Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh) రోజు రోజుకూ ఎన్నికల హీట్ పెరుగుతోంది. అన్ని పార్టీలు వ్యూహాలు.. ప్రతి వ్యూహాలపై ఫోకస్ చేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా నేతల అంతా గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. మరికొందరు సీటు కోసం.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇదేసమయంలో కొన్ని నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య విబేధాలతో పార్టీ శ్రేణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) లో తిరుగులేని నేతగా.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తారువాత నెంబర్ 2గా చెప్పుకునే యనమల ఇంటిలోనూ వర్గ పోరు పెరుగుతోంది. కాకినాడ జిల్లా (Kakinada District) తుని నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Ex Minister Yanamala Ramakrishnudu) గత నలభై ఏళ్ళుగా చక్రం తిప్పుతున్నారు. వరుసగా ఆరుసార్లు ఇక్కడి నుండి విజయం సాధించిన ఆయన మంత్రిగా, స్పీకర్ గా రాష్ట్రానికి విశేష సేవలు అందించారు. కానీ 2009 ఎన్నికలలో ఓడిన తర్వాత నుండి ఆయన ప్రత్యక్షఎన్నికలకు దూరంగా ఉంటున్నారు.
ఇదీ చదవండి : సీఎం జగన్ కు షాక్.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశామని ఓట్లడుగుతాం
గడిచిన రెండు ఎన్నికలలో ఆయన పోటీ చేయకుండా ఆయన సోదరుడు కృష్ణుడుకి అవకాశం కల్పించారు. కానీ వరుసగా ఓటములను చవి చూశారు. దీంతో పార్టీ అధిష్టానం యనమల సోదరులను పక్కపెట్టే ఆలోచనలో ఉందంటే.. ఐతే ఎలాగైనా ఈసారి తనకే టికెట్ తెచ్చుకోవాలని కృష్ణుడుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి : సొంత నియోజకవర్గంలో మంత్రికి చుక్కలు.. అసమ్మతికి కారణం ఇదే
యనమల రామకృష్ణుడు మాత్రం తన కుమార్తె దివ్యకు టికెట్ ఇప్పించు కునే పనిలో ఉన్నారనే ప్రచారంతో అన్నదమ్ముల మధ్య విభేధాలను మరింత ముదిరింది. తనను కాదని తన అన్న టికెట్ దివ్యకు ఎలా ఇప్పిస్తాడని అంటున్నట్టు సమాచారం. నియోజకవర్గంలోని ముఖ్యనాయకులను తనకు మద్దతు ఇవ్వమంటూ యనమల కృష్ణుడు మాట్లాడినట్లుగా ఓ ఆడియో ఇటీవలికాలంలో వైరల్ అయ్యింది.
ఇదీ చదవండి : రాత్రికి రాత్రే నిర్మాణాలు.. ఖాళీ స్థలం ఉంటే అక్కడ అంతే సంగతి
యనమల యనమల రామకృష్ణుడు మాత్రం.. అధిష్ఠానం నిర్ణయించిన వారికే తుని నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని చెబుతున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడిలో22 పంచాయతీల కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి.. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారు చెప్పిన విషయాలను అధిష్ఠానానికి వివరిస్తానన్నారు. అయితే ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే టికెట్ తన సోదరుడైన కృష్ణుడి కే ఇవ్వాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: ఇడ్లీ ఫ్యాక్టరీ గురించి ఎప్పుడైనా విన్నారా..? ఎన్నిరకాలు ఉంటాయో తెలుసా..?
యనమల యనమల రామకృష్ణుడు మాత్రం.. అధిష్ఠానం నిర్ణయించిన వారికే తుని నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని చెబుతున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడిలో22 పంచాయతీల కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి.. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారు చెప్పిన విషయాలను అధిష్ఠానానికి వివరిస్తానన్నారు. అయితే ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే టికెట్ తన సోదరుడైన కృష్ణుడి కే ఇవ్వాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి : 400 రోజులు.. 4000 కిలోమీటర్లు.. 27 నుంచి లోకేష్ పాదయాత్ర.. యువ ఓటర్లే లక్ష్యంగా పేరు
రామకృష్ణుడు స్పందిస్తూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. ముందుగా దీనిని అంతమొందించాలన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఓ పద్ధతి ప్రకారం టీడీపీ విజయానికి కృషి చేస్తున్నారని, దీనికి అందరం సహకరించాలన్నారు. 2024 ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమవేశంలో మాట్లాడిన ఇన్‌ఛార్జి యనమల కృష్ణుడు 40 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేశానన్నారు. ఆ ఉద్దేశంతోనే టికెట్ ఇవ్వాలని మాట్లాడానన్నారు. సామాజిక మాధ్యమాలు, పలు ఛానళ్లలో దానిని వక్రీకరించి ప్రచారం చేశారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, TDP, Yanamala Rama Krishnudu