Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS CHANDRABABU NAIDU SLAMS ON CM JAGAN TOMORROW ON WORDS TDP STARTS PROTEST NGS

Chandrababu Naidu: ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి.. టీడీపీ కొత్త నినాదాం ఇదే..

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ లో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. రోజు రోజుకూ నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. పన్నులు పెరుగిపోతున్నాయి. దీంతో బతుకు భారంగా మారుతోంది. అయితే ఈ పరిస్థితి మారాలి అంటే జగన్ ప్రభుత్వం కిందకు దిగాలి టీడీపీ డిమాండ్ చేస్తోంది. ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి అనే పేరుతో టీడీపీ నిరసనలకు పిలుపు ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    AP TDP Chief Chandrababu Naidu:  ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇస్తోంది తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party). ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ (AP Government) వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని.. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) క్యాడర్ కు పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరల తగ్గింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. రేపటి నుంచి నిరసనలు కొనసాగించాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఏపీ ప్రభుత్వం తీరుపై విరుచుకు పడ్డారు. “ధరలు దిగిరావాలి….జగన్ దిగిపోవాలి” పేరుతో నిరసనల కార్యక్రమాలు చేపట్టాలని కేడర్ కు సూచించారు.

    ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక వైసీపీ (YCP) డిఫెన్స్ లో ఉందన్నారు బాబు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో గ్రామ స్థాయిలో వైసీపీ క్యాడర్, రాష్ట్ర స్థాయిలో వైసీపీ లీడర్లు (YCP leaders) కూడా ఇబ్బంది పడుతున్నారని, మైనింగ్ దోపిడీపై పూర్తి స్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని కేడర్ కు, నేతలకు ఆయన పిలుపునిచ్చారాయ. మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి (Peddi Reddy Rama chandra Reddy) క‌నుస‌న్నల్లోనే రాష్ట్రంలో మైనింగ్ దోపీడీ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. తక్షణమే ఆయనను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని బాబు డిమాండ్ చేశారు. మైనింగ్, మ‌ద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియా ద్వారా ఇప్పటికే వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. చివరకు నాడు-నేడు కార్యక్రమాల్లో కూడా అవినీతికి పాల్పడ్డారని, పీఆర్సీని పున‌ స‌మీక్షించాలన్నారు.

    ఇదీ చదవండి : ఆర్ఆర్ఆర్.. రాధేశ్యామ్ వాయిదాకు అదే కారణం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

    గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌ను రెగ్యులర్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే రాజధానిలో 29 గ్రామాలు లేకుండా కార్పోరేషన్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వినుకొండ‌లో మ‌ద్దతు ధ‌ర అడిగిన రైతుపై అక్రమ కేసు పెట్టడం దారుణమని మండిపడ్డారు. పంచాయతీల్లో సీఎం జగన్ విపరీతమైన పన్నుల భారాన్ని మోపారని వెల్లడించిన చంద్రబాబు.. ఏటా జనవరి ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేస్తామనే సీఎం జగన్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

    ఇదీ చదవండి : సినిమాల్లేకే టైం పాస్ చేస్తున్నారు.. ఇదంతా ఐదుగురి గేమ్ ప్లాన్

    ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై.. మంత్రులు మండిపడుతున్నారు. సీఎం జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథ పడుతున్నారని.. ఆయనకు వస్తున్న ఆధరణ చూడలేక చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని.. మంత్రి పెద్ది రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు అటెండర్ ను కూడా నిలబెట్టి గెలిపించే సత్తా వైసీపీకి ఉందన్నారు పెద్ది రెడ్డి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu naidu, Tdp, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు