హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big Shock to YCP: వైసీపీకి ఊహించని షాక్.. ఆమె అనుమతిస్తే కన్నీళ్లతో కాళ్లు కడుగుతాం.? అధికార పార్టీ ఎమ్మెల్యే

Big Shock to YCP: వైసీపీకి ఊహించని షాక్.. ఆమె అనుమతిస్తే కన్నీళ్లతో కాళ్లు కడుగుతాం.? అధికార పార్టీ ఎమ్మెల్యే

నారా భువనేశ్వరి, చంద్రబాబు

నారా భువనేశ్వరి, చంద్రబాబు

Big Shock to YCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా భువనేశ్వరి ఎపిసోడ్ కు ఇప్పట్లో ఎండ్ పడేలా కనిపించడం లేదు. ఓ వైపు మంత్రులు, అధికార పార్టీ నేతలు అంతా చంద్రబాబు నాయుడువి అన్నీ డ్రామాలని.. నారా భువనేశ్వరిపై ఎవరూ వ్యాఖ్యలు చేయలేదంటూ పదే పదే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కన్నీళ్లతో ఆమె కాళ్లు కడుగుతాను అనడం సంచలనంగా మారింది.

ఇంకా చదవండి ...

Rachamallu Siva Prasad Reddy Comments:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) లో ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)పై అధికార వైసీపీ ఎమ్మెల్యేల దారుణ వ్యాఖ్యల దుమారం ఆగడం లేదు.  వైసీపీ (ycp) నేతల అనుచితల వ్యాఖ్యలతో తీవ్రంగా కలత  చెందిన చంద్రబాబు.. మీడియా సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు, వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో అప్పటి నుంచి ఏపీ రాజకీయలు ఇదే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. అయితే వైసీపీ మంత్రులు నేతలు అంతా చంద్రబాబువి డ్రామాలని మండిపడుతున్నారు. అసలు భువనేశ్వరిని ఎవరూ ఏమి అనలేదంటూ వివరణ ఇచ్చుకొచ్చారు. అసెంబ్లీలో భువనేశ్వరి ప్రస్థావనే రాలేదని.. చంద్రబాబు కావాలని తన భార్యను రోడ్డుపైకి తెచ్చారంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) స్వయంగా నారా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. అయితే ఆ వ్యాక్యలు అసెంబ్లీలో చేసినవి కావని.. బయట ఎప్పుడో మాట్లాడిన మాటలకు చంద్రబాబు ఇప్పుడు ఏడవడం ఏంటని  మంత్రి కొడాలి నాని (Minster kodali nani) ప్రశ్నించారు. అయితే ఇలాంటి సమయంలో మరో వైసీపీ నేతల సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు చింతుస్తున్నామని అన్నారు.

అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు వివరించాలని.. దీనికోసం గ్రామాల వారీగా టీడీపీ ప్రజా గౌరవ సభలను నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. తాజాగా ఇదే అంశంపై కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రజా గౌరవ సభలపై ఎమ్మెల్యే రాచమల్లు పలు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రజా గౌరవ సభల పేరుతో అందరికీ సోదరి సమానులైన చంద్రబాబు సతీమణి శీలాన్ని బజారుకీడ్చడం బాధాకరమంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను ఇలాంటి సభల ద్వారా మరింత బాధపెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నా.. అసెంబ్లీలో మంత్రిగా తొలి అనుభవాన్ని గుర్తు చేసుకున్న హరీష్ రావు

వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా తమందరికీ.. ఒకే గౌరవమంటూ ఆయన అన్నారు. ఎవరైనా ఏ మహిళనైనా కించపరిచడం సరైంది కాదన్నారు. ఎవరు చేసినా అది తప్పే అంటూ మండిపడ్డారు. ఈ విషయానికి ముగింపు పలకాలని తాను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ సూచించారు. నిజంగా భువనేశ్వరి అక్క.. తనని అనరాని మాటలు అని, వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావించి ఉంటే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇదీ చదవండి: అధికార పార్టీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. సీఎం క్లాస్ పీకినా తగ్గేతే లే అంటున్న వైసీపీ నేతలు

ఆమె అనుమతి ఇస్తే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలమంతా కలిసి కన్నీటితో కాళ్ళు కడుగుతామంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాటకోసం భార్యను చక్రవర్తి ఇంటికి పనికి పంపితే..ఈనాడు చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం, తన భార్య శీలాన్ని బజారుకీడ్చడం బాగాలేదన్నారు. తప్పు అయితే క్షమించమని తాము అంటున్నామని.. ఇకపైనైనా చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని రాచమల్లు విజ్ఞప్తి చేశారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, Chandrababu Naidu, Ycp

ఉత్తమ కథలు