Home /News /andhra-pradesh /

No OTS: నేను ముఖ్యమంత్రి అయితే.. అన్ని ఇళ్లకు ఫ్రీగా ఇళ్ల పట్టాలు.. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు పట్టా ఏంటి..? చంద్రబాబు ఫైర్

No OTS: నేను ముఖ్యమంత్రి అయితే.. అన్ని ఇళ్లకు ఫ్రీగా ఇళ్ల పట్టాలు.. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు పట్టా ఏంటి..? చంద్రబాబు ఫైర్

చంద్రబాబు ఫైల్...

చంద్రబాబు ఫైల్...

Chandrababu Naidu on cm Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (Jagananna Sampoorna Gruha hakku Scheme) పెను వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వం దగ్గర రుణం తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నవారు నిర్దేశించిన ఛార్జీలు చెల్లిస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగు ముందుకేసి.. తాను సీఎం అయితే ఏం చేస్తారో చెప్పారో..

ఇంకా చదవండి ...
  Chandrababu naidu on OTS:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (Jagananna Sampoorna Gruha hakku Scheme) పెను దుమారం రేపుతోంది.  ప్రభుత్వం దగ్గర రుణం తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నవారు నిర్దేశించిన ఛార్జీలు చెల్లిస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఐతే ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ (tdp) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  (Nara Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు పట్టాలు ఏంటని ప్రశ్నించారు. ప్రజల ను దోపిడీ చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని చంద్రబాబు మండిపడ్డారు..

  తాను సీఎం అయిన తరువాత అన్ని ఇళ్ళకు పట్టాలు ఇస్తాను అన్నారు చంద్రబాబు. అది కూడా నెలరోజుల్లో అన్ని ఇళ్లకు పట్టాలిచ్చి మాట నిలబెట్టుకుంటాను అన్నారు. గురజాల నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా ఎన్నికలు జరిగితే గురజాల, దాచేపల్లి మునిసిపల్ ఎన్నికల్లో విజయం మనదేనన్నారు. 8 మంది టీడీపీ కార్యకర్తల హత్యకు సీఎం సమాధానం చెప్పగలారా అని చంద్రబాబు నిలదీశారు. ఎప్పుడో కట్టిన ఇళ్లకి, ఇచ్చిన ఇంటి స్థలాలకు ఇప్పుడు పట్టాలు ఏంటని చంద్రబాబు నిలదీశారు. పట్టాలకు 10 వేలు ఎందుకు కట్టాలని ఆయన నిలదీశారు.

  ఇదీ చదవండి : లోకేష్ ను చంద్రబాబే ఓడించారా..? ఆ పదవికి అడ్డుపడతారని భావించారా..? మంత్రి సంచలన వ్యాఖ్యలు

  ఇళ్లు లేని వారికి ఉచితంగా ఇళ్లు పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వానిదే అని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో వరదలు వస్తే హెచ్చరికలు కూడా చేయకపోవడం దారుణం. నెల్లూరు ముంపునకు ఇసుక అక్రమ తవ్వకాలే కారణమన్నారు. ఓ మంత్రి వరి వేయొద్దంటున్నారని, మరి వేయాలని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌రెడ్డి స్పెషల్ స్టేటస్ తేలేడు కానీ..స్పెషల్ స్టేటస్ బ్రాండ్ మద్యం తెస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు..

  ఇదీ చదవండి : అది నిజమని నిరూపిస్తే బొత్స రాజీనామ చేస్తారా..? రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని గోరంట్ల విమర్శ

  అంతకుముందు జగన్నన సంపూర్ణ ఇళ్ల పథకంపై నారా లోకేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. డ్వాక్రా అక్కాచెల్లెళ్ల‌మ్మ‌ల‌కు అండగా ఉంటానన్న సీఎం జగన్ ఇప్పుడు వారికే టోక‌రా వేశార‌ని లోకేష్  ఆవేదన వ్యక్తం చేశారు.  ద‌శాబ్దాల‌ క్రితం క‌ట్టుకున్న ఇళ్ల‌కు ఇప్పుడు వ‌న్‌ టైమ్ సెటిల్మెంట్ అంటూ ఒక్కొక్క‌రి నుంచీ బ‌ల‌వంతంగా ప‌దివేలు వ‌సూలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు.

  ఇదీ చదవండి : ఆ మంత్రికి అధికారులు అవసరం లేదా..? అసలు వారితో సమస్య ఏంటి?

  ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా ఓటీఎస్ ఎవ్వ‌రూ రూపాయి క‌ట్టొద్ద‌ని,  ఓటీఎస్‌ కింద పొదుపు ఖాతాల నుంచి జ‌మ వేసుకునే చ‌ర్య‌ల‌ను మ‌హిళ‌లంతా సంఘ‌టిత‌మై అడ్డుకోవాల‌ని లోకేష్ పిలుపు ఇచ్చారు. టిడిపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఇళ్ల‌ను ఉచితంగా రిజిస్ట్రేష‌న్ చేస్తామ‌ని లోకేష్ హామీ ఇచ్చారు. కాసేపటికే చంద్రబాబు కూడా అదే మాట చెప్పారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu naidu, Cm jagan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు