హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu: ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu: ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

chandrababu: ఆంధ్రప్రదేశ్ లో వరదలను కేంద్రం కు తెలిసేలా చేయాలి అన్నారు చంద్రబాబు. పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అన్నదానిపై ఎంపీలకు దిశ నిర్దేశం చేశారు.

  Chandrababu: పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై తమ పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దిశానిర్దేశం చేశారు.  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని పార్టీ ఎంపీలతో చంద్రబాబు చెప్పారు. ఇటీవల వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడ పరిస్థితులను కళ్లారా చూసిన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు పడతాయని.. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిందని..  ఏపీకి వరదలు (AP Floods) వచ్చే అవకాశం ఉందని తెలిసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం.. అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జరిగిపోయిన తరువాత కూడా సరైన సహాయచర్యలు చేపట్టడం లేదని.. సీఎం జగన్ మొహన్ రెడ్డి  గాల్లో వచ్చి.. గాల్లోనే వెళ్లిపోతున్నారని.. ప్రజలంటే ఆయనకు చులకన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాలను ఎంపీలకు గుర్తు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం (AP Government) ఎలాగూ పట్టించుకునే అవకాశం లేదు.. కేంద్ ప్రభుత్వం  (Central Government) అయినా కలుగజేసుకుని సాయం చేసేలా చేయండి అంటూ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం ద్వారా పార్టీ ఎంపీలకు పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌(Galla Jaydev), కేశినేని నాని (Kesaneni nani), రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu), కనకమేడల రవీంద్ర (Kanakamedala ravindra) కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, జ్యుడీషియల్‌ విచారణకి డిమాండ్ చేయాలని టీడీపీ భావిస్తోంది. వరదల అంశంతో పాటు ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్ ఉభయ సభల్లో ఒత్తిడి తేవాలని ఎంపీలకు ఆయన సూచించారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్‌ సరఫరా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని ఆదేశించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని సూచించారు. ఇక, పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు మళ్లింపు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు స్పష్టం చేశారు చంద్రబాబు.

  ఇదీ చదవండి: వరదలు మంచెత్తితే టాలీవుడ్ ఎక్కడుంది..? టికెట్లు మాత్రం పెంచాలా..? వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  అలాగే ఇందన ధరలపైనా పోరాటం చేయాలి అన్నారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై జగన్‌ ప్రభుత్వ పన్నులు, నిత్యావసర ధరల పెరుగుదల, ప్రత్యేకహోదా, 3 రాజధానుల బిల్లు వంటి అంశాలపై లేవనెత్తాలని చంద్రబాబు చెప్పారు. ఏపీలో వరి పంట వేయరాదని మంత్రులు ప్రకటించిన అంశాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు చంద్రబాబు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి 40 కోట్ల రూపాయల సుపారీ, అడ్వాన్సుగా కోటి రూపాయల చెల్లింపులపై ఈడీ విచారణకు పార్లమెంటులో డిమాండ్ చేయాలని ఎంపీలతో చెప్పారు చంద్రబాబు.

  ఇదీ చదవండి: : భక్తులకు బిగ్ షాక్..? 16 నిమిషాల్లోనే 3 లక్షల టికెట్లు.. కరోనా భయమే కారణమా..?

  ఈ సమావేశంతో మరోక్లారిటీ కూడా వచ్చింది. గల్లా జయదేవ్, కేశినేని నానిలు టీడీపీని వీడుతున్నారని.. చంద్రబాబుకు అసలు టచ్ లో లేరనే వార్తలు వినిపించాయి. అయితే ఇటీవలే కేశినాని నిత్యం చంద్రబాబును కలుస్తూ పార్టీలో యాక్టివ్ అయ్యారు. కానీ గల్లా జయదేవ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదని.. బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ ఊహాగానాలకు చెక్ పెడుతూ.. చంద్రబాబుతో సమావేశానికి హాజరయ్యారు గల్లా జయదేవ్.. దీంతో పార్టీ మారుతున్నారనే ప్రచారానికి ఎండ్ కార్డు పడినట్టే.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు