Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL NEWS BJP MP GVL NARASIMHA RAO KEY COMMENTS ON CAPITAL AMARAVATHI NGS

GVL Narasimha Rao: ఏపీ రాజధాని పై కేంద్రం మనసులో మాట ఇదే.. పూర్తి క్లారిటీ ఇచ్చిన బీజేపీ కీలక ఎంపీ

తిరుపతిలో అమరావి రైతుల పాదయాత్ర ముగింపు సభ

తిరుపతిలో అమరావి రైతుల పాదయాత్ర ముగింపు సభ

GVL Narasimha Rao: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అమరావతి టర్న్ తీసుకున్నాయి.. అధికార-విపక్షాల మధ్య రాజధాని రగడ రేపింది. శుక్రవారం అమరావతి రైతులు ఏపీకి ఒకే రాజధాని అంటూ భారీ బహిరంగ సభ పెడితే.. ఇవాళ రాయలసీమలో కొందరు మూడు రాజధానులే ముద్దు అంటూ ర్యాలీలు చేశారు. ఈ సమయంలో రాజధానిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు బీజేపీ కీలక ఎంపీ.

ఇంకా చదవండి ...
  GVL Narasimha Rao :  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని ఏదీ..? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని అంశం  హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీకి మూడు రాజధానులు అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే, అమరావతి (Amaravati) ఒక్కటే రాజధాని అని విపక్షాలు అంటున్నాయి. శుక్రవారం  తిరుపతి సాక్షిగా అమరావతి రాజధానులు మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ తీరుపై విపక్షాతు తీవ్రంగా మండిపడ్డాయి. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి (Capital Amaravathi) మద్దతిచ్చిన సీఎం జగన్ (AP CM YS Jagan) ఇప్పుడు మాట తప్పి.. మడప తిప్పారని  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) విమర్శించారు. దీనిపై వివిధ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని, అందులో ఎలాంటి మార్పు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minster Peddireddy Ramachandra Reddy) మరోసారి తేల్చి చెప్పేశారు.  తాజాగా బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  తాజాగా ఈ అంశంపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్లు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గానే గుర్తించిందని, అమరావతి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు. రాయలసీమలోనే హైకోర్టు పెట్టండని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తాము చెప్పామని ఆయన గుర్తు చేశారు.

  ఇదీ చదవండి : నా మాటే శాసనం.. శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. పరిటాల శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్

  ప్రస్తుత పరిస్థితుల్లో హైకోర్టు విషయం ఇప్పుడే తేలేలా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై ఈ వ్యాఖ్యలు చేశారు.

  ఇదీ చదవండి :ఊ అంటావా మామా పాటకు మేల్ వెర్షన్ విన్నారా..? కౌంటర్ మామూలుగా లేదుగా

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ మంది సీఎంలు రాయలసీమ నుంచే వచ్చారని… అయినప్పటికీ రాయలసీమ అభివృద్ధి చెందలేదని జీవీఎల్ అన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోందని చెప్పారు. అందుబాటులో ఉన్న అవకాశాలను ఏపీ ప్రభుత్వం వాడుకోవడం లేదని విమర్శించారు.

  ఇదీ చదవండి : కూతురితో కలిసి మంత్రి అదిరే స్టెప్పులు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

  తాజా పరిస్థితులు చూస్తుంటే బీజేపీ నేతలు పూర్తిగా అమరావతి స్టాండ్ తీసుకున్నారు. అందుకే శుక్రవారం సభలో సైతం ఆ  పార్టీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి వచ్చి.. బీజేపీ నేతలతో సమావేశం అవ్వడం.. ఆ సమావేశంలో అమరాతికి అనుకూలంగా ఉండాలి అని స్పష్టంగా చెప్పడంతో.. బీజేపీ నేతలంతా ఇప్పుడు అమరావతి జపం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.. జాతీయ పార్టీలతో సహా అన్ని పార్టీలు అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం వ్యతిరేకిస్తోంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Amaravathi, Andhra Pradesh, Ap bjp, AP News, GVL Narasimha Rao

  తదుపరి వార్తలు