ANDHRA PRADESH POLITICAL NEWS CM JAGAN SISTER YS SHARMILA CLARITY ON POLITICAL PARTY IN AP NGS
YS Sharimila: ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటు..! క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల..
ys sharmila
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీ పెట్టడానికి షర్మిల సిద్ధమయ్యారా..? ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైందా..? అన్న వదిలిన బాణం అనుకున్న షర్మిల.. ఇప్పుడు అన్నపైనే రాజకీయ బాణం వదులుతున్నారా..? తాజాగా ఆమె చేసిన వ్యాఖమ్యలు సంచలనంగా మారాయి..
YS Sharmila Clarity on Political Party In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మరో రాజకీయ పార్టీ పుట్టుకోస్తోంది. అది కూడా వైఎస్ ఫ్యామిలీ (YS Family) నుంచి మరో పొలిటికల్ పార్టీ ప్రారంభం అవుతోంది. ఈ ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణంగా వైసీపీ (YCP) తరపున ప్రచారం చేసిన వైఎస్ షర్మిల (YS Sharmila).. ఇప్పుడు నేరుగా అన్న జగన్ పై రాజకీయ బాణం ఎక్కు పెట్టనున్నారు. దీనిపై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఎంపీ రఘురామరాజు కూడా వ్యాఖ్యానించారు. త్వరలోనే షర్మిల ఏపీలోకి అడుగు పెడతారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించి .. నిర్మాణంపై ఫోకస్ చేశారు. ఆవేదన యాత్ర, భరోసా యాత్రలతో ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే ఆమె పొలిటికల్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి అన్న జగన్ చెల్లి షర్మిల ఎదురెదురుగా మాట్లాడుకున్న సందర్భం లేదు. దీంతో ఆమె ఏపీలోనూ పార్టీ పెడతారంటూ ప్రాచారం జరిగింది. ఈ అనుమానాలపై తొలిసారి షర్మిల స్పందించారు. ఏపీలో పార్టీ ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు..
ఏపీలో రాజకీయ పార్టీ పెడుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పారు. రాజకీయ పార్టీ అన్నది ఎవరైనా.. ? ఎక్కడైనా పెట్టవచ్చు అన్నారు. ఏపీలో పార్టీ పెడితే ఏమైనా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. ఏపీలో తాను రాజకీయ పార్టీ పెట్టకూడదని ఎక్కడా రూల్ లేదన్నారు. ప్రస్తుతం తాను ఒక మార్గాన్ని ఎంచుకున్నాను అని.. అందులో నడుస్తున్నాను అంటూ.. భవిష్యత్తు పై పార్టీ పెట్టే యోచన వుందని పరోక్ష సంకేతాలు అందించారు..
ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ కానున్నాయి. ఆమె నిజంగా పార్టీ పెడితే అది అధికార పార్టీకి పెద్ద మైనస్ అయ్యే ప్రమాదం ఉది. వైఎస్ కుటుంబంలో చాలామంది జగన్ కు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ విజయమ్మ ఎటు ఉంటారు అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇటీవల ఆ కుటుంబంలో జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే ఆమె కూతురు తరుపునే నిలబడే అవకాశం ఉంటుంది..
వైఎస్ జగన్-వైఎస్ షర్మిల మధ్య కేవలం రాజకీయ విబేధాలే కాదు.. వ్యక్తిగత విబేధాలు ఉన్నాయన్నది పలు సందర్భాల్లో బయట పడింది. తాజాగా రెండు సందర్భాలు ఇద్దరి మధ్య గ్యాప్ పై క్లారిటీ వచ్చేలా చేశాయి. మొదటి సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా.. ప్రధాని మోదీ, టాలీవుడ్ స్టార్లు, ఆఖరికి విపక్ష నేత చంద్రబాబు సైతం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు కానీ.. షర్మిల మాత్రం కనీసం సోషల్ మీడియాలోనూ శుభాకాంక్షలు చెప్పలేదు..
ఇక క్రిస్మస్ రోజు ప్రతి ఏడాది కుటుంబ సభ్యులు అంతా కలిసే తండ్రికి నివాళులర్పించండం.. తరువాత మత ప్రార్థనల్లో పాల్గోవడం జరుగుతుంది. కానీ ఈ సారి క్రిస్మస్ వేడుకలు ఇద్దరు పులివెందులలోనే ఉన్నా.. ఎవరికి వారు అన్నట్టు వ్యవహరించారు. తాజాగా షర్మిల్ చేసిన వ్యాఖ్యలతో మరింత క్లారిటీ వచ్చేసింది..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.