ANDHRA PRADESH POLITICAL NEWS CASE FILE AGAINST SOMU VEERAJJU SON IN LAW ON DOCUMENTARY AND FORGERY NGS GNT
AP Crime: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు.. కారణం ఏంటంటే..?
చిక్కుల్లో సోమువీర్రాజు
AP Crime: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఒకప్పుడు ఆయన ఉన్నారనే సంగతే రాజకీయనాయకులు పట్టించుకునే వారు కాదు.. కాని ప్రస్తుతం రోజు ఏదో ఒకరకంగా హైలెట్ అవుతున్నారు. అయితే తాజాగా ఆయన అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.
AP Crime: బీజేపీ (BJP) ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu Veerajju) ను వివాదాలు వెంటాడుతున్నాయి. గతంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా.. ఏ రాజకీయ పార్టీ ఆయన ప్రస్తావన తెచ్చేది కాదు.. ఉన్నారంటే ఉన్నారు అన్నట్టు పరిస్థితి ఉండేది.. అయితే ఆ మధ్య ఆయన.. వచ్చే ఎన్నికల తరువాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి సంచలన రేపారు. అప్పటి నుంచి నిత్యం ఏదో ఒకరంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ మధ్య జనాగ్రహ సభ పేరుతో విజయవాడ (Vijayawada)లో జరిగిన సభలో సోము వీర్రాజు (Somu Veerraju) చేసిన కామెంట్లు ఇప్పటికే హైలైట్ అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. అన్ని పార్టీలు సోము వీర్రాజు వ్యాఖ్యలకు కౌంటర్లు వేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను 75 రూపాయలకే ఇస్తామని.. రెవెన్యూ బాగుంటే.. 50రూపాయలకు కూడా ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇటు నెటిజన్లు.. అటు రాజకీయ నేతలు సోమును ఆట ఆడేసుకుంటున్నారు. ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ట్రోల్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తనకు సంబంధంలోని మరో వివాదంలో ఇరుకున్నారు. సోమువీర్రాజు అల్లుడిపై చీటింగ్ ఫోర్జరీ కేసు నమోదైంది. కారణం ఏంటంటే..?
సోము వీర్రాజు అల్లుడు కవల వెంకట నరసింహం తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్బీఐ బ్యాంకులో లోన్ తీసుకున్నట్టు ఫిర్యాదు అందింది. రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు టౌన్ పోలీస్స్టేషన్లో గత నెల 4న జయరామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమువీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై ఐఏలూరులోని చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు అయ్యింది. దీంతో సోమువీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసులో నరసింహంను ఇంకా అదుపులోకి తీసుకోలేదు. ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా.. నరసింహంకు బాగా పరిచయం ఉన్నవ్యక్తి అంటున్నారు. ఏ విషయంలో విరీద్దరి మధ్య విబేధాలు తలెత్తాయో అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా ఈ కేసుపై ఇంకా స్పందించలేదు.
ప్రస్తుతం ఈ కేసు సోమువీర్రాజును చిక్కుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. అయితే సోమువీర్రాజు సన్నిహితులు మాత్రం దీన్ని రాజకీయ, వ్యక్తిగత కుట్రగా చెబుతున్నారు. సోమువీర్రాజు సన్నిహితులు.. అల్లుడు ఎలాంటి ఫోర్జరీకి ప్రయత్నించలేదని.. కవాలనే కొందరు అక్రమ కేసులు పెడుతున్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోమువీర్రాజు కానీ.. ఆయన అల్లుడి కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. కవల వెంకట నరసింహం మాట్లాడితే కేసుపై క్లారిటీ వస్తుంది. పోలీసులు మాత్రం నేరం చేసింది.. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలు నిజమని తేలితే.. ఇటు సోము వీర్రాజు రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే అయనకు వ్యతిరేకంగా ఓ వర్గం బీజేపీ లో ఉంది. ఇటీవల సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యల కూడా వైరల్ అవ్వడంతో అధిష్టానానికి కొందరు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దీన్ని అవకాశంగా చేసుకుని ఆయన్ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.