలో.. ఆ పార్టీకి 151 సీట్లు రావడానికి ప్రధాన కారకుల్లో విజయసాయి రెడ్డి ఒక్కరు.. సీఎం జగన్ నేరుగా ప్రజల్లోనే ఉంటే.. క్షేత్ర స్థాయి వ్యూహాల్లో విజయసాయి రెడ్డిదే కీలక పాత్ర అన్నది వైసీపీ వర్గాల టాక్.. ప్రశాంత్ కిషోర్ (Prasanth Kishore) టీం చెప్పిన ప్లాన్ పక్కగా అమలు అయ్యేలా చూసే బాధ్యత కూడా విజయసాయిరెడ్డిదే అని ప్రచారం ఉంది. విజయసాయి రెడ్డి పడ్డ కష్టాన్ని అధినేత జగన్ గుర్తించారు. అందుకే పార్టీలో కీలక పదవులు అప్పగిస్తూ వచ్చారు.. మొదట జాతీయ రాజకీయల బాధ్యత ఆయనకే అప్పగించారు. ఢిల్లీలో ఏ పని అవ్వాలన్నా మొదట సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) చూసేది విజయసాయి వైపే.. ప్రధాని, హోం మంత్రిల అపాయింట్ మెంట్ నుంచి.. కేంద్ర మంత్రులతో భేటీ వరకు అన్నీ విజయసాయి దగ్గరుండి చూసేవారు. అంతేకాదు పార్టీకి కీలకంగా భావించే ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా విజయసాయి రెడ్డికి అప్పగించారు. ముఖ్యంగా కాబోయే రాజధాని వ్యవహరాలన్నీ చూసుకునేది కూడా విజయసాయి రెడ్డే.. ఇలా ఎన్నికల ముందు ఆయన పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చారు జగన్..

విజయసాయి రెడ్డికి ఎన్ని పదవులు ఇచ్చినా.. పార్టీ వర్గాల్లో ఎప్పుడు ఓ చర్చ నడుస్తూనే ఉంది. సీఎం జగన్ కు .. విజయసాయి రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందని.. విజయసాయి రెడ్డిని సీఎం పక్కన పెట్టేశారని.. ఢిల్లీ వ్యవహారాలు సైతం మరొకరికి అప్పగించారని.. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి కూడా తప్పిస్తారని ప్రచారం ఉంది. ఈ వార్తలు ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూనే ఉన్నాయి. మరోవైపు ఆయన కూడా పదే పదే బీజేపీ కీలక నేతలను కలుస్తుండడంతో ఆ వార్తలు నిజమే అన్న భావన కొందరి వైసీపీ నేతల్లోనూ కలిగింది. అలాంటి సమయంలో ఊహించని ఆఫర్ ఇచ్చారు సీఎం జగన్.. విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. 

ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ అన్ని అనుబంధ విభాగాలను అప్పగించారు. ఈ విభాగాలకు విజయసాయిని ఇంఛార్జిగా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో విజయసాయిరెడ్డి ఇక నుంచి పార్టీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలను కూడా చూసుకోనున్నారు. తాజాగా వైసీపీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలను అప్పగించడంతో విజయసాయిరెడ్డిపై బాధ్యతలు మరింత పెరగనున్నాయి.  సీఎం నిర్ణయానికి విజయసాయి ధన్యవాదాలు తెలిపారు.


అయితే దీనిపైనా విమర్శలు వినిపస్తునే ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జి బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్.. కొంతకాలం క్రితం ఆ బాధ్యతల నుంచి తొలగించారని.. అది వర్గ పోరుగా కాకుండా ఉండేందుకే.. ఇలాంటి బాధ్యతలు ఇచ్చి.. ఉత్తరాంధ్ర నుంచి ఆయనను పూర్తిగా తప్పించారంటూ రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Vijayasai reddy, Visakhapatnam

ఉత్తమ కథలు